అన్వేషించండి
Advertisement
T20 World Cup Super 8 Schedule : ఇక సూపర్ 8 సమరం, ఏ జట్టుతో ఎవరు తలపడుతున్నారంటే?
T20 World Cup 2024: ఈనెల 2 నుంచి క్రికెట్ అభిమానులను అలరిస్తున్న టీ20 వరల్డ్ కప్‌లో ఒక లెవెల్ ముగిసింది. సూపర్-8 బెర్తులను ఖరారు చేసుకున్న జట్లు.. అమీతుమీ తేల్చుకోనున్నాయి.
India's T20 World Cup Super 8 Schedule: టీ 20 ప్రపంచకప్(T20 World Cup 2024)లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే లీగ్ మ్యాచులు ముగియగా... ఇక సూపర్ ఎయిట్(Super 8) సమరం ఆరంభం కానుంది. మొత్తం నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించాయి. ఆతిథ్య అమెరికా, వెస్టిండీస్ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించాయి. కానీ లీగ్ దశలోనే పాకిస్థాన్, న్యూజిలాండ్, శ్రీలంక జట్లు వెనుదిరిగాయి. ఇక పసికూన అమెరికా సూపర్ ఎయిట్‌లో స్థానం దక్కించుకుని సత్తా చాటింది.
సూపర్ 8లో ఇలా...
ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024లో సూపర్ 8కు వెస్టిండీస్, అమెరికా కూడా అర్హత సాధించి రెండో దశ పోరాటానికి సిద్ధమయ్యాయి. గ్రూప్ ఏ నుంచి టీమిండియా, అమెరికా, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, గ్రూప్ సీ నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధించాయి. సూపర్ 8లో ఈ జట్లను రెండు గ్రూపులుగా వర్గీకరించారు. గ్రూప్‌ఏలో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. గ్రూప్ బీలో అమెరికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఈ సూపర్ 8 మ్యాచులు అన్నీ వెస్టిండీస్‌లోనే జరగనున్నాయి. ఆంటిగ్వా, బార్బుడాలో నాలుగు మ్యాచ్‌లు, బార్బడోస్‌లో మూడు మ్యాచులు, సెయింట్ లూసియాలో మూడు మ్యాచులు, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడైన్స్‌లో మరో రెండు మ్యాచులు జరగనున్నాయి. సూపర్ ఎయిట్‌లో తొలి మ్యాచ్ అమెరికా-దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. రెండో మ్యాచ్ వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ తలపడనుంది.
సూపర్ 8 షెడ్యూల్ ఇలా....
జూన్ 19: అమెరికా Vs దక్షిణాఫ్రికా- సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వా
జూన్ 19: ఇంగ్లండ్ Vs వెస్టిండీస్- డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్, సెయింట్ లూసియా
జూన్ 20: అఫ్గానిస్తాన్ Vs భారత్- కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
జూన్ 20: ఆస్ట్రేలియా Vs బంగ్లాదేశ్, సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వా
జూన్ 21: ఇంగ్లండ్ Vs సౌతాఫ్రికా, డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్, సెయింట్ లూసియా
జూన్ 21: అమెరికా Vs వెస్టిండీస్, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
జూన్ 22 : భారత్ Vs బంగ్లాదేశ్, సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వా
జూన్ 22 : అఫ్గానిస్థాన్ Vs ఆస్ట్రేలియా, ఆర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్
జూన్ 23: అమెరికా Vs ఇంగ్లాండ్, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
జూన్ 23: వెస్టిండీస్ Vs సౌతాఫ్రికా, సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం, ఆంటిగ్వా
జూన్ 24 : ఆస్ట్రేలియా Vs ఇండియా, డారెన్ సామీ క్రికెట్ గ్రౌండ్, సెయింట్ లూసియా
జూన్ 24 : అఫ్ఘానిస్తాన్ Vs బంగ్లాదేశ్, అర్నోస్ వేల్, సెయింట్ విన్సెంట్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion