By: ABP Desam | Updated at : 13 Mar 2022 11:46 AM (IST)
Edited By: Ramakrishna Paladi
విరాట్ కోహ్లీ
Virat Kohli, IND vs SL 2nd Test: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీల కరవు త్వరలోనే తీరుతుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ (Rashid latif) అంటున్నాడు. అతడొకసారి డేటా అనలిటిక్స్ పరిశీలించాలని సూచించాడు. తన బ్యాటింగ్‌లొ కొన్ని అంతర్గత లోపాలు ఉన్నాయని వివరించాడు.
శ్రీలంకతో రెండో టెస్టులో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ చేయాలని అంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం అతడికి రెండో సొంత మైదానం లెక్క! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అక్కడే ఎక్కువ మ్యాచులు ఆడాడు. అతడి సెంచరీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తన వందో టెస్టైన మొహాలిలో అతడు త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 28 నెలలుగా అతడు టెస్టు సెంచరీ చేయనే లేదు. డే/నైట్ టెస్టులో విరాట్ స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. మరి తనకు ఇష్టమైన చిన్నస్వామిలో రెండో ఇన్నింగ్స్‌లోనైనా విరాట్ 71వ సెంచరీ చేస్తాడో లేదో చూడాలి.
'విరాట్ కోహ్లీ పరుగులు చేయాల్సిన సమయం వచ్చేసింది. చాన్నాళ్లుగా అతడు ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. జనాలంతా అతడి సెంచరీ కోసమే ఆందోళన చెందుతున్నారు. అతడు ఈ టెస్టు లేదా తర్వాత జరిగే రెండు మూడు మ్యాచుల్లోనైనా సెంచరీ కొడతాడని నా అంచనా. అతడికి కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయి. కెప్టెన్సీ కోల్పోయాడు. ఫామ్‌లో లేడు. ప్రత్యర్థి జట్లూ అతడి వీక్‌నెస్‌పై వర్క్ చేస్తున్నాయి. ఆ ప్లాన్ ప్రకారమే అతడికి బౌలింగ్ చేస్తున్నారు' అని లతీఫ్ అన్నాడు.
'కొందరు ఆటగాళ్లు ఫామ్‌లో ఉన్నప్పుడు డేటా అనలిటిక్స్‌ను నమ్మరు. కానీ విరాట్ కోహ్లీ డేటా అనలిటిక్స్ చూడాల్సిన టైమ్ వచ్చేసింది. ఓపెన్ స్టాన్స్ తీసుకోవడమే విరాట్ అతిపెద్ద సమస్య. ఔట్‌సైడ్ ఆఫ్ డెలివరీలను వెంటాడుతున్నాడు. ప్రత్యర్థులు వీక్‌నెస్‌ను కనిపెట్టారు. అతనాడుతున్న డాట్ బాల్స్ సంఖ్యను తగ్గించాలి. మరింత దూకుడుగా ఆడాలి. త్వరగా బంతిని అందుకోవాలి. ఓపెన్ స్టాన్స్ వల్ల అతడు బంతిని ఆలస్యంగా ఆడుతున్నాడు. ఆలస్యంగా ఆడటం ఫర్వాలేదు కానీ మరీ ఆలస్యమైతే మొదటికే మోసం' అని రషీద్ లతీఫ్ పేర్కొన్నాడు.
That's STUMPS on Day 1 of the 2nd Test.
Sri Lanka 86/6, trail #TeamIndia (252) by 166 runs.
Scorecard - https://t.co/t74OLq7xoO #INDvSL @Paytm pic.twitter.com/Xehkffunwn— BCCI (@BCCI) March 12, 2022
Their Bond is so Pure Man 😍🥰@imVkohli @ABdeVilliers17 #ViratKohli https://t.co/cWdPvr477O pic.twitter.com/z6q6a6Rw2M
— Samy :): (@ZLX_comfort) March 12, 2022
IND Vs AUS, 3rd ODI: ఆఖరి ఆట అదరాలి! - క్లీన్ స్వీప్‌పై భారత్ కన్ను - పరువు కోసం ఆసీస్ పాకులాట
ODI World Cup 2023: ఐదు మ్యాచ్‌లే ఆడతా, అలా అయితే రాజీనామా చేస్తా! - బంగ్లా జట్టులో షకిబ్ వర్సెస్ తమీమ్
Asian Games 2023: భారత్ నయా చరిత్ర! 41 ఏళ్ల తర్వాత ఆసియా గుర్రపు పందేల్లో స్వర్ణం
ODI World Cup 2023: సరే రండి! - పాక్ క్రికెట్ టీమ్‌కు వీసాలు మంజూరుచేసిన భారత్ - హైదరాబాద్‌కు పాక్ జట్టు
ODI World Cup 2023: కపిల్ దేవ్ కిడ్నాప్ కథ సుఖాంతం - ఎందుకోసమంటే!
Bhainsa News: బైంసాలో గణేష్ నిమజ్జనం వేళ భారీ భద్రత - పోలీసులకు స్థానికులకు మధ్య గొడవ, లాఠీచార్జ్
Mahesh Babu Rajamouli : నో డౌట్ - రాజమౌళి రికార్డులకు దగ్గరలో మహేష్ సినిమా కలెక్షన్స్!
Kodali Nani: జైల్లో దోమలు కుట్టకపోతే రంభా ఊర్వశిలు కన్నుకొడతారా - కొడాలి నాని సెటైర్లు
Hero Nani : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?
/body>