అన్వేషించండి
Advertisement
Dhoni As Atharva: అధర్వగా ధోని.. బ్యాట్‌తో సిక్సులే కాదు.. కత్తులతో నెత్తురు కూడా చిందిస్తున్నాడు!
మహేంద్ర సింగ్ ధోని ప్రధాన పాత్రలో రూపొందిన్న అధర్వ: ది ఆరిజిన్ గ్రాఫిక్ నవల మోషన్ పోస్టర్ విడుదల అయింది.
భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కొత్త అవతారం ఎత్తాడు. అదే అధర్వ అవతారం. సంగీత దర్శకుడు రమేష్ తమిళ్‌మణి రచిస్తున్న గ్రాఫిక్ నవల ‘అధర్వ: ది ఆరిజిన్’లో ధోని హీరో పాత్రలో కనిపించనున్నాడు. అంటే ఇదేదో సినిమా అనుకునేరు. కాదండోయ్.. ఇది కేవలం గ్రాఫిక్ నవల మాత్రమే.
దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను కూడా నిర్మాతలు విడుదల చేశారు. దీన్ని బట్టి ఇది పీరియాడిక్ గ్రాఫిక్ నవల అని అర్థం చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ బ్యాట్ పట్టుకుని సిక్సర్లు కొట్టిన ధోనిని.. ఇప్పుడు కత్తి పట్టుకుని తలలు నరుకుతుంటే చూడటం మాత్రం కొంచెం కొత్తగానే ఉంది.
ఈ గ్రాఫిక్ నవల త్వరలో అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ప్రీ-ఆర్డర్ల ద్వారా దీన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందని వీడియో చివర్లో తెలిపారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion