By: ABP Desam | Updated at : 29 Jan 2022 07:41 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
కూతురు ఇండీ రే వార్నర్‌తో డేవిడ్ వార్నర్ (ఫైల్ ఫొటో) (Image Credit: BCCI)
డేవిడ్ వార్నర్ భారతీయ సినిమాలకు ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా మారిపోయారు. తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఇండియన్ సినిమాకు సంబంధించిన వీడియోలు పెడుతూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో కూతురితో కలిసి చేసిన పుష్ప వీడియో తెగ వైరల్ అవుతోంది.
‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు.. తగ్గేదేలే’ హిందీ డైలాగ్‌కు డేవిడ్ వార్నర్, తన ఐదేళ్ల కూతురు ఇండీ రే వార్నర్ చేసిన వీడియోను ఫ్యాన్స్ బాగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో కింద అల్లు అర్జున్ కామెంట్ కూడా పెట్టడం విశేషం. ఇంతకుముందు కూడా వార్నర్ వీడియోలకు అల్లు అర్జున్ కామెంట్ చేశాడు.
ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌పై యాషెస్ సిరీస్‌ను 4-0తో గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో తను 34.12 సగటుతో 273 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. యాషెస్ కూడా అయిపోయింది కాబట్టి.. ప్రస్తుతం వార్నర్ దృష్టి ఐపీఎల్ మీద ఉంది.
తనను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోలేదు. అలాగే కొత్త ఫ్రాంచైజీలు కూడా తీసుకోలేదు. కాబట్టి తను నేరుగా వేలంలోకి రానున్నాడు. అయితే ఈసారి తను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు నాయకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఐపీఎల్ ముగిసినప్పటి నుంచి వార్నర్ ప్రదర్శన కూడా ఫైర్ లానే ఉండటం విశేషం.
అంతేకాకుండా తనను కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌లో 149 మ్యాచ్‌ల్లోనే 5,449 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఓవర్సీస్ ఆటగాడు డేవిడ్ వార్నరే. కాబట్టి ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న మెగా ఆక్షన్‌లో తనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
IPL 2022, Jos Buttler: సెంచరీ ముందు జోస్ బట్లర్ ఫెయిల్యూర్! కాపాడిన సంగక్కర, సన్నిహితులు!
RR vs RCB, Mohammed Siraj: ఇదేంది సిరాజ్ మియా! హైదరాబాదీ పేస్ కెరటం కెరీర్లో కోరుకోని రికార్డు
IPL 2022, Faf du Plessis: ఆర్సీబీ భవిష్యత్తు చెప్పిన డుప్లెసిస్ - భారత కల్చర్‌కు పెద్ద ఫ్యాన్ అంటూ పొగడ్త
IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !
RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!
Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం
Airtel Network Issue: ఎయిర్టెల్ వినియోగదారులకు నెట్వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!
Hyundai Venue: హ్యుండాయ్ వెన్యూ కొత్త రికార్డు - ఎన్ని కార్లు అమ్ముడుపోయాయంటే?
IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు