అన్వేషించండి

Neymar Junior Set To Return: బ్రెజిల్ ఫ్యాన్స్ కు పూనకాలు.. గాయం నుంచి కోలుకున్న నెయ్‌మార్, స్టార్ ప్లేయర్ రీఎంట్రీ ఖాయం..!

కాఫ్ ఇంజరీ నుంచి కోలుకున్న బ్రెజిల్ సూపర్‌స్టార్ నెయ్‌మార్ జూనియర్ స్కాట్లాండ్‌తో జరిగే కీలకమైన వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.

Neymar Junior Resumes Training Ahead Of Crucial Match:  ఫిఫా వరల్డ్ కప్ 2026 లో సరికొత్త డ్రామా స్టార్ట్ అయింది. బ్రెజిల్ సూపర్‌స్టార్ నెయ్‌మార్ జూనియర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే ఒక బిగ్ అప్‌డేట్ . నార్త్ అమెరికాలో జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్‌లో కాఫ్ ఇంజరీ వల్ల ఫస్ట్ రెండు గ్రూప్ మ్యాచులకు దూరమైన నెయ్‌మార్, ఇప్పుడు కంప్లీట్ ఫిట్‌నెస్ సాధించి గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. ఆదివారం తను ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్న పిక్చర్స్ ను ఎక్స్  లో షేర్ చేస్తూ.. "థాంక్యూ గాడ్, నేను చాలా హ్యాపీగా ఉన్నా!!" అంటూ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టాడు. స్కాట్లాండ్‌తో బుధవారం జరగబోయే డిసైడింగ్ గ్రూప్-C మ్యాచ్ లో నెయ్‌మార్ ఆడటం దాదాపు ఖాయమనే హింట్ ఈ పోస్ట్ ద్వారా క్లియర్ గా అర్థమవుతోంది.

న్యూజెర్సీ బేస్ లో ఒంటరి పోరాటం.. 
నెయ్‌మార్ లేనప్పటికీ బ్రెజిల్ టీమ్ ఫస్ట్ మ్యాచ్ లో మొరాకోతో 1-1 తో డ్రా చేసుకుని, ఆ తర్వాత హైతీని 3-0 తో ఓడించి గ్రూప్-C లో టాప్ పొజిషన్ కు చేరింది. బ్రెజిల్ స్క్వాడ్ హైతీ మ్యాచ్ కోసం ఫిలడెల్ఫియా వెళ్లినప్పుడు, నెయ్‌మార్ మాత్రం న్యూజెర్సీలోని ట్రైనింగ్ బేస్ లోనే ఉండి తన పర్సనల్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కంటిన్యూ చేశాడు. వీకెండ్ లో అతను ఆన్-ఫీల్డ్ వర్క్ స్టార్ట్ చేసి ఫిజికల్, బాల్ డ్రిల్స్ లో పార్టిసిపేట్ చేశాడు. బ్రెజిల్ హెడ్ కోచ్ కార్లో అన్సెలోటి కూడా నెయ్‌మార్ కంబ్యాక్ ను కన్ఫర్మ్ చేశాడు. "నెయ్‌మార్ సోమవారం నుంచి టీమ్‌తో కలిసి ఫుల్ ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొంటాడు. స్కాట్లాండ్‌తో జరిగే బిగ్ మ్యాచ్ లో ఆడేందుకు తను అవైలబుల్ గా ఉంటాడు" అని అన్సెలోటి మీడియా ముందు స్పష్టం చేశాడు.

Read Also: FIFA World Cup Record: గోల్స్ సునామీతో 68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026వ ఎడిష‌న్.. డచ్ టీమ్ హిస్టారికల్ ఫీట్  

మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. 
ఒకవేళ స్కాట్లాండ్ మ్యాచ్ లో నెయ్‌మార్ ప్లేయింగ్ ఎలెవన్ లోకి వస్తే, అక్టోబర్ 2023 తర్వాత బ్రెజిల్ జెర్సీలో అతనికి ఇదే ఫస్ట్ మ్యాచ్ అవుతుంది. అప్పట్లో ఉరుగ్వేతో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో నెయ్‌మార్ మోకాలికి తీవ్రమైన ఏసీఎల్  ఇంజరీ అయింది. ఈ సర్జరీ వల్ల అతను చాలా కాలం పాటు ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ కు దూరం కావాల్సి వచ్చింది. బ్రెజిల్ క్వాలిఫికేషన్ క్యాంపెయిన్ లో కూడా తను ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. కాగా, నెయ్‌మార్ కెరీర్ లో ఇది ఫోర్త్ ఫిఫా వరల్డ్ కప్ కావడం విశేషం. గతంలో 2014, 2018, 2022 వరల్డ్ కప్‌లలో బ్రెజిల్ తరఫున ఆడి తన క్లాస్ చూపించాడు.

నంబర్ 10 ఈజ్ బ్యాక్.. నాకౌట్ బెర్త్ పై బ్రెజిల్ కన్ను
గాయాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ క్వాలిఫైయింగ్ రౌండ్ లో నెయ్‌మార్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనే రెండు గోల్స్, మూడు అసిస్ట్ లతో కీ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు క్రీడల ప్రపంచంలో మోస్ట్ పాపులర్ అయిన నంబర్ 10 జెర్సీ స్టార్ మళ్లీ టీమ్ లోకి రావడం బ్రెజిల్‌కు కొండంత బలాన్ని ఇస్తోంది. స్కాట్లాండ్‌ను ఓడించి ఈజీగా నాకౌట్ రౌండ్ కు చేరాలనే ప్లాన్ లో ఉన్న బ్రెజిల్ టీమ్‌కు నెయ్‌మార్ ఎంట్రీ ఒక బిగ్ బూస్ట్ లాంటిది. గురువారం జరగబోయే ఈ మ్యాచ్ లో నెయ్‌మార్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలని ఫుట్‌బాల్ వరల్డ్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
YS Avinash Reddy: అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
అవినాష్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలకు అసలు కారణం ఏంటి? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏంటి?
Breaking News: యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
యాదాద్రి జిల్లా హోజీలో ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్! ఇద్దరు మృతిృ, 10 మందికి గాయాలు!  
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Arpitha Mohithe: తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
తెలుగు బుల్లితెర వారసురాలు.. అర్పిత గురించి మీకు తెలియని విషయాలు!
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Embed widget