అన్వేషించండి
Advertisement
Virat Kohli : జూనియర్ అమ్మాయిలతో కోహ్లీ సమానం -విరాట్‌పై హాకీ వైస్ కెప్టెన్ తీవ్ర విమర్శలు
Hardik Singh: విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై భారత పురుషుల హాకీ జట్టు ఆటగాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఫిట్‌నెస్, భారత హాకీ జూనియర్ గర్ల్స్‌తో సమానమన్నాడు భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్.
Hockey Players Fitter Than Indian Cricketers- Hardik Singh: టీమిండియాలో ఫిట్‌నెస్ పరంగా అత్యుత్తమ క్రికెటర్ ఎవరంటే ఠక్కున గుర్తు వచ్చే పేరు విరాట్ కోహ్లీ (Virat Kohli). ఫిట్‌నెస్ పరంగా విరాట్ ది బెస్ట్ అని ఇప్పటికే చాలామంది క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీని స్ఫూర్తిగా తీసుకుని చాలామంది క్రికెటర్లు కూడా ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అయితే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పై భారత పురుషుల హాకీ జట్టు ఆటగాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీపై గతంలో ఎన్నడూ ఎవరూ చేయనంత తీవ్ర విమర్శలు చేశాడు. కోహ్లీ ఫిట్‌నెస్... భారత హాకీ జూనియర్ గర్ల్స్‌తో సమానమని హాకీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు... క్రీడా ప్రపంచంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కోహ్లీని ఫిట్టెస్ట్ ప్లేయర్ అనే మోసాన్ని ఆపాలంటూ.... ఒలింపిక్‌లో పతకం గెలిచిన హాకీ జట్టులో సభ్యుడు, భారత పురుషుల హాకీ జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్(Hardik Singh) విమర్శలు చేశాడు.
హార్దిక్ ఇంతకీ ఏమన్నాడంటే..?
టీమిండియా స్టార్ క్రికెటర్ కోహ్లీపై భారత మెన్స్ హాకీ జట్టు మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్ తీవ్ర విమర్శలు చేశాడు. దేశంలో విరాట్ కోహ్లీ అస్సలు ఫిట్టెస్ట్ అథ్లెట్ కాదని.... అతని ఫిట్‌నెస్ స్థాయి టీమిండియా హాకీలో జూనియర్ గర్ల్స్ ఫిట్‌నెస్‌తో పోల్చవచ్చని హార్దిక్ సింగ్ ఆరోపణలు చేశాడు. టీమిండియా క్రికెటర్ల కంటే భారత హాకీ ఆటగాళ్లే ఎక్కువ ఫిట్టెస్ట్ అని టీమిండియా మిడ్ ఫీల్టర్ అయిన హార్దిక్ సింగ్ వెల్లడించాడు. ఫిట్‌నెస్‌కు కొలమానంగా భావించే యో-యో టెస్టులో విరాట్ కోహ్లీ, భారత క్రికెటర్ల కంటే భారత హాకీ ఆటగాళ్లు మెరుగైన స్కోర్లు సాధించారని హార్దిక్ సింగ్ పేర్కొన్నాడు. హాకీ ఆటగాళ్ల యో-యో టెస్టు ఫలితాలు.. క్రికెటర్ల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని... ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుందని హార్దిక్ సింగ్ అన్నాడు. టీమిండియా క్రికెటర్ల కంటే మాజీ గోల్ కీపర్ శ్రీజేష్ యో-యో టెస్టులో ఎక్కువ స్కోరు సాధించాడని హార్దిక్ సింగ్ తెలిపాడు.
యోయో టెస్టు(Yo-Yo Test)లో భారత ఆటగాళ్లు 17-18 స్కోర్ సాధిస్తుంటే.. భారత పురుషుల హాకీ జట్టు స్థిరంగా 23 స్కోరు చేస్తుందని హార్దిక్ సింగ్ వెల్లడించాడు. ఎవరైనా యో-యో టెస్ట్‌లో 19 లేదా 20 స్కోరు చేస్తే దానిని ఫిటెస్ట్‌గా భావిస్తారని.. గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ 21 స్కోరు చేశాడని వివరించాడు.
జూనియర్ బాలికలతో సమానం
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ స్థాయి భారత జూనియర్ బాలికల హాకీ జట్టు ఫిట్‌నెస్‌తో సమానంగా ఉంటుందని హార్దిక్ సింగ్ అన్నాడు. జూనియర్ బాలికలు యోయో టెస్టులో సహజంగా 17-18 స్కోరు ఉంటుంది. భారత క్రికెటర్ల యోయో టెస్టు ఫలితాలు కూడా దాదాపు అంతే ఉంటాయని హార్దిక్ సింగ్ తెలిపాడు. హార్దిక్ చివరిసారిగా పారిస్ ఒలింపిక్స్ 2024లో కనిపించాడు. భారత్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement