By: ABP Desam | Updated at : 30 Jan 2023 05:25 PM (IST)
Edited By: nagavarapu
షెఫాలీ వర్మ (source: twitter)
U-19 Women’s T20 WC: 2023 అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. తొలిసారి భారత మహిళల జట్టు ఐసీసీ ట్రోఫీని గెలిచింది. ఈ చరిత్రాత్మక విజయం తర్వాత భారత కెప్టెన్ షెఫాలీ వర్మ తన తర్వాతి ప్రణాళికను వివరించింది.
అండర్- 19 టీ20 ప్రపంచకప్ లో భారత మహిళల జట్టుకు షెఫాలీ వర్మ కెప్టెన్ గా వ్యవహరించింది. ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను అందుకుంది. ఈ టోర్నీ మొత్తం షెఫాలీ ప్లేయర్ గా, కెప్టెన్ గా ఆకట్టుకుంది. జట్టును విజయపథంలో నడిపించింది. మ్యాచ్ గెలిచాక షెఫాలీ ఈ ప్రపంచకప్ విజయం గురించి, తన తర్వాతి ప్రణాళికల గురించి వివరించింది. 'ఇది ఆరంభం మాత్రమే. రెండు వారాల తర్వాత జరగనున్న సీనియర్ మహిళల టీ20 ప్రపంచకప్ లోనూ ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలనుకుంటున్నాను' అని భారత కెప్టెన్ తెలిపింది.
On the hunt for a tournament double 🏆🏆
After #U19T20WorldCup glory, Shafali Verma now wants to play a key part in India's #T20WorldCup push 👇https://t.co/3GbUpvhT1A— ICC (@ICC) January 30, 2023
ఇప్పుడు అదే మా లక్ష్యం
19 ఏళ్ల షెఫాలీ వర్మ భారత సీనియర్ మహిళల జట్టులోనూ ఉంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా వేదికగా టీ20 మహిళల ప్రపంచకప్ జరగనుంది. ఈ టైటిల్ ను కూడా గెలవడం ద్వారా దక్షిణాఫ్రికా పర్యటనను చిరస్మరణీయం చేయాలని షెఫాలీ కోరుకుంటోంది. 'మేం ఇక్కడకు వచ్చినప్పుడు అండర్- 19 ప్రపంచకప్ మీదే దృష్టి పెట్టాం. దాన్ని గెలుచుకున్నాం. ఇప్పుడు మా దృష్టంతా సీనియర్ టీ20 ప్రపంచకప్ పై ఉంది. ఈ విజయాన్ని మరచిపోయి టీ20 ప్రపంచకప్ ను గెలుచుకోవాలనుకుంటున్నాను' అని షెఫాలీ వర్మ స్పష్టంచేసింది.
ఈ విజయంతో సంతృప్తి పడం
2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత జట్టులో షెఫాలీ కూడా భాగం. ఆ ఓటమి బాధ తనలో ఇంకా అలానే ఉందని.. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్ చాలా ఎమోషనల్‌గా సాగిందని షెఫాలీ తెలిపింది. 'మేం అది గెలవలేకపోయాం. ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయాక మేం చాలా బాధపడ్డాం. అయితే ఇప్పుడు మాత్రం సంతోషంతో కన్నీళ్లు వస్తున్నాయి. నేను వాటిని ఆపడానికి చాలా ప్రయత్నించాను. అయితే నావల్ల కాలేదు. భారత్ తరఫున పరుగులు సాధిస్తూనే ఉండాలని అనుకుంటున్నాను. ఈ ప్రపంచకప్ విజయంతో సంతృప్తి పడాలనుకోవడంలేదు. ఇది ప్రారంభం మాత్రమే' అని షెఫాలీ తెలిపింది.
This will definitely bring tears in your eyes!!!
— Akanksha Mishra (@akaankshamishra) January 29, 2023
यह मेहनत से ज्यादा स्ट्रगल के फल मिलने के आंसू है ❤️🥹#u19WomensT20WorldCup #womencricket #U19T20WorldCup #shefaliverma
pic.twitter.com/3LwYlIlCR2
Outstanding batting by
— Munaf Khan Khan (@MunafKhanKhan2) January 29, 2023
Shefali verma hitting big sixes against all teams in t20 world🏆 pic.twitter.com/tQOtZNBVMP
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!
IND Vs AUS 3rd ODI: సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకపోయినా 260కి పైగా!
IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?
IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?