ICC WC 2022: సచిన్‌ రికార్డు సమం చేస్తున్న మిథాలీ - ఇంకెవ్వరూ బ్రేక్‌ చేయలేరేమో!

Womens World Cup 2022: మిథాలీ రాజ్‌ అరుదైన రికార్డు సృష్టించబోతోంది! సచిన్‌ తెందూల్కర్‌, జావెద్‌ మియాందాద్‌ సరసన నిలవనుంది.

FOLLOW US: 

ICC Womens Cricket World Cup: టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ అరుదైన రికార్డు సృష్టించబోతోంది! అత్యధికసార్లు ప్రపంచకప్‌లు ఆడిన ఘనత అందుకోబోతోంది. దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ తెందూల్కర్‌, జావెద్‌ మియాందాద్‌ సరసన నిలవనుంది.

సచిన్‌ సరసన

అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు అత్యధికసార్లు ప్రపంచకప్‌లు ఆడింది ఇద్దరే ఇద్దరు. ఒకరు టీమ్‌ఇండియా దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌. మరొకరు పాకిస్థాన్‌ ఫైర్‌ బ్యాటర్‌ జావెద్‌ మియాందాద్‌. అయితే వీరి రికార్డును మిథాలీ రాజ్‌ సమం చేయబోతోంది. ఐసీసీ 2020 మహిళల వన్డే ప్రపంచకప్‌ ఆడటం ద్వారా ఆమె ఈ జాబితాలో చేరబోతోంది. ఇది ఆమె ఆడబోయే ఆరో ప్రపంచకప్‌ కావడం ప్రత్యేకం.

పాక్‌తో మొదలు

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో మార్చి 6న దాయాది పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడుతోంది. ఈ టోర్నీలో మిథాలీసేనకు ఇదే మొదటి మ్యాచ్‌. ఇప్పటి వరకు అమ్మాయిల జట్టును రెండుసార్లు ఫైనల్‌కు చేర్చిన ఘనత మిథాలీ పేరుతోనే ఉంది. 2005, 2017లో టీమ్‌ఇండియాను ఫైనల్‌ చేర్చింది. వయసు పెరగడం, వన్డే ప్రపంచకప్‌ తేవాలన్న కలతో ఆమె కొన్నాళ్ల క్రితం టీ20 ఫార్మాట్‌కు దూరమైంది. పరుగులు చేయడంలో ఆమెకెవరూ సాటిరారు. 225 వన్డేల్లో 7623 పరుగులు చేసింది. ఇక మరో సీనియర్‌ క్రికెటర్‌ జులన్‌ గోస్వామి ఐదో ప్రపంచకప్‌ ఆడబోతోంది.

టీమ్‌ఇండియాలో యువ క్రికెటర్లు బాగా ఆడుతున్నందుకు సంతోషంగా ఉందని మిథాలీ అంటోంది. 'మా జట్టులోని యువ క్రికెటర్లకు నేను చెప్పేదొకటే. వారికి ఇంతకు ముందు ప్రపంచకప్‌లు ఆడిన అనుభవం లేదు. అందుకే ఈ బిగ్‌స్టేజ్‌ పైన క్రికెట్‌ను ఎంజాయ్‌ చేయాలని సూచించాను' అని మిథాలీ పేర్కొంది. 

మార్చి 6 నుంచి టీమ్‌ఇండియా పోరాటం

Womens World Cup 2022: మార్చి 4 నుంచి న్యూజిలాండ్‌ వేదికగా ఐసీసీ మహిళల క్రికెట్‌ వన్డే ప్రపంచకప్‌ మొదలవుతోంది. మొత్తం ఎనిమిది జట్లు 29 రోజులు ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు భారత మహిళల క్రికెట్‌ జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను గెలవలేదు. కానీ రెండు సార్లు ట్రోఫీని ముద్దాడే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచింది. చివరి ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలై కన్నీరు కార్చింది. ఈ సారి ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని పట్టుదలతో ఉంది. మార్చి 6, ఆదివారం నుంచి మిథాలీ సేన తమ క్యాంపెయిన్‌ ఆరంభించనుంది. తొలి మ్యాచులోనే దాయాది పాకిస్థాన్‌తో తలపడుతోంది.

India Women Squad - టీమ్‌ఇండియా జట్టు

మిథాలీ రాజ్‌ (Mithali Raj captain), హర్మన్‌ప్రీత్‌ కౌర్ (Harmanpreet Kaur), స్మృతి మంధాన (Smriti Mandhana), షెఫాలీ వర్మ, యస్తికా భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, స్నేహ్‌ రానా, జులన్‌ గోస్వామి, పూజా వస్త్రాకర్‌, మేఘనా సింగ్‌, రేణుకా సింగ్ ఠాకూర్‌, తానియా భాటియా, రాజేశ్వరీ గైక్వాడ్‌, పూనమ్‌ యాదవ్‌

Published at : 03 Mar 2022 04:27 PM (IST) Tags: Mithali Raj Sachin Tendulkar ind vs pak ICC Womens World Cup 2022 Womens World Cup Womens World Cup 2022 ICC Womens Cricket World Cup Womens World Cup 2022 Live Womens World Cup 2022 News Womens World Cup 2022 Schedule Womens World Cup 2022 Venues

సంబంధిత కథనాలు

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్‌ బట్లర్‌ ఫెయిల్యూర్‌! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!

RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్‌ మియా! హైదరాబాదీ పేస్‌ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు

RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్‌ మియా! హైదరాబాదీ పేస్‌ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు

IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్‌ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్‌ అంటూ పొగడ్త

IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్‌ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్‌ అంటూ పొగడ్త

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!

టాప్ స్టోరీస్

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Redmi 11 5G Launch: రెడ్‌మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్‌లోనే లాంచ్ - ధర లీక్!

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!