By: ABP Desam | Updated at : 05 Sep 2023 12:49 PM (IST)
పాకిస్తాన్ - భారత్ సారథులు ( Image Source : Asian Cricket Council Twitter )
Ind vs Pak Tickets: చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్తాన్ క్రికెట్‌లో తలపడేదే అరుదు. ఫార్మాట్ ఏదైనా అభిమానులను మునివేళ్ల మీద కూర్చోబెట్టే ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఆ ఆశలు మీకు ఇంకా ఉంటే మాత్రం ఊళ్లో ఉన్న ఎకరమొ రెండెకరాల భూమినే పట్టణాల్లో అయితే ఏ ఫ్లాట్‌నో అమ్మకానికి పెట్టాల్సిందే. దాయాదుల పోరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మ్యాచ్ టికెట్ల రేట్లు కొండలు కాదు ఏకంగా హిమాలయాలే ఎక్కాయి. ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ. 56 లక్షలు పలుకుతోంది. కాస్త కనికరించిన వెబ్‌సైట్స్ అయితే రూ. 20 లక్షలు, రూ. 40 లక్షల్లో అమ్ముతున్నాయి. ఇప్పుడు చెప్పండి.. ఏం అమ్మకానికి పెడతారో..!
వయాగొగో దందా..
వాస్తవానికి ఐసీసీలో జరుగబోయే మ్యాచ్ టికెట్లు ప్రముఖ యాప్ ‘బుక్ మై షో’ ద్వారా బుక్ చేసుకోవచ్చు. భారత్ -పాక్ మ్యాచ్ కోసం బుక్ మై షో ఇదివరకే ఆగస్టు 29, ఈనెల 3న రెండు దఫాలుగా టికెట్లను విక్రయించింది. బుకింగ్ ఓపెన్ చేసిన గంటలోపే యాప్‌లో ‘సోల్డ్ అవుట్’ బోర్డు కనిపించింది. కానీ ఈ టికెట్లను దక్కించుకున్న కొంతమంది, ఇతర టికెట్ బుకింగ్ యాప్స్.. సెకండరీ మార్కెట్ దందా షురూ చేశాయి. వయాగొగో అనే టికెట్ బుకింగ్ యాప్‌లో భారత్ - పాక్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గల అప్పర్ టైర్ టికెట్స్ రేట్లు రూ. 57 లక్షలుగా చూపించింది. ఇక సౌత్ ప్రీమియమ్ వెస్ట్ బే టికెట్ రేట్ రూ. 19.5 లక్షలుగా ఉంది. భారత్ - పాక్ మ్యాచ్‌కే కాదు.. భారత్ - ఆస్ట్రేలియా, భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్‌కూ టికెట్ల రేట్లు ఒక్కో సైట్‌లో రూ. 3 నుంచి రూ. 10 లక్షల దాకా చూపించాయి. దీంతో సాధారణ అభిమానులు గుండెలు బాదుకుంటున్నారు. పట్టపగలే నిలువుదోపిడీకి పాల్పడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
Viagogo, a ticket-selling website, is selling tickets at huge prices. This raises questions about how this is feasible when all tickets are officially sold through BookMyShow, the authorized ticketing partner.
— Vipin Tiwari (@vipintiwari952) September 4, 2023
Some screenshots. @bookmyshow @BCCI #BookMyShowScam pic.twitter.com/brXICzJZJq
45 lakhs.! Each ticket…
— The Defect Guy (@TheDefectGuy) September 5, 2023
😡😡😡😡😡@ICC @BCCI @viagogo @bookmyshow #ICCWorldCup2023 #indiavspak #INDvsPAK #WorldCup2023 #virat #ViratKohli #BCCI pic.twitter.com/LKCcbUAiDf
#RTI should be filed against #BookMyShow. How tickets r sold off before the time of commencement selling ? How sold off tickets r available at other sites at an exorbitant price ? Rs 1,854,140 /- for Ind vs Pak match at Ahmedabad. #INDvPAK #BookMyShowScam #ICC #BCCI #WC2023 pic.twitter.com/Od4p6aN2gv
— Gairik Maji (@gairick) September 2, 2023
అసలు అమ్మిన టికెట్స్ ఎన్ని..?
సెకండరీ మార్కెట్‌లో టికెట్ల రేట్ల ధరలు కొండెక్కడంతో క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐతో పాటు ఐసీసీలపై దుమ్మెత్తిపోస్తున్నారు. టికెట్ బుకింగ్ విషయంలో బుక్ మై షోతో ఒప్పందం కుదుర్చుకుని ఐసీసీ పెద్ద తప్పు చేసిందని, అసలు భారత్ - పాక్ మ్యాచ్‌కు బుక్ మై షో అమ్మిన టికెట్లు ఎన్నో లెక్కలు చెప్పాలని నిలదీస్తున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా లక్ష మంది వీక్షించొచ్చు. సీటింగ్ కెపాజిటీ కూడా లక్షకు పైనే. మరి ఆ టికెట్లన్నీ ఎక్కడికి పోయినట్టు..? టికెట్ల బుకింగ్ డేట్స్ (ఆగస్టు 29, సెప్టెంబర్ 3) లోనూ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటలకు గంటలు వేయిట్ చేస్తేగానీ టికెట్స్ బుక్ అవ్వలేదు. అది కూడా వెయ్యి మంది చేస్తే ఇద్దరికో ముగ్గురికో టికెట్స్ బుక్ అయ్యాయి. మరి మిగిలిన టికెట్స్ అన్ని ఎక్కడికి పోయినట్టు..? దీనిపై బీసీసీఐ, ఐసీసీ దృష్టి సారించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
The 15lac ticket is not visible now someone must have purchased it or else removed from the @viagogo app#INDvNEP #Bcci #BookMyShow #AsiaCup23 #ICCWorldCup2023 @ICC @cricketworldcup https://t.co/l70Vd4KMwF pic.twitter.com/SQe632Jcwq
— Sahil Deshmukh (@sahil_deshmukh_) September 4, 2023
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
World Cup 2023: హైదరాబాద్‌లో పాక్xకివీస్ వార్మప్ మ్యాచ్! వర్షం కురిసే ఛాన్స్!
ODI World Cup 2023 : నేటి నుంచి వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు- మరి భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో తలపడుతుంది?
Australia squad: ఆసీస్ ప్రపంచకప్ టీమ్‌లో మార్పు! భీకర్ ఫామ్‌లో ఉన్న బ్యాటర్ వచ్చేశాడు!
World Cup 2023: టీమ్ఇండియా వరల్డ్ కప్ జట్టులో మార్పులు- అక్షర్ పటేల్ స్థానంలో అశ్విన్‌కు చోటు
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి, కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
/body>