Who is Tilak Varma: టీమిండియా నయా సంచలనం తిలక్ వర్మ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఏ ప్రాంతానికి చెందినవాడో తెలుసా
Asia Cup 2025 | తిలక్ వర్మ పోరాటంతో భారత్ ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది. దాంతో తిలక్ వర్మ ఏపీ వాడా, తెలంగాణ ప్రాంతామా అని సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు.

Native Of Tilak Varma | భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద ఫైనల్లో విజయంతో ఆసియా కప్ 2025 (Asia Cup 2025) ట్రోఫీని సాధించింది. అయితే పహల్గాం ఉగ్రదాడి, పాక్ బోర్డు చర్యల ఫలితంగా పాకిస్తాన్ మంత్రి, ఏసీసీ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవాల్సి రావడంతో ఆసియా కప్ ట్రోఫీని భారత ఆటగాళ్లు నిరాకరించడం తెలిసిందే. అయితే ఫైనల్లో ఛేజింగ్ లో భారత్ తడబాటుకు లోను కాగా, కీలక సమయంలో బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారిన ప్లేయర్ తెలుగు తేజం తిలక్ వర్మ.
పాక్‌ను చిత్తు చేసిన చిచ్చరపిడుగు
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 147 పరుగులకు పరిమితం కాగా, ఛేజింగ్‌లో ఈసారి అభిషేక్ శర్మ త్వరగా ఔటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వికెట్ చేజార్చుకోవడం, మరో కీలక ఆటగాడు శుభ్‌మన్ గిల్ సైతం ఔటయ్యాడు. దాంతో కేవలం 20 పరుగులకే భారత్ టపార్డర్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. మరోవైపు గాయంతో కీలక ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం జట్టులో లేడు. మ్యాచ్ ఏమవుతుందా అని భారత అభిమానుల్లో, జట్టులోనూ కంగారు మొదలైంది. కానీ తీవ్రమైన ఒత్తిడిలో నిలబడి ఛేజింగ్‌ను పూర్తి చేశాడు తిలక్ శర్మ. 22 ఏళ్ల యువకుడు ఆసియా కప్ లాంటి ఫైనల్ మ్యాచులో ఒత్తిడిని జయించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. అసలే ప్రత్యర్థి పాకిస్తాన్ కావడంతో జాగ్రత్తగా ఆడిన తిలక్ చివర్లో వేగం పెంచి షాట్స్ ఆడాడు. శివం దుబేతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియా కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ సూపర్ స్టార్ తిలక్ వర్మ గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ అందిస్తున్నాం. 
ఎవరీ తిలక్ వర్మ, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ..
తిలక్ వర్మ పూర్తి పేరు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ. తిలక్ 2002 నవంబర్ 8న హైదరాబాద్‌లో జన్మించాడు. నాన్నది మేడ్చల్, కాగా అమ్మది భీమవరం అని ఓసారి తెలిపాడు. పేరుతో ఠాకూర్ అని చూసి వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చామని కొందరు అనుకోవచ్చు. కానీ తాత ముత్తాతల నుంచి కూడా తరతరలా నుంచి ఇక్కడే ఉంటున్నాం. తాను కూకట్‌పల్లిలో జన్మించగా.. తన తల్లిదండ్రులు సైతం నగరంలోనే పుట్టారని తెలిపాడు. తిలక్ వర్మకు అన్న ఉన్నాడు. తను బీటెక్ చేశాడు. అతడు బ్యాడ్మింటన్‌లో నేషనల్ లెవల్‌కు వెళ్లాడు. తండ్రి ఎలక్ట్రికల్ వర్క్ చేసేవారని తెలిపాడు. తెలంగాణ బిడ్డ ఇక్కడ అని కేటీఆర్ చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఏపీకి చెందిన వ్యక్తి విజయాలు సాధిస్తే తెలంగాణ వాడు అయ్యాడా అని ట్రోల్ చేశారు. అయితే తాను తెలంగాణకు చెందిన వాడినని తిలక్ ఓ వీడియోలో స్పష్టం చేశాడు.
తండ్రీ మేడ్చల్ హైదరాబాద్
— SR🚩 (@SrGoud29) September 29, 2025
తల్లి భీమవరం ఆంధ్రప్రదేశ్
పుట్టింది కూకట్ పల్లి పెరిగింది చదువు అంతా హైదరాబాద్ అనీ అతనే చెప్పుతున్నాడు మీ లొల్లి ఏంట్రా మద్యలో eps https://t.co/5B6OV6Avfh pic.twitter.com/59lfBuBHTL
తిలక్ వర్మ టాలెంట్ గుర్తించింది ఆయనే..
తిలక్ వర్మ చిన్నతనంలో అతడికి తండ్రి క్రికెట్ కోచింగ్ ఇప్పించడంలో ఇబ్బంది పడ్డారు. కోచింగ్ ఖర్చలు భరించలేకపోయేవారు. టెన్నిస్ బంతితో ఆడుతున్న సమయంలో మొదటి కోచ్ సలాం బయాష్ తిలక్ ను గుర్తించాడు. తన వంతుగా ఆయన శిక్షణ ఖర్చులను భరించి, తిలక్ వర్మకు అవసరమైన కిట్ అందించారు. ఇంటి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి అకాడమీకి కోచ్ తన స్కూటర్ మీద తీసుకెళ్లేవారు. మొదట్లో ఫాస్ట్ బౌలింగ్ వేసిన తిలక్‌ను కోచ్ స్పిన్ మీద ఫోకస్ చేయాలని సూచించారు.
2018–19 సీజన్‌లో తిలక్ వర్మ హైదరాబాద్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. తరువాత ఏడాది, అతను దక్షిణాఫ్రికాలో జరిగిన 2020 అండర్-19 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆరు మ్యాచ్‌లు ఆడాడు, మూడు ఇన్నింగ్స్‌లలో 86 పరుగులు చేయగా.. భారత్ ఫైనల్‌కు చేరుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (2021-22)లో హైదరాబాద్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ 2022 IPL వేలంలో తిలక్ వర్మను తీసుకుంది.
View this post on Instagram
సెప్టెంబర్ 15, 2023న వన్డేల్లో టీమిండియాకు అరంగేట్రం చేశాడు. అంతకు కొన్ని రోజులముందు టీ20ల్లో భారత్‌కు తొలిసారిగా ప్రాతినిథ్యం వహించాడు తిలక్. ఈ క్రమంలో టీ20ల్లో బెస్ట్ బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు. ఆసియా కప్ 2025 ఫైనల్లో అద్భుత బ్యాటింగ్‌తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించాడు. తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టును ఆసియా కప్ విజేతగా నిలిపాడు. ప్రధానంగా బ్యాటర్ అయినా, కుడిచేతి వాటం ఆఫ్-బ్రేక్ బౌలర్‌గానూ సేవలు అందిస్తున్నాడు.
తిలక్ వర్మ గణాంకాలు
తిలక్ వర్మ ఇప్పటివరకు 32 T20Iలలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 30 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేయగా 962 పరుగులు చేశాడు. ఆసియా కప్ ఫైనల్ తిలక్ కెరీర్లో బెస్ట్ మూమెంట్. తను ఇప్పటివరకు 4 ODIలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు, 68 పరుగులు చేశాడు.
IPLలో ముంబై ఇండియన్స్ టీంకు కీలక ఆటగాళ్లలో తిలక్ ఒకడు. 54 మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన తెలుగు క్రికెటర్ 1499 పరుగులు చేశాడు.





















