News
News
X

DCW vs GG, WPL 2023: ఢిల్లీకి ‘జెయింట్స్’ షాక్ - 11 పరుగులతో గెలిచిన గుజరాత్!

మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

FOLLOW US: 
Share:

Delhi Capitals Women vs Gujarat Giants, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో గుజరాత్ 11 పరుగుల గెలుపును అందుకుంది.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్, రెండో స్థానంలో ఉన్న ఢిల్లీని ఓడించడం నిజంగా సంచలనమే. టోర్నీలో మిగతా జట్ల విజయావకాశాలను ఇది ప్రభావితం చేయనుంది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ లారా వోల్వార్డ్ట్ (57: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), యాష్లే గార్డ్‌నర్ (51 నాటౌట్: 33 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు.

వికెట్లు టపటపా...
148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభం అయింది. ఓపెనర్ షెఫాలీ వర్మ రెండో ఓవర్లోనే వెనుదిరిగింది. 10 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఢిల్లీ బ్యాటర్లలో మెగ్ లానింగ్ (18: 15 బంతుల్లో, మూడు ఫోర్లు), ఆలిస్ క్యాప్సీ (22: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), మారిజానే కాప్ (36: 29 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), అరుంధతి రెడ్డి (25: 17 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. దీంతో ఢిల్లీ 18.4 ఓవర్లలోనే 136 పరుగులకు ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జెయింట్స్‌కు బ్యాటింగ్‌కు దిగింది. అయితే మొదటి ఓవర్లోనే సోఫీ డంక్లే (4:  6 బంతుల్లో) వికెట్ తీసి మారిజానే కాప్ గుజరాత్‌కు షాక్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత హర్లీన్ డియోల్ (31: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు), లారా వోల్వార్డ్ట్ (57: 45 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కానీ పరుగుల వేగం మాత్రం నెమ్మదించింది. హర్లీన్ డియోల్ నిదానంగా ఆడటంతో స్కోరు నత్తనడకన సాగింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 47 బంతుల్లో 49 పరుగులు జోడించారు.

హర్లీన్ డియోల్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన యాష్లే గార్డ్‌నర్ (51 నాటౌట్: 33 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) వేగంగా ఆడింది. ఆ తర్వాత మెల్లగా లారా వోల్వార్డ్ట్ కూడా దూకుడు పెంచడంతో స్కోరు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాక లారా అవుట్ అయింది. కానీ యాష్లే దూకుడు తగ్గించకపోవడంతో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 

తుది జట్లు
గుజరాత్‌ జెయింట్స్‌: సోఫీ డంక్లీ, లారా, హర్లీన్‌ డియోల్‌,  యాష్లే గార్డ్‌నర్‌, సుష్మా వర్మ, దయాలన్ హేమలత, అశ్వనీ, స్నేహ రాణా, తనుజా కన్వార్‌, కిమ్‌ గార్త్‌, మాన్సీ జోషీ

ఢిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్‌, షెఫాలీ వర్మ, అలిస్‌ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్‌, మారిజానె కాప్‌,  జెస్‌ జొనాసెన్‌, అరుంధతీ రెడ్డి, తానియా భాటియా, శిఖా పాండే, రాధా యాదవ్‌, పూనమ్‌ యాదవ్‌

Published at : 16 Mar 2023 10:44 PM (IST) Tags: Gujarat Giants WPL 2023 Delhi Capitals Women DCW Vs GG

సంబంధిత కథనాలు

ఉప్పల్ ఊపిరి పీల్చుకో..  ఐపీఎల్ ఆగయా..! హైదరాబాద్‌లో సన్ రైజర్స్ రికార్డులివే..

ఉప్పల్ ఊపిరి పీల్చుకో.. ఐపీఎల్ ఆగయా..! హైదరాబాద్‌లో సన్ రైజర్స్ రికార్డులివే..

LSG vs DC, IPL 2023: ఆల్‌రౌండ్‌ LSGతో వార్నర్‌ దిల్లీ ఢీ! రాహుల్‌ గెలుస్తాడా?

LSG vs DC, IPL 2023: ఆల్‌రౌండ్‌ LSGతో వార్నర్‌ దిల్లీ ఢీ! రాహుల్‌ గెలుస్తాడా?

CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!

CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!

Mohammed Shami: ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన షమీ - చెన్నైపై అద్భుత బౌలింగ్

Mohammed Shami: ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన షమీ - చెన్నైపై అద్భుత బౌలింగ్

Kane Williamson Injury: గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ - కేన్ విలియమ్సన్‌కు తీవ్ర గాయం!

Kane Williamson Injury: గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ - కేన్ విలియమ్సన్‌కు తీవ్ర గాయం!

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి