అన్వేషించండి

Must Visit Shiva Temples in Telangana: కార్తీకమాసం స్పెషల్..తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలు!

Shiva Temples in Telangana: కార్తీకమాసం నెలరోజులు శైవ క్షేత్రాలు పంచాక్షరి మంత్రంలో మారుమోగిపోతుంటాయి. నిత్యం భక్తుల సందడి ఉన్నప్పటికీ ఈ నెల రోజులు చాలా ప్రత్యేకం.

Must Visit Shiva Temples in Telangana: కార్తీకమాసంలో తెలంగాణలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన శైవ క్షేత్రాలివే..వీటిలో మీరెన్ని దర్శించుకున్నారు..

వేములవాడ రాజరాజేశ్వరస్వామి

సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజరాజేశ్వరస్వామి కొలువయ్యాడు. ఇక్కడ శంకరుడిని రాజన్నగా భక్తులు ఆరాధిస్తారు. అత్యంత ప్రాచీనమైన శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయాన్ని  దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడ కోడెను సమర్పిస్తే సంతానం లేని దంపతుల ఆశ తీరుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ గండదీపాలు వెలిగిస్తే గండాలు తొలగిపోతాయని నమ్మకం.  ఏటా శివరాత్రి, కార్తీకమాసంలో ఇక్కడ జరిగే అభిషేకాలు, పూజలు చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తుసు తరలివస్తారు. 

కీసరగుట్ట

హైదరాబాద్ సమీపంలో మేడ్చర్ జిల్లాలో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట. కార్తీకమాసంలో ఈ క్షేత్రం భక్తులతో కళకళలాడుతుంది. ఏటా శివరాత్రికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కార్తీకమాసం నెలరోజులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆధ్యాత్మిక శోభను తిలకించేందుకు భారీ భక్తులు తరలివస్తారు. 

Also Read: కార్తీకమాసంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి - ఏం తినాలి , ఏం తినకూడదు!

కొమురవెల్లి మల్లన్న

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో కొండపై కొలువయ్యాడు కొమురవెల్లి మల్లికార్జునుడు. ఈ క్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగానే ఉంటుంది. శివరాత్రి, కార్తీకమాసంలో పంచాక్షరి మంత్రంతో మారుమోగిపోతుంది 

కాళేశ్వరం

తెలంగాణలో ఉన్న మరో ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వరం. జయ శంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరానికి కార్తీకమాసంలో భక్తులు పోటెత్తుతారు. అత్యంత పురాతన శైవ దేవాలయాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వరస్వామి దేవాలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటూ ఇరుగు పొరుగు రాష్ట్రాల భక్తులు కూడా తరలివస్తారు. ప్రాణహిత నది, గోదావరి కలిసే చోటున కొలువుదీరిన ముక్తేస్వరస్వామిని దర్శించుకుంటే శివసాయుజ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 

వేయి స్తంభాల గుడి

వరంగల్ లో ఉన్న వేయిస్తంభాల గుడి తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటి.  దీన్ని 12 వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించగా.. అనంతర రాజులు ఈ ఆలాయన్ని సంరక్షించారని చెబుతారు. వేయిస్తంభాల్లో కొన్ని విడివిడిగా మరికొన్ని కలసిపోయినట్టు కనిపిస్తాయి. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ స్థంభాలను నాణెంతో కానీ లోహంతో కానీ తాకితే సప్త స్వరాలు వినిపిస్తాయి.

పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం

నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్న పానగల్లు ఛాయా సోమేశ్వరాలయంలో స్వామిని దర్శించుకునేందుకు కార్తీకమాసంలో భక్తులు పోటెత్తుతారు.   800 ఏళ్ల క్రితం కుందూరు చోళులు పరిపాలించిన ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయం గర్బగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా కనిపించే నీడ, మరొకటి అక్కడ చెరువులో నీరుంటే గర్బగుడిలో కూడా నీరు ఉబికి రావడం. చెరువు ఎండితే గర్బగుడిలో నీరు కనిపించకపోవడం. అయితే ఈ మధ్యకాలంలో చెరువులో నీరున్నా గర్భగుడి నిండిపోకుండా ఉండేందుకు మార్పులు చేర్పులు చేశారు. 

చెరువుగట్టు

సూర్యాపేట సమీపంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి. పరుశారాముడు కార్తవీర్యర్జునుడిని వధించిన తర్వాత 108 క్షేత్రాల్లో శివలింగాలు ప్రతిష్టించాడు..అందులో చివరిది ఈ క్షేత్రం అని చెబుతారు. ఇక్కడ  పార్వతి దేవి  ఆలయం గట్టు క్రింద ఉంటుంది. 

Also Read: మీరు దర్శించుకుంటున్నది ఎలాంటి శివలింగం - ఎన్ని రకాలున్నాయో తెలుసా!
 
రామప్ప

కాకతీయుల కాలంలో నిర్మించి రామప్ప దేవాలయం తెలంగాణలో ప్రముఖ శైవక్షేత్రం. వరంగల్ లో కొలువుదీరిన 800 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి పేరే ఆలయానికి పెట్టడం విశేషం. వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన ఈ ఆలయ నిర్మాణంలో  అడుగడుగునా కాకతీయుల వైభవం ఉట్టిపడేలా ఉంటుంది.  

చిలుకూరు లోటస్ టెంపుల్

చిలుకూరులో ఉన్న కమల్ ధామ్ లోటస్ టెంపుల్ కార్తీకమాసంలో కళకళలాడుతుంది.  రుద్రాక్ష, త్రినేత్రం, నాభి ఉన్నట్లుగా సహజసిద్ధంగా కనిపిస్తుంది ఇక్కడ శివలింగం. ఈ శివలింగం పురుషోత్తం భాయ్ అనే భక్తుడికి నర్మదానందీ తీరంలో దొరికిందని..దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు.

Also Read: కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ - శివతాండవ స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
Embed widget