News
News
X

IND Vs AUS: సెంచరీతో చెలరేగిన ఉస్మాన్ ఖవాజా - మొదటి రోజు ఆస్ట్రేలియా ఎంత కొట్టింది?

భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది.

FOLLOW US: 
Share:

IND Vs AUS: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు ముగిసేసరికి ఆస్ట్రేలియా కొద్దిగా పై చేయి సాధించింది. చివరి సెషన్‌లో ఉస్మాన్ ఖవాజా (104 బ్యాటింగ్: 251 బంతుల్లో, 15 ఫోర్లు), కామెరాన్ గ్రీన్ (49 బ్యాటింగ్: 64 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) చెలరేగి ఆడారు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి 255 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీనే ఉన్నారు. వీరిని భారత బౌలర్లు త్వరగా అవుట్ చేయాల్సి ఉంది.

కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఆడింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ భారత్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. 61 పరుగుల వద్ద భారత్‌కు తొలివికెట్‌ ట్రావిస్ హెడ్ రూపంలో దొరికింది. కేవలం 44 బంతుల్లోనే ట్రావిస్ హెడ్ ఏడు బౌండరీలు సాధించాడు. ఇతను 32 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు.

ట్రావిస్ హెడ్‌ను రవిచంద్రన్ అశ్విన్ బోల్తా కొట్టించాడు. 16వ ఓవర్‌ తొలి బంతికే జడేజా క్యాచ్ పట్టి హెడ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. తర్వాత మార్నస్ లబుషేన్‌ను మహ్మద్‌ షమీ క్లీన్ బౌల్డ్‌ చేశాడు. దీంతో 72 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తన రెండో వికెట్ కోల్పోయింది. మార్నస్ లబుషేన్‌ (3: 20 బంతుల్లో) వచ్చిన కాసేపటికే వెనుదిరిగాడు.

రెండో సెషన్‌లో భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఆస్ట్రేలియా బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ అస్సలు వికెట్ ఇవ్వలేదు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. పరుగులు రాకపోయినా ముందు క్రీజులో నిలబడితే చాలు అనే యాటిట్యూడ్ వారిలో కనిపించింది.

ముఖ్యంగా స్పిన్ త్రయం అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను మరింత జాగ్రత్తగా ఆడారు. వీరు ముగ్గురూ మాత్రమే ఇప్పటి వరకు 40 ఓవర్లు బౌల్ చేశారు. ఇందులో కేవలం 82 పరుగులు మాత్రమే వచ్చాయి. అక్షర్ పటేల్ ఎకానమీ అయితే ఏకంగా 1.3 మాత్రమే ఉంది. దీన్ని బట్టి స్పిన్నర్లకు అస్సలు వికెట్ తీసే అవకాశం కూడా ఇవ్వకూడదనే వ్యూహంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగినట్లు అర్థం అవుతోంది.

టీ బ్రేక్ ముగిసిపోగానే భారత్‌కు మంచి బ్రేక్ దొరికింది. విరామం అనంతరం రెండో ఓవర్లోనే క్రీజులో కుదురుకున్న స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసిన రవీంద్ర జడేజా భారత్‌కు మూడో వికెట్‌ను అందించారు. ఈ మ్యాచ్‌లో తనకు ఇది మొదటి వికెట్. ఈ సిరీస్‌లో స్టీవ్ స్మిత్ ఇంతవరకు 50 పరుగుల మార్కును దాటలేదు. తన కెరీర్‌లో వరుసగా ఆరు ఇన్నింగ్స్‌ల్లో అర్థ సెంచరీ చేయకపోవడం స్మిత్‌కు ఇదే మొదటి సారి. ఆ తర్వాత వచ్చిన పీటర్ హ్యాండ్స్‌కాంబ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. పేస్ బౌలర్ షమీ తనను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు నాలుగో వికెట్ అందించాడు.

హ్యాండ్స్‌కాంబ్ స్థానంలో క్రీజులోకి వచ్చిన కామెరాన్ గ్రీన్ వేగంగా ఆడాడు. భారత బౌలర్లకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా బౌండరీలతో చెలరేగిపోయాడు. మరోవైపు ఉస్మాన్ ఖవాజా కూడా కొంచెం వేగం పెంచాడు. దీంతో చివరి సెషన్‌లో ఆస్ట్రేలియా 3.78 రన్‌రేట్‌తో పరుగులు చేసింది.

దీంతో 80 ఓవర్లు దాటాక రోహిత్ కొత్త బంతి తీసుకున్నాడు. కొత్త బంతి తీసుకున్నాక ఆస్ట్రేలియా మరింత వేగంగా పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో ఏకంగా 56 పరుగులు సాధించింది. పేస్, స్పిన్ ఇలా అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆట ఆఖరి ఓవర్లో బౌండరీతో ఉస్మాన్ ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 255 పరుగులు చేసింది.

ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్ ఇప్పటికే ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. రెండో రోజు వీరి భాగస్వామ్యాన్ని వీలైనంత వేగంగా బ్రేక్ చేస్తేనే భారత్‌కు ఈ మ్యాచ్‌లో విజయావకాశాలు మెరుగుపడతాయి. లేకపోతే ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.

Published at : 09 Mar 2023 05:17 PM (IST) Tags: Australia India IND vs AUS 4th Test IND vs AUS IND Vs AUS Highlights

సంబంధిత కథనాలు

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Pragyan Ojha on Rohit Sharma: కిట్‌ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్‌ శర్మ! అడిగితే ఎమోషనల్‌!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!

టాప్ స్టోరీస్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !

Pulivenudla Shooting : పులివెందులలో కాల్పుల కలకలం - ఇద్దరికి బుల్లెట్ గాయాలు !

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!