అన్వేషించండి

Hardik Pandya: హార్దిక్ వస్తే ఎవరు అవుట్ అవుతారు? - శ్రేయస్, సూర్యల్లో ఎవరు ఉంటారు?

త్వరలో హార్దిక్ పాండ్యా గాయం తగ్గి జట్టులోకి తిరిగి వస్తున్నాడని తెలుస్తోంది. మరి అప్పుడు జట్టులో ఎవరు ఉంటారు?

Shreyas Iyer And Suryakumar Yadav: శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు వన్డే ప్రపంచ కప్ 2023లో భారత జట్టు కోసం ప్రత్యేకంగా ఏమీ ఆడలేకపోయాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ వచ్చిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని అందించాడు. దాదాపు అందరు బ్యాట్స్‌మెన్ విఫలం అయ్యాక ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 49 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

అటువంటి పరిస్థితిలో హార్దిక్ పాండ్యా కమ్ బ్యాక్ ఇస్తే సూర్యకుమార్ యాదవ్ బదులు పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్న శ్రేయస్ అయ్యర్‌ జట్టులో నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు టోర్నీలో కేవలం 22.33 సగటుతో 134 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌ నుంచి ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే వచ్చింది. అదే సమయంలో అయ్యర్ కొన్ని మ్యాచ్‌లలో తక్కువ సమయంలో అవుట్ కావడం చాలా కాలంగా బలహీనంగా ఉంది. భారత జట్టు తదుపరి మ్యాచ్‌ను గురువారం నవంబర్ 2వ తేదీన ముంబైలోని వాంఖడేలో శ్రీలంకతో ఆడనుంది.

శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా తిరిగి రావచ్చు. గాయం కారణంగా హార్దిక్ గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. హార్దిక్ పునరాగమనం తర్వాత సూర్యకుమార్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పుకుంటాడని గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు అయ్యర్ పేలవ ప్రదర్శన తర్వాత సూర్యకి జట్టులో ప్లేస్ కన్ఫర్మ్ కావచ్చు.

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ రనౌట్ అయ్యాడు. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను జట్టు కోసం 49 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీని కారణంగా జట్టు మొత్తం 229 పరుగులకు చేరుకుంది.

వన్డేల్లో గణాంకాల పరంగా సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకంగా ఏమీ ఆడలేక పోయాడు. చివర్లో వచ్చి జట్టుకు త్వరితగతిన పరుగులు సాధించగలడని టీమ్ మేనేజ్‌మెంట్ నమ్మకంగా ఉంది. టీ20 ఇంటర్నేషనల్‌లో జట్టుకు ఎన్నో ఉపయోగకరమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు ఆడిన 32 ODI మ్యాచ్‌ల గురించి చెప్పాలంటే అతను 27.61 సగటుతో 718 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Lava Yuva 4: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం హెచ్చరిక
Hemant Soren: ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Tirumala News: తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
తిరుమలలో మరో వైసీపీ సానుభూతిపరుడు ఫొటో షూట్‌- అరెస్టు చేయాలని జనసేన డిమాండ్
Bachhala Malli Teaser: 'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
'బచ్చల మల్లి' టీజర్ వచ్చేసింది... నచ్చినట్టు బతుకుతా - మాసీ యాక్షన్ రోల్‌లో నరేష్ ఉగ్రరూపం
Embed widget