News
News
X

Dinesh Karthik : బెస్ట్‌ ఫినిషర్‌ దినేష్‌ కార్తీక్‌ షాకింగ్‌ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్‌ షాక్‌!

Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది.

FOLLOW US: 
 
Dinesh Karthik : టీమిండియా వికెట్‌ కీపర్‌, బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌.. దినేష్‌ కార్తీక్‌కు సంబంధించిన ఓ వీడియో తన అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది. కార్తీక్‌ తన జట్టు ఆటగాళ్లతో, కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలతో పాటు మైదానంలో ఆడుతున్న చిత్రాలతో ఉన్న ఓ వీడియోను పంచుకున్నాడు. తన  ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. క్యాప్షన్‌లో- డ్రీమ్ డూ కమ్ ట్రూ.. టీ20 ప్రపంచ కప్ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో భాగం కావడం గర్వించదగ్గ విషయం.. మనం టోర్నీని గెలవకపోవచ్చు కానీ జ్ఞాపకాలు నన్ను ఎప్పుడూ సంతోషపరుస్తాయి. నాకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచిన నా తోటి ఆటగాళ్లు, కోచ్‌లు, స్నేహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు కార్తీక్‌. అయితే ఇప్పటికే దినేష్‌ కార్తీక్‌ త్వరలోనే ఇంటర్‌ నేషన్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు అవుతున్నాయి. 

View this post on Instagram
 
A post shared by Dinesh Karthik (@dk00019)

ఇన్ స్టాలో ఎమోషనల్ వీడియో 

News Reels

ఈ క్రమంలో కార్తీక్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఓ వీడియోతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లైంది. ఈ ఎమోషనల్ వీడియోని గమనిస్తే.. అతను తిరిగి బ్లూ జెర్సీ వేసుకునే అవకాశాలు ఉన్నట్లు కనిపించట్లేదు. దానికి పెట్టిన క్యాప్షన్ చూస్తే.. "టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా తరపున ఆడేందుకు హార్డ్ వర్క్ చేశాను. చాలా గర్వంగా ఉంది. ఇది నా జీవితంలో ఎన్నో మధురస్మతులు మిగిల్చింది. నా తోటి ప్లేయర్లు, కోచ్‌లు, స్నేహితులు, ముఖ్యంగా అశేష అభిమానం చూపుతున్న ఫ్యాన్స్‌కి ధన్యవాదాలు. కల నిజమైంది" అని క్యాప్షన్‌లో రాశాడు. ఇక ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్స్‌.. ఒక్కసారిగా షాక్‌కు గురి అవుతున్నారు. "ప్లీజ్‌ కార్తిక్‌.. రిటైర్మెంట్‌ ప్రకటించవద్దు" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

పునరాగమనం తర్వాత 

ఇక ఇదిలా ఉంటే.. దినేష్ కార్తీక్ 2004లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో కూడా అతను టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. ధోనీ ఉండగా భారత జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, గత కొన్నేళ్లుగా అతను జట్టులో పునరాగమనం చేయగలిగాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో తొలుత జట్టులో భాగమైన అతడు ఆ తర్వాత గతేడాది కూడా టీ20 ప్రపంచకప్‌లో అవకాశం దక్కించుకున్నాడు. కార్తీక్ ఇప్పుడు ఇద్దరు కొడుకులకు తండ్రి. కుటుంబంతో గడపాలనుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలో ఆయన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రపంచకప్‌లో ప్రారంభ మ్యాచ్‌లలో దినేష్ కార్తీక్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించింది. కానీ, అతని బ్యాట్ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత, ఇంగ్లండ్‌తో జరిగే ముఖ్యమైన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో అతని స్థానంలో రిషబ్ పంత్‌ని ప్లేయింగ్ 11లో చేర్చారు. ప్రస్తుతం కార్తీక్‌ వయసు 37 ఏళ్లు. వచ్చే ప్రపంచకప్‌లో ఆడతాడనే ఆశ అయితే లేదు. దీంతోనే ఇక కార్తీక్ రిటైర్మెంట్ సూచనలు కూడా ఇచ్చాడని భావిస్తున్నారు.

Published at : 24 Nov 2022 05:19 PM (IST) Tags: T20 World Cup Dinesh Karthik Dinesh Karthik Retirement instagram post viral

సంబంధిత కథనాలు

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం - టోర్నీ నుంచి బెల్జియం అవుట్!

FIFA WC 2022 Qatar: ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనం - టోర్నీ నుంచి బెల్జియం అవుట్!

Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!

Wimbledon Dress Code: ఎట్టకేలకు డ్రస్ కోడ్ మార్చిన వింబుల్డన్ - ఇకపై ముదురు రంగు కూడా!

PAK vs ENG 1st Test: టెస్టు తొలిరోజే ఇంగ్లాండ్‌ 506 రన్స్‌ - 112 ఏళ్ల రికార్డు బద్దలు, నలుగురి సెంచరీలు

PAK vs ENG 1st Test: టెస్టు తొలిరోజే ఇంగ్లాండ్‌ 506 రన్స్‌ - 112 ఏళ్ల రికార్డు బద్దలు, నలుగురి సెంచరీలు

ENG Vs PAK: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ అయ్యా - టెస్టుల్లో టీ20 రేంజ్ బ్యాటింగ్ - 75 ఓవర్లలోనే 506 కొట్టేసిన ఇంగ్లండ్!

ENG Vs PAK: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ అయ్యా - టెస్టుల్లో టీ20 రేంజ్ బ్యాటింగ్ - 75 ఓవర్లలోనే 506 కొట్టేసిన ఇంగ్లండ్!

FIFA WC 2022 Qatar: ఫ్రాన్స్ పై ట్యునిషియా సంచలనం- అయినా నాకౌట్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

FIFA WC 2022 Qatar: ఫ్రాన్స్ పై ట్యునిషియా సంచలనం- అయినా నాకౌట్ చేరిన డిఫెండింగ్ ఛాంపియన్

టాప్ స్టోరీస్

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

Hit 2 Review - 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?

Hit 2 Review - 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?

Elon Musk Announces Brain Chips : మనిషి మెదడులో అడ్వాన్స్డ్ చిప్స్ ప్రయోగం | Neuralink | ABP Desam

Elon Musk Announces Brain Chips : మనిషి మెదడులో అడ్వాన్స్డ్ చిప్స్ ప్రయోగం | Neuralink | ABP Desam

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు