Richest Cricketer In India: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఎవరు ఎక్కువ రిచెస్ట్.. ఇద్దరి ఆస్తుల నికర విలువ వివరాలు
Virat Kohli Net Worth | టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్, టీ20 క్రికెట్ నుండి రిటైరయ్యారు. వారి ఆస్తుల మధ్య వ్యత్యాసం తెలిస్తే షాకవుతారు.

ప్రస్తుత భారత క్రికెట్లో లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. రన్ మేషిన్ కోహ్లీ కంటే దాదాపు ఒకటిన్నర సంవత్సరం పెద్దవాడు హిట్ మ్యాన్. అయితే వారి క్రికెట్ కెరీర్ దాదాపు ఒకే సమయంలో కొనసాగింది. ఇద్దరూ అటు టీ20 నుంచి, ఇటు సుదీర్ఘ ఫార్మాట్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ నెగ్గిన వెంటనే రోహిత్, కోహ్లీలు టీ20లకు గుడ్ బై చెప్పారు. ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు కొన్ని రోజుల ముందు టెస్ట్ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఇద్దరూ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. వీరిద్దరూ 2027 వన్డే వరల్డ్ కప్ తరువాత క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు.
వీరి సంపాదన విషయానికి వస్తే బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి భారీగానే సంపాదించారు. మ్యాచ్ ఫీజుల ద్వారా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద టోర్నీ ద్వారా సైతం వీరికి డబ్బులు వస్తాయి. చాలా బ్రాండ్‌లను ప్రమోట్ చేశారు. స్పాన్సర్‌షిప్ డీల్స్ ద్వారా సైతం కోహ్లీ, రోహిత్ శర్మలు కోట్లు సంపాదించారు. అయితే, వారి ఆస్తి విలువ ఎంత ఉంటుందనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ.. నికర విలువలో వ్యత్యాసం
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికి వస్తే, నివేదికల ప్రకారం హిట్ మ్యాన్ మొత్తం ఆస్తి 214 కోట్ల రూపాయలుగా అంచనా. రోహిత్ BCCI, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), ఎండార్స్‌మెంట్‌లు, స్పాన్సర్‌షిప్ డీల్స్ ద్వారా భారీగానే సంపాదించాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం ఇండియాకు కేవలం ODI ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. కాంట్రాక్ట్ ద్వారా BCCI నుంచి సంవత్సరానికి 7 కోట్ల రూపాయల జీతం పొందుతున్నాడు.
కాగా, రన్ మేషిన్, ఛేజింగ్ మాస్టర్ గా పిలుచుకునే విరాట్ కోహ్లీ మొత్తం ఆస్తి రూ.1050 కోట్లు అని రిపోర్టులు చెబుతున్నాయి. విరాట్ కోహ్లీ సైతం ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు, BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో గ్రేడ్ A లో ఉండటంతో సంవత్సరానికి 7 కోట్ల రూపాయల జీతం అందుకుంటున్నాడు. దీంతో పాటు, కింగ్ కోహ్లీ ఎండార్స్‌మెంట్‌లు, స్పాన్సర్‌షిప్ డీల్స్‌తో పాటు పలు వ్యాపారాలలో పెట్టుబడుల ద్వారా భారీగా సంపాదిస్తున్నాడు.
విరాట్- రోహిత్ ఏ కంపెనీలను ప్రమోట్ చేశారు
రోహిత్ శర్మ అడిడాస్, IIFL ఫైనాన్స్, CEAT, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో పాటు పలు పెద్ద బ్రాండ్‌లను ప్రమోట్ చేశాడు. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, రోహిత్ శర్మ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో కూడా బాగుంది. రోహిత్ స్టార్టప్‌లు, ఇతర బ్రాండ్‌లలో రూ.89 కోట్ల మేర పెట్టుబడి పెట్టాడు.
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడి, పూమా, MRF, మింత్రా సహా పలు భారీ సంస్థలతో కాంట్రాక్ట్ చేసుకున్నాడు. ఆ కంపెనీల యాడ్స్, ప్రమోషన్లతో భారీగా సంపాదించాడు. One8, Wrogn అనే 2 కంపెనీలకు యజమాని విరాట్ కోహ్లీ. దీంతో పాటు అతను మింత్రా, యూనివర్సల్ స్పోర్ట్స్‌బిజ్, పలు ఇతర కంపెనీలలో ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.
సచిన్ టెండూల్కర్‌ను ప్రపంచవ్యాప్తంగా “క్రికెట్ గాడ్”గా పిలుస్తారు. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ సచిన్. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు చేసిన తొలి, ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత క్రికెటర్లలో అత్యంత సంపన్నుడిగా సచిన్ ఉన్నాడు. రిపోర్టుల ప్రకారం ఆయన ఆస్తుల నికర విలువ రూ.1250 కోట్లు ఉంటుంది.
రిచెస్ట్ క్రికెటర్లలో ఎంఎస్ ధోనీ
రిపోర్ట్ ప్రకారం.. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆస్తుల విలువ సైతం రూ.1000 కోట్లు పైమాటే. ధోనీ బీసీసీఐ, ఐపీఎల్ ద్వారా భారీగా వేతనం పొందాడు. పలు కంపెనీలకు బ్రాండింగ్ చేయడం ద్వారా తక్కువ సమయంలో భారీగా ఆర్జించాడు. SBI, మాస్టర్ కార్డ్, జియో సినిమా, స్కిప్పర్ పైప్, ఫైర్ బోల్ట్, గల్ఫ్ ఆయిల్, అతను ఆసియన్ ఫుట్‌వేర్, విన్జో, కార్స్24, MYK లాటిక్రేట్, గరుడ ఏరోస్పేస్, ఒప్పో బ్రాండ్‌ల ప్రకటనల ద్వారా ధోనీ భారీ కాంట్రాక్టులతో పెద్ద మొత్తం సంపాదించాడని తెలిసిందే.





















