అన్వేషించండి

Vaibhav Sooryavanshi Survives: ఔట్ అనుకొని బౌండరీ లైన్ దాకా వెళ్లిన వైభవ్.. థర్డ్ అంపైర్ వివాదస్ప‌ద నిర్ణ‌యంతో  తిరిగి బ‌రిలోకి..  అఫ్గాన్ ప్లేయర్స్ ఫైర్!

అఫ్గానిస్తాన్ ఏ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఔట్ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన నాటౌట్ డెసిషన్ సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది.

Third Umpire Gives Shocking Lifeline To Vaibhav: ఇండియా ఏ, అఫ్గానిస్తాన్ ఏ జట్ల మధ్య జరిగిన ఐదో ట్రై-సిరీస్ వన్డే మ్యాచ్ ఒక బిగ్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టీమిండియా యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అవుట్ విషయంలో థర్డ్ అంపైర్ ఇచ్చిన ఒక డెసిషన్ గ్రౌండ్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. అఫ్గాన్ ప్లేయర్ పట్టిన క్యాచ్ క్లియర్‌గా ఉన్నట్లు రిప్లైస్ లో కనిపించినా, థర్డ్ అంపైర్ మాత్రం బ్యాటర్‌కు ఫేవర్ గా నిర్ణయం తీసుకున్నాడు. బాల్ గ్రౌండ్‌కు తగిలిందనే సాకుతో నాటౌట్ అని ప్రకటించడంతో అఫ్గాన్ టీమ్ షాక్‌కు గురైంది.

డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచిన వైభ‌వ్..
ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వైభవ్ సూర్యవంశీ ఇంకా పరుగుల ఖాతా కూడా తెరవలేదు. అఫ్గాన్ ఫీల్డర్ క్యాచ్ అందుకోవడంతో తను అవుట్ అయ్యానని ఫిక్స్ అయిన వైభవ్, అప్పటికే పిచ్ వదిలి బౌండరీ లైన్ వరకు వెళ్లాడు. కానీ జెయింట్ స్క్రీన్ పై థర్డ్ అంపైర్ గ్రీన్ లైట్ (నాటౌట్) ఫ్లాష్ చేయడంతో మళ్లీ క్రీజులోకి వెనక్కి వచ్చాడు. బాల్ కొంత భాగం నేలకు తగిలిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అంపైర్ చెప్పాడు. ఈ విచిత్రమైన డెసిషన్ చూసి మైండ్ బ్లాక్ అయిన అఫ్గానిస్తాన్ ఏ ప్లేయర్స్ ఆన్-ఫీల్డ్ అంపైర్ల దగ్గరకు వెళ్లి గట్టిగా ఆర్డ్యూ చేశారు. థర్డ్ అంపైర్ అసెస్‌మెంట్ అస్సలు ఫెయిర్‌గా లేదంటూ నెటిజన్లు సైతం సోషల్ మీడియాలో అంపైరింగ్ ప్రమాణాలపై ట్రోల్స్ స్టార్ట్ చేశారు.

Read Also: Lionel Messi Hat Trick : మెస్సి మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. ఆల్ టైమ్ హై గోల్స్ హిస్టరీని సమం చేస్తూ అల్జీరియాపై హాట్రిక్ గోల్స్ తో విధ్వంసం

రెండు లైఫ్ లైన్లు వచ్చినా ఫెయిల్యూర్..
ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఈ 15 ఏళ్ల వండర్ కిడ్, లంక టూర్‌లో మాత్రం దారుణంగా తడబడుతున్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ పుణ్యమా అని ఒక లైఫ్ లైన్ దక్కినా దాన్ని వైభవ్ సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాడు. టోటల్ గా రెండు సార్లు బతికిపోయిన ఈ యంగ్ బ్యాటర్, కేవలం 38 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఫరీదూన్ దావూద్‌జాయ్ వేసిన బాల్‌ను మిస్‌హిట్ చేసి కవర్ పాయింట్ లో ఉన్న ఖాలిద్ తనివాల్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ప్రెజర్ లో వండర్ కిడ్, పాత గొడవల ఎఫెక్ట్
ఐపీఎల్ లో వరల్డ్ బెస్ట్ బౌలర్లను ఊచకోత కోయడంతో వైభవ్ పై ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. కానీ టి20 నుంచి వన్డే ఫార్మాట్ కు మారే క్రమంలో తను తీవ్ర ఒత్తిడిని ఫేస్ చేస్తున్నాడు. పైగా శ్రీలంక ఏ టీమ్‌తో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో కాంట్రవర్షియల్ సూపర్ ఓవర్ ముగిసిన తర్వాత లంక ప్లేయర్ తో వైభవ్ ఫిజికల్ అల్ట్రికేషన్ (భౌతిక గొడవ) కు దిగాడు. ఆ మ్యాచ్ లో ఇండియా ఏ టీమ్ ఓడిపోగా, వైభవ్ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అఫ్గాన్ మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంతో వైభవ్ వార్తల్లో నిలిచాడు. ఈ సిరీస్ లో వైభవ్ తన టాలెంట్ కు తగ్గట్లు ఆడలేకపోవడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను కూడా టెన్షన్ పెడుతోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kohli Fitness Secret: కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
కోహ్లీ ఫిట్‌నెస్ చూసి సంజూ ఫిదా.. అడిగి మ‌రీ, టిప్స్ తెలుస‌కున్న శాంసన్..  కొంత‌కాలానికే గివ్ అప్ ఇచ్చిన స్టార్ బ్యాటర్!
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Who Is Saransh Jain.?: ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
ఐపీఎల్ అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కి టీమ్ ఇండియా టెస్ట్ కాల్-అప్.. వాషింగ్టన్ స్థానంలో సారాంశ్ జైన్ ఎంట్రీ, 11 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget