By: ABP Desam | Updated at : 19 Dec 2022 09:50 PM (IST)
గెలిచిన అనంతరం కప్‌ను ముద్దాడుతున్న మెస్సీ
ప్రముఖ ఆధ్యాతిక వేత్త సద్గురు ప్రపంచకప్ విజయంపై అర్జెంటీనాకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ మ్యాచ్‌కు ఆయన హాజరయ్యారు కూడా. ‘అద్భుతమైన ఫైనల్. ఫుట్‌బాల్ గెలిచింది. అత్యద్భుత ఆటతీరును ప్రదర్శించినందుకు అర్జెంటీనా, ఫ్రాన్స్‌కు కంగ్రాట్స్.’ అని క్యాప్షన్ పెట్టారు.
వేలమంది అర్జెంటీనా ఫ్యాన్స్ నడుమ చప్పట్లు కొడుతున్న సద్గురుని ఈ వీడియోలో చూడవచ్చు. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ చరిత్రలోని గొప్ప ఫైనల్స్‌లో ఒకటిగా ఈ మ్యాచ్ నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. అర్జెంటీనా తరఫున దాదాపుగా తన చివరి ప్రపంచకప్‌ను ఆడుతున్న లియోనెల్ మెస్సీ ప్రపంచకప్ కెరీర్‌ను అద్భుతమైన రీతిలో ముగించాడు. సాధారణ 90 నిమిషాల సమయంలో స్కోరు 2-2తో సమం కాగా, అదనపు సమయంలో స్కోరు 3-3గా మారింది. అనంతరం పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా అద్భుత ప్రదర్శన చేసి విజయం సాధించింది.
ఆరంభమే అద్భుతంగా
మ్యాచ్ ఆరంభం నుంచి అద్భుత ఆటతీరు కనబరిచిన అర్జెంటీనా 23వ నిమిషంలోనే ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పెనాల్టీ కిక్‌ను చక్కగా ఉపయోగించుకున్న లియోనెల్ మెస్సీ గోల్ చేయడం ద్వారా అర్జెంటీనాకు ఆధిక్యాన్ని అందించాడు. 13 నిమిషాల తర్వాత అర్జెంటీనా మరో గోల్ చేసి మ్యాచ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఏంజెల్ డి మారియా తనకు అందిన పాస్‌ను చక్కగా గోల్ చేసి స్కోరును 2-0కు పెంచాడు.
అదరగొట్టిన ఎంబాపే
తొలి 80 నిమిషాల వరకు అర్జెంటీనా తన ఆధిక్యాన్ని కొనసాగించినప్పటికీ, ఆ తర్వాత కైలియన్ ఎంబాపే అర్జెంటీనాపై విధ్వంసం సృష్టించాడు. 80, 81వ నిమిషాల్లో వరుసగా రెండు గోల్స్ చేసి స్కోరును 2-0తో సమం చేశాడు. ఆ తర్వాత ఎవరూ జట్టు చేయకపోవడంతో మ్యాచ్ 30 నిమిషాల అదనపు సమయానికి వెళ్లింది.
అదనపు సమయంలో అసలైన ఆట
అదనపు సమయం ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో అర్జెంటీనా గోల్ చేయడానికి అనేక అవకాశాలను పొందింది. కానీ ఒక్కదాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయింది. సెకండాఫ్‌లో స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ అర్జెంటీనా కోసం సర్వశక్తులు ఒడ్డాడు. రెండో అర్ధభాగం మూడో నిమిషంలో మెస్సీ గోల్ చేసి అర్జెంటీనాను 3-2తో ముందంజలో ఉంచాడు. అదనపు సమయం రెండో సగం ముగిసే సమయానికి, ఎంబాపే పెనాల్టీలో మరో గోల్ చేయడం ద్వారా తన హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. అలాగే స్కోరును 3-3తో సమం చేశాడు. ఆ తర్వాత పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-2తో ముందంజ వేసి విజయం సాధించింది.
Best FIFA Football Awards: ఫిఫా అవార్డ్స్- ఉత్తమ ఆటగాడిగా నిలిచిన లియోనెల్ మెస్సీ
Number 10 Jersey: జెర్సీ నెంబర్ 10తో పీలె, సచిన్, డిగో, మెస్సీ, రొనాల్డినో లవ్‌స్టోరీ!
Pele Demise: దివికేగిన దిగ్గజం - ఫుట్‌బాల్ గ్రేటెస్ట్ పీలే కన్నుమూత!
Lionel Messi - Ziva: ధోనీ కుమార్తె జివా కోసం జెర్సీ పంపిన మెస్సీ- ఫొటోలు వైరల్
Personal Finance tips: మార్కెట్లో మెస్సీని గుర్తించి పెట్టుబడి పెట్టండి - 2023 కోసం ఫిఫా చెప్పిన డబ్బు పాఠాలు!
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు