FIFA U-17 Women’s World Cup: భారతదేశంలో ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ - మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయో తెలుసా?
ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ షెడ్యూలు విడుదల అయింది. మనదేశంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఫిపా, అండర్-17 మహిళల వరల్డ్ కప్ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ (ఎల్ఓసీ) ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్ 11వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ జరగనుంది. గ్రూప్ దశ మ్యాచ్‌లు భువనేశ్వర్ నగరంలో జరగనున్నాయి. గోవాలో సెమీఫైనల్స్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక విజేతను నిర్ణయించే పైనల్‌కు నవీ ముంబై వేదిక కానుంది.
అక్టోబర్ 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 24 గ్రూప్ దశ 24 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లను ఆతిథ్య రాష్ట్రాలు అయిన ఒడిశా, గోవా, మహారాష్ట్ర పంచుకోనున్నాయి. అక్టోబర్ 11వ తేదీ, 14వ తేదీ, 17వ తేదీల్లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న కళింగ స్టేడియంలో జరగనున్నాయి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, ఫత్రోడాలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, గోవాలు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లను పంచుకుంటున్నాయి.
ఫిపా అండర్-17 మహిళల వరల్డ్ కప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్ల మధ్య మొత్తం 32 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి వేదికలో రోజూ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 24వ తేదీన ఫిపా అండర్-17 మహిళల వరల్డ్ కప్ చెందిన డ్రా జరగనుంది. అప్పుడు ఏ జట్టుకు ఏరోజు మ్యాచ్‌లు జరగనున్నాయో క్లారిటీ రానుంది.
2017లో జరిగిన ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ ఒక ప్రత్యేకమైన రికార్డు సాధించింది. ఫిఫా ఇప్పటివరకు నిర్వహించిన యూత్ వరల్డ్‌కప్‌ల్లో ఎక్కువ మంది స్టేడియంకు వచ్చి ఎంజాయ్ చేసింది ఈ టోర్నమెంట్‌లోనే. ఈ రికార్డుపై ఇప్పుడు ఇండియాలో జరగనున్న ఫిపా అండర్-17 మహిళల వరల్డ్ కప్ టోర్నమెంట్ కన్నేసింది.
View this post on Instagram