By: ABP Desam | Updated at : 30 May 2022 10:19 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివాహ వేడుకల్లో నాట్ స్కివర్, కేథరిన్ బ్రంట్ (Image Credits: Instagram)
ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు నాట్ స్కివర్, కేథరిన్ బ్రంట్ ఒక్కటయ్యారు. వీరిద్దరూ ఐదు సంవత్సరాల పాటు డేటింగ్‌లో ఉన్నారు. 2017లో లార్డ్స్ మైదానంలో మహిళల వరల్డ్ కప్ గెలిచిన జట్టులో వీరు ఉన్నారు. 2017-18లో వీరు రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. స్కివర్, బ్రంట్‌లు 2020లో వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ కరోనావైరస్ కారణంగా వివాహం ఆలస్యం అయింది.
ప్రస్తుతం సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది కామన్ అయిపోయింది. క్రికెటర్లలో పెళ్లి చేసుకున్న మొదటి మహిళల జంట వీరే. న్యూజిలాండ్‌కు చెందిన అమీ సట్టర్థ్‌వైట్, లీ టహుహు, దక్షిణాఫ్రికాకు చెందిన మరిజ్నే కప్, డేన్ వాన్ నీకెర్క్, ఆస్ట్రేలియాకు చెందిన ఒక జంట కూడా త్వరలో వివాహం చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.
2019 అక్టోబర్‌లో నాట్, కేథరిన్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. 2020 సెప్టెంబర్‌లోనే వీరి వివాహం జరగాల్సింది. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ జోడి పెళ్లిని వాయిదా వేసుకుంది. 2022 ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో కూడా వీరిద్దరూ స్థానం సంపాదించుకున్నారు.
టోర్నమెంట్ మొదట్లో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడినప్పటికీ తర్వాత వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకున్నారు. కానీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయ్యారు. 2023లో సౌతాఫ్రికాలో జరగనున్న మహిళల టీ20 వరల్డ్‌కప్‌పైన ప్రస్తుతం వీరు దృష్టి పెట్టారు.
IND vs NZ 2nd T20: సమమా! సమర్పణమా! నేడు భారత్- న్యూజిలాండ్ రెండో టీ20
IND vs NZ: భారత్‌పై న్యూజిలాండ్‌కు మాత్రమే ఉన్న ఏకైక రికార్డు ఇది - ఒకటి, రెండు కాదు నాలుగు సార్లు!
IND vs NZ: ఇలా అయితే కష్టమే - అర్ష్‌దీప్ సింగ్‌పై భారత మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్!
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి మ్యాచ్‌లో టీమిండియా భారీ ఓటమి!
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Avinash Reddy :నాలుగు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - అవసరమైతే మళ్లీ పిలుస్తామన్నారన్న అవినాష్ రెడ్డి !
BRS Parliamentary Meetings: నేడు BRS పార్లమెంటరీ పార్టీ సమావేశం, ఫోకస్ అంతా దాని గురించే
Kalyan Ram: అత్యంత విషమంగా తారకరత్న హెల్త్ కండీషన్, నందమూరి కల్యాణ్ రామ్ కీలక నిర్ణయం!
Smitha Sabarwal Issue: స్మితా సబర్వాల్ ఇంటికి అందుకే వెళ్లా, అసలు కారణం చెప్పిన డిప్యూటీ తహసీల్దార్