అన్వేషించండి
Advertisement
SA vs AUS: దక్షిణాఫ్రికా ఆ చరిత్రను మారుస్తుందా?, ఆస్ట్రేలియాతో సఫారీల సెమీస్ పై ఉత్కంఠ
South Africa vs Australia: ప్రపంచకప్‌లో బ్యాడ్ లక్ టీమ్‌గా పేరుపడిన దక్షిణాఫ్రికా కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. అద్భుతమైన ఆటతీరుతో సెమీస్ చేరిన సఫారీ జట్టు.... ఆస్ట్రేలియాతో తాడోపేడో తేల్చుకోనుంది.
World Cup semifinal: ప్రపంచకప్‌లో బ్యాడ్ లక్ టీమ్‌గా పేరుపడిన దక్షిణాఫ్రికా మరోసారి కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. అద్భుతమైన ఆటతీరుతో సెమీస్ చేరిన సఫారీ జట్టు.... ఆస్ట్రేలియాతో రెండు సెమీస్‌లో తాడోపేడో తేల్చుకోనుంది. ఓ సెమీస్‌లో లాన్స్ క్లుసెనర్ చివరి బంతికి రనౌట్ కావడం... మరో సెమీస్‌లో ఏబీ డివిలియర్స్ పరాజయంతో కంటతడి పెట్టుకున్న క్షణాలను ప్రపంచ క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఇప్పుడు వీటన్నింటినీ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించే అవకాశం దక్షిణాఫ్రికా ముందు ఉంది. అయితే ప్రారంభంలో సమస్యలతో సతమతమైన ఆస్ట్రేలియాతో మ్యాచ్... ప్రొటీస్ జట్టుకు అంత తేలిగ్గా ఉండదు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్ 12 సార్లు జరగగా అందులో అయిదు టైటిళ్లు ఆస్ట్రేలియా దగ్గరే ఉన్నాయి. కాబట్టి మరోసారి కప్పును సాధించే అవకాశాన్ని కంగారులు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. గత ఆరు ప్రపంచకప్‌లలోనే నాలుగుసార్లు ఆసిస్ గెలిచింది. గత తొమ్మిది ప్రపంచకప్‌లలో నాలుగు సార్లు సెమీస్ చేరిన దక్షిణాఫ్రికా నాలుగుసార్లు పరాజయం పాలైంది. కానీ ఈసారి కచ్చితంగా గెలవాలని బవుమా సేన భావిస్తోంది. 1992లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతి, 1999లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ టైగా ముగియడం ఇలా మహా సంగ్రామంలో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది. గత చరిత్రను ఈ ప్రపంచకప్‌లో అధిగమిస్తామని దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా ధీమాగా చెప్పాడు. ఈసారి సెమీఫైనల్ అడ్డంకిని అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామని బవూమా తెలిపాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. డికాక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. డికాక్ 591 పరుగులతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రొటీస్ టాప్ సిక్స్ బ్యాటర్లలో నలుగురు సెంచరీలు సాధించారు. డస్సెన్, హెన్రిచ్ క్లాసెన్, మార్‌క్రమ్, అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తున్నారు. డేవిడ్ మిల్లర్ కూడా రాణిస్తే ఆస్ట్రేలియాపై మరోసారి ప్రొటీస్ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది.
కీలకమైన మ్యాచ్‌లో సారధి బవుమా ఫామ్ మాత్రమే దక్షిణాఫ్రికాను వేధిస్తోంది. బవుమా ఏడు ఇన్నింగ్స్‌లలో 145 పరుగులు చేశాడు. ఒకవేళ బవుమా ఈ మ్యాచ్ ఆడకపోతే రీజా హెండ్రిక్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ టోర్నమెంట్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన హెండ్రిక్స్ ఇంగ్లాండ్‌పై 85 పరుగులు చేశాడు. మార్కో జాన్సన్, ఎంగిడి, స్పిన్నర్ కేశవ్, తబ్రైజ్ షంసీతో దక్షిణాఫ్రికా బౌలింగ్ కూడా ఈడెన్ గార్డెన్స్‌లో అద్భుతాలు చేయగలదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.
ఇటు ఆస్ట్రేలియా కూడా ఫైనల్ చేరాలని గట్టి పట్టుదలతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌పై 91/7 నుంచి కోలుకుని గ్లెన్ మాక్స్‌వెల్ 201 పరుగులతో చేసిన విధ్వంసంతో ఘన విజయం సాధించింది. ఆసిస్ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై వరుసగా సెంచరీలు కొట్టి డేవిడ్ వార్నర్ ఫామ్‌లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్... న్యూజిలాండ్‌పై 109 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. మిచెల్ మార్ష్, మాక్స్‌వెల్ విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయగలరు. స్టీవ్ స్మిత్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆస్ట్రేలియా ఆశిస్తోంది. వన్డే ప్రపంచ కప్ నాకౌట్‌లలో నాలుగు ఇన్నింగ్స్‌లలో 311 పరుగులు చేసిన ఘన రికార్డు స్మిత్ పేరిట ఉంది. కాబట్టి స్మిత్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికా జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్ , ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ న్గిడి, కగిసో రబడా, తబ్రైజ్ షంసీ, డస్సెన్, లిజాద్ విలియమ్స్.
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్ ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement