News
News
X

Lionel Messi - BYJU's: బైజూస్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ

Lionel Messi - BYJU's: ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ బైజూస్ ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ ఆండ్రెస్ మెస్సీని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.

FOLLOW US: 
 
Lionel Messi - BYJU's: ప్రపంచంలోని ప్రముఖ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ కంపెనీ బైజూస్, ఫుట్ బాల్ స్టార్, గ్లోబల్ స్పోర్ట్స్ ఐకాన్ లియోనెల్ మెస్సీని తన మొదటి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. కంపెనీ గ్లోబల్ బ్రాండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కోసం ఈ అగ్రిమెంట్ చేసుకుంది. మెస్సీ ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక పెద్ద స్టార్, దాని గురించి చెప్పడం కంటే ప్రజాదరణ చాలా ఎక్కువ ఉంది. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులు ఉన్నారు. పారిస్ సెయింట్-జర్మనీ తరఫున ఆడే మెస్సీ, అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు కెప్టెన్‌గా చేశారు. విద్యాసమానతను ప్రోత్సహించేందుకు బైజూస్‌ ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పింది. 

ఫిఫా స్పాన్సర్‌గా బైజూస్

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ ఆటగాళ్ళలో ఒకరైన మెస్సీతో కలిసి ట్రావెల్ చేయనున్న ఈ సంస్థ మరిన్ని అద్భుతాలు చేయబోతున్నట్టు అభిప్రాయపడింది. విద్యను అందరికీ అందుబాటులోకి చౌకగా అందించడమే లక్ష్యంగా కంపెనీ ప్రకటించింది. అలాంటి మిషన్‌లో స్టార్ ప్లేయర్ పాల్గొన్నారు. ఈ ఒప్పందానికి ముందే బైజూస్‌ ఫుట్‌బాల్‌తో టై అప్‌ అయింది. ఫిఫా ప్రపంచ కప్ 2022లో అధికారిక స్పాన్సర్‌గా ఉంటూ బైజూస్ చరిత్ర సృష్టించింది.

పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు

News Reels

ఫుట్ బాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులను కలిగి ఉన్న ఆట. ఫుట్ బాల్‌కు ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. ఇందులో మెస్సీకి 450 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఒప్పందం వల్ల కంపెనీ, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని బైజూస్‌ అభిప్రాయపడుతోంది. 

బైజూయూ తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కోసం గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా లియోనెల్ మెస్సీతో ఒప్పందం జరిగినట్టు ప్రకటించింది. 

మెస్సీ ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న ఆటగాడని అందుకే ఆయన్ని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్నట్టు బైజూస్ సంస్థ తెలిపింది. ఫుట్ బాల్ ప్రపంచంలో మెస్సీ అత్యుత్తమ పేసర్, ఉత్తమ డ్రిబ్లర్, బెస్ట్ ఫ్రీ కిక్ టేకర్‌గా సుపరిచితుడు. 

ప్రతి రోజు కొత్త విషయాన్ని నేర్చువడం ద్వారా గొప్ప విజయాలు సాధిస్తామని నమ్ముతాని మెస్సీ తెలిపారు. అభ్యసన అలవాట్లు, ఆటలను అధ్యయనం చేయడం, పని పట్ల నిబద్దత అతనిని విజయవంతంగా ప్రపచం ముందు నిలబెట్టాయి. ఈ కారణంగానే ఆయనకు ప్రపంచంలో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మెస్సీ కీర్తి ఇప్పుడు బైజూస్ సంస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

Published at : 04 Nov 2022 03:19 PM (IST) Tags: Messi Lionel Messi BYJU'S FIFA World Cup leo messi Byju's brand ambassador

సంబంధిత కథనాలు

FIFA WC 2022: నేటి నుంచి ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లు - పూర్తి షెడ్యూల్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

FIFA WC 2022: నేటి నుంచి ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లు - పూర్తి షెడ్యూల్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే!

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్- పోర్చుగల్ పై విజయం సాధించి నాకౌట్ చేరిన కొరియా

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్- పోర్చుగల్ పై విజయం సాధించి నాకౌట్ చేరిన కొరియా

FIFA WC 2022 QATAR: స్పెయిన్ పై జపాన్ అద్భుత విజయం- నాకౌట్ కు అర్హత

FIFA WC 2022 QATAR: స్పెయిన్ పై జపాన్ అద్భుత విజయం- నాకౌట్ కు అర్హత

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం - టోర్నీ నుంచి బెల్జియం అవుట్!

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం - టోర్నీ నుంచి బెల్జియం అవుట్!

FIFA WC 2022 Qatar: ఫ్రాన్స్ పై ట్యునిషియా సంచలనం- అయినా నాకౌట్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

FIFA WC 2022 Qatar: ఫ్రాన్స్ పై ట్యునిషియా సంచలనం- అయినా నాకౌట్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

టాప్ స్టోరీస్

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Minister Botsa Satyanarayana : ఉపాధ్యాయుల కోరిక మేరకే ఎన్నికల విధుల నుంచి మినహాయింపు- మంత్రి బొత్స

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబాన్ని తరిమి తరిమి కొడదాం, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా

Vizag Traffic Restrictions: ఈ 4న విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు - వాహనాల మళ్లింపులు & పార్కింగ్ వివరాలు ఇలా