అన్వేషించండి

Vaibhav Sooryavanshi Mindset Analysis: ఐపీఎల్ లో సిక్సర్ల వీరుడు.. మైదానంలో స్లెడ్జింగ్ దెబ్బకు నోరు జారిన వైభవ్, సరిగ్గా మైండ్ గేమ్ ఆడకపోతే ఫ్యూచర్ కొలాప్స్ అవ్వడం గ్యారెంటీనా!

శ్రీలంక టూర్లో స్లెడ్జింగ్‌కు బలై అగ్రెసివ్‌గా రియాక్ట్ అయిన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కెరీర్ సక్సెస్ అవ్వాలంటే మెంటల్ కండిషనింగ్, మైండ్ కంట్రోల్ చాలా అవసరమని స్పోర్ట్స్ సైకాలజిస్టులు సూచిస్తున్నారు.

Vaibhav Sooryavanshi Mentally Challenged By Opponents: ఇండియా క్రికెట్ లో మోస్ట్ పాపులర్ టీనేజర్‌గా మారిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ చుట్టూ ఇప్పుడు నెగెటివిటీ స్టార్ట్ అయింది. గ్రౌండ్ లో తను పెంచుకుంటున్న ఇమేజ్ చూసి అపోజిషన్ టీమ్స్ తనను స్లెడ్జింగ్‌తో టార్గెట్ చేస్తున్నాయి. రీసెంట్‌గా శ్రీలంక ఏ టీమ్‌తో దంబుల్లాలో జరిగిన మ్యాచ్ లో లంక ప్లేయర్స్ స్లెడ్జింగ్ చేయడంతో వైభవ్ కోపంతో అగ్రెసివ్‌గా రియాక్ట్ అయ్యాడు. ఈ ఇన్సిడెంట్ పై ఇండియాలోని ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ స్వరూప్ సేవనూర్ స్పందించాడు. వైభవ్‌కు ప్రెజర్ హ్యాండిల్ చేయడం కోసం "సిట్యుయేషన్ మేనేజ్మెంట్" ట్రైనింగ్ చాలా అవసరమని చెప్పాడు. అపోజిషన్ టీమ్స్ మైండ్ గేమ్స్ ఆడుతూ డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తాయని, దాన్ని తట్టుకునేలా పవర్‌ హిట్టర్ వైభవ్ ప్రిపేర్ అవ్వాలని సూచించాడు.

Read Also: T20 World Cup - IND W VS NL W Result Update: టీమిండియా మ‌హిళ‌ల గ్రాండ్ విక్ట‌రీ.. నెదర్లాండ్స్ పై భారీ విజ‌యం.. స‌త్తా చాటిన స్మృతి, షెఫాలీ, శ్రీచ‌ర‌ణి

ఎన్సీఏలో ప్రొఫైలింగ్ ప్రాసెస్..
బీసీసీఐ, వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ గా ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (పాత NCA) కు ప్లేయర్స్ మెంటల్ హెల్త్ పై ఆల్రెడీ పూర్తి అవగాహన ఉందని సేవనూర్ చెప్పాడు. "రెండు మూడేళ్ల క్రితం ఎన్‌సీఏలో అండర్-16 క్యాంప్ లో వైభవ్‌తో కలిసి వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. తను చాలా కామ్ బాయ్. అందుకే క్యాంప్స్ జరిగినప్పుడు స్పోర్ట్స్ సైకాలజీ సర్వీసెస్ లో ప్లేయర్ల ప్రొఫైలింగ్ చేస్తారు" అని వివరించాడు. రాహుల్ ద్రవిడ్ హెడ్‌గా ఉన్న టైమ్ నుంచి ఈ హై పర్ఫార్మెన్స్ క్యాంప్స్ నిర్వహించడం ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్‌గా మారిందని తెలిపాడు. అండర్-19 లెవెల్ లో ఎంతో టాలెంట్, టెక్నిక్ ఉన్న వండర్ఫుల్ ప్లేయర్స్ సీనియర్ లెవెల్‌కు వచ్చేసరికి సక్సెస్ కాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

Read Also: Vaibhav Sooryavanshi Survives: ఔట్ అనుకొని బౌండరీ లైన్ దాకా వెళ్లిన వైభవ్.. థర్డ్ అంపైర్ వివాదస్ప‌ద నిర్ణ‌యంతో  తిరిగి బ‌రిలోకి..  అఫ్గాన్ ప్లేయర్స్ ఫైర్!   

సిట్యుయేషనల్ ఇంటెలిజెన్స్ మిస్ అయితే అంతే..
టాలెంట్‌తో పాటు మైండ్ కంట్రోల్, సిట్యుయేషనల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే పెద్ద అచీవ్‌మెంట్స్ సాధ్యమవుతాయని సేవనూర్ స్పష్టం చేశాడు. ఒకవేళ అది డెవలప్ కాకపోతే టాలెంట్ అంతా వేస్ట్ అవుతుందని హెచ్చరించాడు. వైభవ్ వెనక ఉన్న పర్సనాలిటీని అర్థం చేసుకుని వర్క్ చేయాలన్నాడు. స్పోర్ట్స్ అనేది 90 శాతం మెంటల్ గేమ్ అని అందరూ అంటున్నా, దాన్ని ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ లాగా మాత్రమే చూస్తున్నారని అన్నాడు. మెంటల్ ప్రెజర్, యాంగ్జయిటీ అనేది ఒక ప్రాబ్లమ్ కాదని, దీన్ని స్పోర్ట్స్ రొటీన్ లో ఒక భాగంగా మార్చాలని కోచ్‌లు, పేరెంట్స్, అథ్లెట్లకు సేవనూర్ అడ్వైజ్ ఇచ్చాడు. క్రంచ్ సెకండ్స్ లో మైండ్ కంట్రోల్ చేయడమే ఒక గ్రేట్ అథ్లెట్‌ను డిఫైన్ చేస్తుందని స్పష్టం చేశాడు.

హడావుడి వద్దు..
ఇండియా క్రికెట్ టీమ్ ప్రస్తుతం ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉందని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి స్టార్స్ రిటైర్మెంట్ తర్వాత యంగ్ ప్లేయర్స్ ప్లేస్ కోసం ట్రై చేస్తున్నారని ఒక మాజీ సీనియర్ నేషనల్ సెలెక్టర్ స్పష్టం చేశాడు. "యంగ్ క్రికెటర్లకు టాలెంట్ ఉంది కానీ కొందరు రికార్డులు, మైలురాళ్ల కోసం హడావుడి పడుతున్నారు. ఇది యాంగ్జయిటీకి దారితీస్తుంది. బీసీసీఐ వీరికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇవ్వాలి. మేము మీ వెనక ఉన్నాం అని టీమ్ మేనేజ్మెంట్ వారికి కాన్ఫిడెన్స్ ఇస్తే ప్రెజర్ తగ్గుతుంది" అని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 237.31 స్ట్రైక్ రేట్‌తో 776 రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్‌కు మెంటల్ కండిషనింగ్ అనేది ఫెయిల్యూర్స్ నుంచి త్వరగా కోలుకోవడానికి హెల్ప్ అవుతుందని అనలిస్టులు చెప్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
MSD Rahane Secrets: ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
CoE Fitness Overhaul: ఫిట్‌నెస్ నిబంధనల్లో సంచలన మార్పులు.. బ్రోంకో టెస్ట్ మైండ్ బ్లాకింగ్ టార్గెట్స్, హర్షిత్ రాణా ఇష్యూలో ట్విస్ట్!
ఫిట్‌నెస్ నిబంధనల్లో సంచలన మార్పులు.. బ్రోంకో టెస్ట్ మైండ్ బ్లాకింగ్ టార్గెట్స్, హర్షిత్ రాణా ఇష్యూలో ట్విస్ట్!
ODI World Cup Predictions: 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
Embed widget