IND VS PAK: భారత్, పాక్ ఆసియా కప్ మ్యాచ్ లైవ్ ఎక్కడ చూడవచ్చు?
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఎక్కడ చూడవచ్చు?
India vs Pakistan Live Streaming: సెప్టెంబర్ 10వ తేదీ ఆదివారం 2023 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి. గతంలో ఇరు జట్లు లీగ్ దశలో తలపడగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు సూపర్-4లో ఈ రెండు జట్ల మధ్య మరోసారి పోరు జరగనుంది.
సూపర్-4లో పాకిస్తాన్ జట్టుకి ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో బాబర్ అజామ్ జట్టు బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించింది. సూపర్-4లో భారత జట్టుకి ఇదే తొలి మ్యాచ్. లీగ్ దశలో నేపాల్‌పై భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఈ సూపర్-4 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. 2:30 గంటలకు టాస్ వేయనున్నారు.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా ఎక్కడ చూడాలి?
మీరు టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఈ భారత్, పాకిస్తాన్ సూపర్-4 మ్యాచ్‌ని చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ హిందీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ మ్యాచ్‌ను ఫ్రీ డిష్ ద్వారా డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో లైవ్ చూడవచ్చు.
2023 ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌ని మీరు మొబైల్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో అభిమానులు ఈ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. అదే స్మార్ట్ టీవీ, డెస్క్ టాప్, ల్యాప్‌టాప్‌ల్లో చూడాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే.
వర్షం కారణంగా రిజర్వ్ డే
భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌కు రిజర్వ్ డే ఉంచారు. వాస్తవానికి సెప్టెంబర్ 10వ తేదీన కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంచాలని నిర్ణయించారు. వర్షం కారణంగా సెప్టెంబర్ 10వ తేదీన మ్యాచ్ జరగకపోతే సెప్టెంబర్ 11వ తేదీన మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 10న కొన్ని ఓవర్ల ఆట జరిగితే ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబర్ 11వ తేదీన మిగతా గేమ్ ఆడతారు.
మరోవైపు ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ ఆసియా క్రీడలను చైనాలో నిర్వహించనున్నారు. ఆసియా క్రీడల కోసం భారత క్రికెట్ జట్టు జెర్సీ ఎలా ఉండనుందో రివీల్ అయింది. ఆసియా గేమ్స్ కోసం భారత క్రికెట్ జట్టు జెర్సీలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు యశస్వి జైస్వాల్, రింకూ సింగ్ ఇద్దరూ కనిపిస్తున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ జెర్సీని అభిమానులు ఇష్టపడుతున్నారు. ఈ జెర్సీకి, భారత సీనియర్ జట్టు జెర్సీకి ఎంతో తేడా ఉంది. ఆసియా గేమ్స్ కోసం భారత క్రికెట్ జట్టు జెర్సీపై సోషల్ మీడియా వినియోగదారులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial