Hardik's Pushpa Dance: బామ్మతో శ్రీవల్లి స్టెప్ వేయించిన హార్దిక్.. వైరల్ అవుతున్న వీడియో!
పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు హార్దిక్ పాండ్యా, తన బామ్మ స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది.

పుష్ప ఫీవర్ సెలబ్రిటీలను ఇప్పట్లో వదిలేలా లేదు. కేవలం భారతీయ క్రికెటర్లు మాత్రమే వెస్టిండీస్ క్రికెటర్ బ్రేవో, బంగ్లాదేశ్ క్రికెటర్ నజ్ముల్ ఇస్లాం, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ శ్రీవల్లి స్టెప్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. అయితే భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా దీనిపై చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. కేవలం తను మాత్రమే కాకుండా.. ఏకంగా తన బామ్మతో కూడా హార్దిక్ శ్రీవల్లి స్టెప్ వేయించాడు. ఈ వీడియోను మీరు కింద చూడవచ్చు.
View this post on Instagram
హార్దిక్ పాండ్యా ఈ ఐపీఎల్‌లో లక్నో ఫ్రాంచైజీకి ఆడనున్నాడు. దీంతోపాటు మొదటిసారి ఐపీఎల్‌లో తను కెప్టెన్సీ కూడా చేయనున్నాడు. తనకు రూ.15 కోట్లు చెల్లించినట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్‌తో పాటు రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. వీరిలో రషీద్‌కు రూ.15 కోట్లు, గిల్‌కు రూ.8 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
ఇక లక్నో జట్టుకు లక్నో సూపర్ జెయింట్స్ అని పేరు పెట్టారు. ఈ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయనున్నాడు. కేఎల్ రాహుల్‌తో పాటు ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను కూడా అహ్మదాబాద్ జట్టు సెలక్ట్ చేసుకుంది.
Cutest video on Internet right now! 😍😍#Srivalli Song Hook steps ft. @hardikpandya7 and his nani 🧡#PushpaTheRise #Pushpa 💥@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @javedali4u @AlwaysJani @TSeries @MythriOfficial pic.twitter.com/mQtP0uCaII
— Shreyas Group (@shreyasgroup) January 26, 2022
Before You Go
Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
ట్రెండింగ్ వార్తలు






















