Year Ender 2022: క్రికెట్ పుట్టినిల్లు - ఈ సంవత్సరం ప్రపంచాన్ని ఏలింది!
క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ ఈ సంవత్సరం ప్రపంచాన్ని శాసించింది.
Year Ender 2022: ఈ ఏడాది ఇంగ్లండ్ జట్టు క్రికెట్ ప్రపంచాన్ని శాసించింది. టీ20 ప్రపంచకప్ నుంచి ఐపీఎల్ మినీ వేలం వరకు ఆ జట్టు చాలా వార్తల్లో నిలిచింది. ఐపీఎల్ వేలం 2023లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ శామ్ కరన్ ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రూ.18.5 కోట్ల భారీ మొత్తాన్ని ఇచ్చి పంజాబ్ కింగ్స్ అతనిని తన జట్టులో చేర్చుకుంది.
భారత్‌కు షాక్
2022లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత జట్టుపై విజయం సాధించింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ కోవిడ్ కారణంగా వాయిదా వేసి 2022లో ఆడారు.
పాక్‌కు వారి దేశంలోనే ఝలక్
పాకిస్థాన్‌తో జరిగిన తొలి ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. పాకిస్తాన్‌లో జరిగిన ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 4-3తో విజయం సాధించింది. ఇంగ్లాండ్ జట్టు మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కూడా పాకిస్తాన్‌తో ఆడింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
టీ20 ఛాంపియన్‌గా
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అద్భుతమైన టచ్‌లో కనిపించిన ఇంగ్లండ్ జట్టు తొలి సెమీఫైనల్‌లో 10 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించి, ఆ తర్వాత ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఐపీఎల్ వేలంలో ఆధిపత్యం
ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఇంగ్లీష్ ఆటగాళ్లు ఆధిపత్యం కొనసాగించారు. ఇందులో శామ్ కరన్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా శామ్ కరన్ నిలిచాడు. దీంతో పాటు ఈ వేలంలో బెన్ స్టోక్స్‌ను కూడా రూ.16.25 కోట్లకు కొనుగోలు చేశారు. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేర్చుకుంది.
Also Read: World Test Championship: ప్రపంచ ఛాంపియన్ ఫైనల్స్ వైపు టీమిండియా అడుగు - పోటీలో మరో మూడు జట్లు!
View this post on Instagram