WTC Points Tableupdate: వరల్ట్ టెస్ట్ ఛాంపియన్ షిప్ - భారత ర్యాంకు ఎంతంటే ?
World Test Championship points table: WTC పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్‌కు టీమిండియా సమీపంగా వచ్చింది. ప్రస్తుతం భారత్ రెండో స్థానంలో 64.58 శాతంతో కొనసాగుతోంది.
కల సాకారమైందన్న జురెల్
రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసిన ధ్రువ్ జురెల్..తన ప్రదర్శనపై స్పందించాడు. మ్యాచ్ సమయంలో తనకు ఇలానే ఆడాలని ఎవరూ ప్రత్యేకంగా చెప్పలేదని ధ్రువ్ చెప్పాడు. తన సహజసిద్ధమైన ఆటతీరునే ఆడానని... బంతిని నిశితంగా గమనించి ఎదుర్కొన్నానని తెలిపాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ కావడంపై బాధేమీ లేదన్న ధ్రువ్.. తన మొదటి సిరీస్ ట్రోఫీని ఎత్తుకొనేందుకు తహతహలాడుతున్నానని తెలిపాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఆడాలనేది చిన్నప్పటినుంచి కల అని. ఇప్పుడు నెరవేరడం సంతోషంగా అనిపిస్తోందన్నాడు. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తనను మరో ధోనీ అంటూ పొగడడం ఆనందంగా ఉందని ధ్రువ్ తెలిపాడు. నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 90, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 39 పరుగులు చేశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ త్వరగా ఔట్ అయినా శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్ లు ఇంగ్లాండ్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వీరిద్దరు అభేధ్యమైన ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించి భారత్‌కు విజయాన్ని అందించారు.
జురెల్‌పై ప్రశంసల జల్లు
టీమ్ఇండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించిన జురెల్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. జురెల్‌ను చూస్తుంటే మరో ధోనీలా కనిపిస్తున్నాడని కొనియాడాడు. ఇదే ఆటతీరును కొనసాగిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పాడు. ధ్రువ్ జురెల్ ఏకాగ్రతలో మరో ధోనీని తలపిస్తున్నాడని గవాస్కర్ అన్నాడు. శతకం చేజారినాఉం ఇదే ఏకాగ్రతతో ఆడితే అతడు చాలా సెంచరీలు చేస్తాడని గవాస్కర్ అన్నాడు.