అన్వేషించండి

Jersey Number 10 Players: అంతర్జాతీయ క్రికెట్లో జెర్సీ @10 ఎవరు ధరించారు? సచిన్ తర్వాత ఆ జెర్సీ ఎవరు ధరించారు?

ఇంత క్రేజ్ ఉన్న 10వ నెంబర్ జెర్సీని అంతర్జాతీయ క్రికెట్లో ఎంత మంది ధరించారు? వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.

జెర్సీ నంబర్ - 10 అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? ఇంకెవరు క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కరే కదా. సచిన్‌కి, ఆ జెర్సీ నంబర్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. సచిన్ టెండుల్కర్‌ని స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్‌ని ఎంతో మంది కెరీర్‌గా ఎంచుకున్నారు. అంచెలంచెలుగా రాణించి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన వారు ఉన్నారు.  

Jersey Number 10 Players: అంతర్జాతీయ క్రికెట్లో జెర్సీ @10 ఎవరు ధరించారు? సచిన్ తర్వాత ఆ జెర్సీ ఎవరు ధరించారు?

క్రికెట్ కంటే ముందు నుంచే 10వ నంబర్ జెర్సీకి ఫుట్‌బాల్‌లో చాలా క్రేజ్ ఉంది. టాప్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు డిగో మారడోనా, మెస్సీ, పీలే, నెయ్‌మార్‌తో పాటు ఎంతో మంది పాపులర్ ఆటగాళ్లు ఈ జెర్సీని ధరించారు. 

మరి, ఇంత క్రేజ్ ఉన్న 10వ నెంబర్ జెర్సీని అంతర్జాతీయ క్రికెట్లో ఎంత మంది ధరించారు? వారు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

సచిన్ టెండుల్కర్

భారత క్రికెటర్లలో 10వ నంబర్ జెర్సీ వేసుకున్న తొలి ప్లేయర్ సచిన్ టెండుల్కరే. మీకు ఇంకో విషయం గుర్తుందా? సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం నుంచి తన జెర్సీ నంబర్ 10 కాదు. దీంతో పాటు అతడు 99,33 నంబర్ జెర్సీ నెంబర్లు కూడా వాడాడు. సచిన్ తన కెరీర్ మధ్యలో మోచేతి గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత కొన్నాళ్లపాటు 33వ నంబర్ జెర్సీ ధరించాడు. 

షాహీద్ అఫ్రిది

పాకిస్థాన్ క్రికెటర్ షాహీద్ అఫ్రిది కూడా తన అంతర్జాతీయ క్రికెట్లో 10వ నంబర్ జెర్సీనే ధరించేవాడు. స్టార్ ఆల్ రౌండర్ అఫ్రిది తన కెరీర్లో 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20 ఆడాడు. సుమారు 21 ఏళ్ల పాటు అఫ్రిది 10వ నంబర్ జెర్సీ వేసుకున్నాడు. 2017లో అఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పాకిస్థాన్ క్రికెటర్ కూడా 10వ నంబర్ జెర్సీ వేయలేదు. 

పీటర్ సిడిల్

ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్ పీటర్ సిడిల్‌ది కూడా 10వ నంబర్ జెర్సీనే. 2008 నుంచి 2019 వరకు అంటే రిటైర్మెంట్ వరకు కూడా సిడిల్ ఒక్క 10వ నంబర్ జెర్సీనే ధరించేవాడు. సిడిల్ తన కెరీర్లో 67 టెస్టులు ఆడి 221 వికెట్లు, 20వన్డేలలో 17 వికెట్లు, రెండు టీ20లలో 3 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

డేవిడ్ మిల్లర్

దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పేరు ఇప్పటికీ మారు మోగుతూనే ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు IPLలోనూ మిల్లర్ 10వ నంబర్ జెర్సీనే ధరిస్తున్నాడు. మిల్లర్ తన అంతర్జాతీయ క్రికెట్లో 134 బవన్డేలు, 81 టీ20లు ఆడాడు. IPLలో అతడు గతంలో కింగ్స్ లెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) కి ఆడాడు. ప్రస్తుతం మిల్లర్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. 

అలన్ డొనాల్డ్

దక్షిణాఫ్రికా లెజండరీ పేసర్ అలన్ డొనాల్డ్. అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్లు తీసిన తొలి దక్షిణాఫ్రికా బౌలర్ కూడా ఇతడే. డేవిడ్ మిల్లర్ కంటే ముందు డొనాల్డ్ 10వ నంబర్ జెర్సీ ధరించాడు. 12 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్‌గా ఉన్న డొనాల్డ్ 72 టెస్టులు, 164 వన్డేలు ఆడాడు.  

ఇప్పటి వరకు కేవలం ఈ ఐదుగురు ఆటగాళ్లు మాత్రమే అంతర్జాతీయ క్రికెటో 10వ నంబర్ జెర్సీని ధరించారు. సచిన్ రిటైర్మంట్ తర్వాత 2013లో భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ 10వ నంబర్ జెర్సీ ధరించాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు రచ్చ రచ్చ చేశారు. శార్దూల్ ఠాకూర్‌కి ఆ జెర్సీ ధరించే అర్హత లేదని, BCCI వెంటనే 10వ నంబర్ జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించాలని, ఆ నంబర్‌ని ఎవరికీ ఇవ్వొద్దని కోరారు. 

10కే కాదు 7 కూడా 

సచిన్ టెండుల్కర్ 10వ నంబర్ జెర్సీతో పాటు తాజాగా 7వ నంబర్ జెర్సీకి కూడా రిటైర్మెంట్ ప్రకటించాలని అభిమానులు BCCIని కోరుతున్నారు. ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని విజయాలను ధోనీ భారత్‌కు అందించాడు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget