అన్వేషించండి

టీ20లలో చహల్ కొత్త చరిత్ర - అశ్విన్, బుమ్రా కూడా అతడి వెనుకే !

IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా చహల్.. టీ20లలో సరికొత్ చరిత్ర లిఖించాడు. మరే భారత బౌలర్ కు సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు.

Yuzvendra Chahal: టీమిండియా  స్టార్  స్పిన్నర్  యుజ్వేంద్ర చహల్  సరికొత్త చరిత్ర  సృష్టించాడు. దిగ్గజ బౌలర్లను అధిగమించి టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.  సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా  చహల్.. టీ20లలో  300 వికెట్లతో పాటు ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన లసిత్ మలింగ రికార్డులను కూడా సమం చేశాడు.  టీ20లలో భారత్ స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, అశ్విన్ వంటి దిగ్గజ బౌలర్లు కూడా చహల్ తర్వాతే ఉన్నారు. 

ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో  ముగిసిన మ్యాచ్‌లో చహల్.. నాలుగు వికెట్లు తీశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు పొదుపుగా బౌలింగ్ చేసి 17 పరుగులే ఇచ్చాడు.  గత సీజన్ లో  చహల్.. 27 వికెట్లు తీసి  పర్పుల్ క్యాప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగిస్తూ  సన్ రైజర్స్ కు షాకుల మీద షాకులిచ్చాడు.   ఆదివారం నాటి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్  హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడంతో  చహల్.. టీ20లలో  300 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.  

బ్రావో ఫస్ట్.. చహల్ 15.. 

ఫ్రాంచైజీ క్రికెట్ జోరు కొనసాగుతున్న వేళ దేశానికో లీగ్  ఉన్న విషయం తెలిసిందే.  ఇలా పలు లీగ్ లతో పాటు దేశానికి ఆడుతూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో  వెస్టిండీస్ బౌలర్ డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో నిలిచాడు.  బ్రావో.. 558 మ్యాచ్ లలో  615 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో  బ్రావో తర్వాత అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (530),  కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ (479), ఇమ్రాన్ తాహిర్ (469), షకిబ్ అల్ హసన్ (451) టాప్ - 5 లొ ఉన్నారు.   చహల్..  మొత్తంగా 265 మ్యాచ్ లలో  303 వికెట్లు పడగొట్టి 15వ స్థానంలో నిలిచాడు. 

భారత్ నుంచి ఒకే ఒక్కడు..

భారత్ తరఫున ఈ ఫార్మాట్ లో 300 వికెట్లు తీసిన తొలి బౌలర్ చహలే.  చహల్  తర్వాత  అశ్విన్  (287), పీయూశ్ చావ్లా (276), అమిత్ మిశ్రా  (276), బుమ్రా (356) లు ఉన్నారు. 

 

మలింగ రికార్డు సమం.. 

సన్ రైజర్స్ తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా చహల్.. ఐపీఎల్ లో అతడి వికెట్ల సంఖ్య  170కి చేరింది.  తద్వారా ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో  అగ్రస్థానంలో ఉన్న భారత బౌలర్ అమిత్ మిశ్రా (166) ను అధిగమించిన   చహల్.. లసిత్ మలింగ  170 వికెట్ల రికార్డునూ సమం చేశాడు.  మలింగ ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతూ  122 మ్యాచ్ లలో  170 వికెట్లు పడగొట్టాడు. ఈ  జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బౌలర్ కూడా డ్వేన్ బ్రావోనే కావడం గమనార్హం. బ్రావో..  161 మ్యాచ్ లలో   183 వికెట్లు తీశాడు. ఈ సీజన్  లో రాజస్తాన్  లీగ్ దశలోనే మరో 13 మ్యాచ్ లు ఆడనున్న నేపథ్యంలో  బ్రావో రికార్డును  చెరిపేయడం   చహల్‌కు పెద్ద కష్టమేమీ కాదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chennai Super Kings vs Lucknow Super Giants Highlights | స్టోయినిస్ సూపర్ సెంచరీ..లక్నో ఘన విజయంCM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter Results: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు, రిజల్ట్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే - ఇలా చూసుకోండి
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Embed widget