News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

WTC Final 2023: ఈ టైమ్‌లో ఇదేం కామెంట్‌! కోహ్లీకి బీసీసీఐ అన్యాయం చేసిందన్న లాంగర్‌!

WTC Final 2023: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ జస్టిన్‌ లాంగర్ కొత్త వాదనకు తెరతీశాడు! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేపథ్యంలో మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడు!

FOLLOW US: 
Share:

WTC Final 2023: 

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ జస్టిన్‌ లాంగర్ కొత్త వాదనకు తెరతీశాడు! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ నేపథ్యంలో మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడు! బీసీసీఐ విరాట్‌ కోహ్లీకి అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నాడు. అతడిపై గౌరవంతో కనీసం వన్డే కెప్టెన్‌గా అయినా కొనసాగించాల్సిందని అంటున్నాడు. అతడిలో తనకు నచ్చనిది ఏమీ లేదని పేర్కొన్నాడు.

ఫైనల్లో టీమ్‌ఇండియా ఆటతీరు బాగాలేదని, రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదని మిగతా వాళ్లు విమర్శిస్తుంటే జస్టిన్‌ లాంగర్‌ మాత్రం మరో దారి ఎంచుకున్నాడు. విరాట్‌ కోహ్లీ నాయకత్వ హయాంలో బీసీసీఐ వ్యవహార శైలి బాగాలేదని విమర్శిస్తున్నాడు.

'విరాట్‌ కోహ్లీ దూకుడంటే నాకెంతో ఇష్టం. బీసీసీఐ అతడికి అన్యాయం చేసింది. నేను ఇంకేమీ వినదల్చుకోలేదు. వన్డే కెప్టెన్సీ కావాలని నిజంగానే అతడు కోరుకుంటే బీసీసీఐ అందుకు అనుమతి ఇవ్వాల్సింది. అసలు విరాట్‌ కోహ్లీలో నేను ఇష్టపడనిది ఏదీ లేదు. అతడి దూకుడు, అభిరుచి, బ్యాటింగ్‌ సహా అన్నీ ఇష్టం. అతడో  అద్భుతమైన కెప్టెన్‌' అని లాంగర్‌ అన్నాడు.

టీమ్‌ఇండియా 2018-19 సీజన్లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీసు గెలిచింది. అప్పుడు భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ కాగా ఆస్ట్రేలియాకు జస్టిన్‌ లాంగర్‌ కోచ్‌గా పనిచేశాడు. ఇప్పటి వరకు చాలాసార్లు విరాట్‌ కోహ్లీని అతడు తెగపొగిడేశాడు.

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానే (29 బ్యాటింగ్: 71 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కేఎస్ భరత్ (5 బ్యాటింగ్: 14 బంతుల్లో) ఉన్నారు. అంతకు ముందు ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇంకా 318 పరుగులు వెనకబడి ఉంది. కనీసం ఫాలో అప్ తప్పించుకోవాలన్నా 119 పరుగులు చేయాలి.

ఆసీస్‌ తొలి ఇన్నింగ్సులో ఆసీస్‌లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు కొట్టారు. ట్రావిస్‌ హెడ్‌ 174 బంతుల్లోనే 25 బౌండరీలు ఒక సిక్సర్‌ సాయంతో 163 పరుగులు చేశారు. మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 268 బంతులు ఆడి 19 బౌండరీలు కొట్టి 121 పరుగులు చేశాడు. వీరికి తోడుగా అలెక్స్‌ కేరీ 69 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. కానీ టీమ్‌ఇండియాలో రోహిత్‌ శర్మ (15), శుభ్‌మన్‌ గిల్‌ (13), చెతేశ్వర్‌ పుజారా (14), విరాట్‌ కోహ్లీ (14) వెంటవెంటనే ఔటయ్యారు.

భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చెతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, కేఎస్‌ భరత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమి, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేశ్ ఉనద్కత్‌, ఇషాన్‌ కిషన్‌

స్టాండ్‌బై ఆటగాళ్లు: యశస్వీ జైశ్వాల్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌

ఆస్ట్రేలియా: ప్యాట్‌ కమిన్స్‌, స్కాట్‌ బొలాండ్‌, అలెక్స్‌ కేరీ, కామెరాన్‌ గ్రీన్‌, మార్కస్‌ స్టాయినిస్‌, జోష్‌ హేజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, ఉస్మాన్‌ ఖవాజా, మార్నస్‌ లబుషేన్, నేథన్‌ లైయన్‌, టాడ్‌ మర్ఫీ, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్‌ వార్నర్‌

స్టాండ్‌బై ఆటగాళ్లు: మిచెల్‌ మార్ష్‌, మాథ్యూ రెన్షా

Published at : 09 Jun 2023 02:20 PM (IST) Tags: BCCI VIRAT KOHLI IND vs AUS WTC Final 2023 Justin Langer

ఇవి కూడా చూడండి

IND vs ENG, WC23: భారత్-ఇంగ్లాండ్ తొలి వన్డే ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలి?

IND vs ENG, WC23: భారత్-ఇంగ్లాండ్ తొలి వన్డే ఎప్పుడు ఎక్కడ ఎలా చూడాలి?

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

World Cup 2023: వార్మప్ మ్యాచ్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న న్యూజిలాండ్ - 43.4 ఓవర్లలోనే 346 టార్గెట్ ఉఫ్!

World Cup 2023: వార్మప్ మ్యాచ్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న న్యూజిలాండ్ - 43.4 ఓవర్లలోనే 346 టార్గెట్ ఉఫ్!

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

టాప్ స్టోరీస్

Vizag Beach Wooden Box: విశాఖ బీచ్ కు కొట్టుకొచ్చిన భారీ పెట్టె, తెరిచిన అధికారులు - అందులో ఏముందంటే?

Vizag Beach Wooden Box: విశాఖ బీచ్ కు కొట్టుకొచ్చిన భారీ పెట్టె, తెరిచిన అధికారులు - అందులో ఏముందంటే?

Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు

Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్, సీసీటీవీల ఆధారంగా దర్యాప్తు

KGF 3: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!

KGF 3: యశ్, ‘KGF’అభిమానులకు సూపర్ న్యూస్, ‘KGF3' విడుదల ఎప్పుడో చెప్పేసిన హోంబలే ఫిల్మ్స్!

న్యూయార్క్ నగరాన్ని నిండా ముంచేసిన వరదలు, 1948 తరవాత రికార్డు స్థాయి వర్షపాతం

న్యూయార్క్ నగరాన్ని నిండా ముంచేసిన వరదలు, 1948 తరవాత రికార్డు స్థాయి వర్షపాతం