అన్వేషించండి
Advertisement
Abhimanyu Easwaran: ఎవరీ అభిమన్యు ఈశ్వరన్ - దేశవాళీ రికార్డులేంటీ?
Abhimanyu Easwaran: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో బెంగాల్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ గాయం తీవ్రత కారణంగా టెస్టు సిరీస్ నుంచి కూడా వైదొలిగినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. చేతి వేలికి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ రెండు టెస్టుల సిరీస్ నుంచి వైదొలిగాడని స్పష్టం చేసింది. రుతురాజ్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని... అతనికి విశ్రాంతి అవసరమని బీసీసీఐ వెల్లడించింది. రుతురాజ్ గైక్వాడ్ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి భారత్‌కు వస్తాడని... జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో బెంగాల్ ప్లేయర్ అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఎన్నో ఏళ్లుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్ సిరీస్‌కు దూరం కావడంతో ఈశ్వరర్‌కు లక్కీగా ఛాన్స్ వచ్చింది. సర్ఫరాజ్‌కు మాత్రం మరోసారి మొండిచేయే ఎదురైంది. అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకోవడంతో ఎవరీ ఈశ్వరన్ అని క్రికెట్ ప్రేమికులు వెతుకుతున్నారు.
దేశవాళీలో దుమ్ము రేపాడు
అభిమన్యు ఈశ్వరన్ 2013లో బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. భారత్ ఏ తరపున కూడా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. జట్టులో చోటు కోసం చాలా ఏళ్లుగా అభిమన్యు ఈశ్వరన్ వేచి చూస్తున్నాడు. మంచి బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన ఈశ్వరన్‌కు... జట్టులో స్థానం ఖాయమని ప్రతీసారి అనుకుంటున్నా అది సాకారం కాలేదు. కానీ చివరికి ఈశ్వరన్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గత సంవత్సరం బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మకు బ్యాకప్‌గా అభిమన్యు ఈశ్వరన్‌ను తీసుకున్నారు. అయితే అభిమన్యుకు తుది జట్టులో స్థానం దక్కలేదు. అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ కెరీర్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 47.24 సగటుతో 6,567 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి.
అభిమన్యు ఈశ్వరన్ ఈ జట్లకు ఆడాడు.
అభిమన్యు ఈశ్వరన్ బంగాల్‌తో పాటు, ఇండియా అండర్-23, ఇండియా బ్లూ, ఇండియా-ఎ, ఇండియా-బి, రెస్ట్ ఆఫ్ ఇండియా, బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్, ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్, ఇండియా-రెడ్, ఈస్ట్ జోన్ తరఫున ఆడాడు. అయితే ఇప్పటి వరకు అభిమన్యు ఈశ్వరన్‌కి ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. అభిమన్యు ఈశ్వరన్ దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో అరంగేట్రం చేయవచ్చు. దేశవాళీలో గొప్పగా రాణించిన అభిమన్యు ఈశ్వరన్... అంతర్జాతీయ స్థాయిలో ఆ ఫామ్ కొనసాగించగలడా అన్నది ఆసక్తికరంగా మారింది. లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది.
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కోసం టీం ఇండియా-
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అభిమన్యు ఈశ్వరన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్, జస్ప్రిత్ కుమార్, ముకేష్ కుమార్, ముకేష్ కుమార్, ప్రసిద్ధ కృష్ణ.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion