Jemimah Rodrigues : 'నాలుగు నెలలు చాలా కష్టంగా గడిచాయి కానీ...' ఆస్ట్రేలియాపై విజయం తరువాత జెమీమా రోడ్రిగ్స్ కామెంట్స్
Jemimah Rodrigues : మహిళల వన్డేలో 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ కొత్త రికార్డు సృష్టించింది. ఇదివరకు 331 అత్యధిక స్కోరు.

Jemimah Rodrigues : భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం నాడు డివై పాటిల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రికార్డు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. భారత జట్టు విజయంలో జెమీమా రోడ్రిగ్స్ కీలక పాత్ర పోషించింది. రోడ్రిగ్స్ తన సెంచరీతో భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో మరపురాని ఫీట్‌ను సాధించింది. రోడ్రిగ్స్‌ను అజేయమైన, చిరస్మరణీయమైన సెంచరీ చేసినందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక చేశారు.
మ్యాచ్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎంపికైన తర్వాత జెమీమా మాట్లాడుతూ, "అందరికంటే ముందు, నేను యేసుకి కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇది ఒక్కదాన్నే చేయలేను. ఈ రోజు ఆయన నన్ను ఈ కష్టాల నుంచి బయటకు తీసుకువచ్చారని నాకు తెలుసు. ఈ సమయంలో నన్ను నమ్మిన నా తల్లి, తండ్రి, కోచ్, ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. గత నాలుగు నెలలు నిజంగా చాలా కష్టంగా ఉన్నాయి, కానీ ఇది ఒక కలలా ఉంది. ఇంకా పూర్తిగా నిజం కాలేదు." అని అన్నారు.
📽️ Raw reactions after an ecstatic win 🥹
— BCCI Women (@BCCIWomen) October 31, 2025
The #WomenInBlue celebrate a monumental victory and a record-breaking chase in Navi Mumbai 🥳
Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4 #TeamIndia | #INDvAUS pic.twitter.com/MSV9AMX4K1
భారత్ గెలవడానికి ఆస్ట్రేలియా 339 పరుగులు లక్ష్యంగా నిర్దేశించింది. భారత జట్టు 59 పరుగుల వద్ద మంధానా, షెఫాలీ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన జెమీమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 14 ఫోర్లతో 127 పరుగులు చేసి జట్టు విజయంలో మరపురాని పాత్ర పోషించింది.
రోడ్రిగ్స్‌కు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా బాగా సహకరించింది. హర్మన్ 88 బంతుల్లో 89 పరుగులు చేసి మూడో వికెట్‌కు రోడ్రిగ్స్‌తో కలిసి 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీప్తి శర్మ 24, రిచా ఘోష్ 26, అంజుమోత్ కౌర్ 15 పరుగులు చేశారు. షెఫాలీ 10, మంధానా 24 పరుగులు చేసి అవుట్ అయ్యారు. భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Unforgettable dressing room moments 🫶
— BCCI Women (@BCCIWomen) October 31, 2025
Right after playing a 𝙅𝙚𝙢 💎 of a knock ❤️
Get your #CWC25 tickets 🎟️ now: https://t.co/vGzkkgwXt4 #TeamIndia | #INDvAUS | #WomenInBlue | @JemiRodrigues pic.twitter.com/1DEtWkUemo
అంతకుముందు మహిళల వన్డే క్రికెట్‌లో 331 పరుగులు అత్యధిక లక్ష్యంగా ఉంది. 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత జట్టు కొత్త రికార్డు సృష్టించింది.
మహిళల వన్డేలో 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి భారత్ కొత్త రికార్డు సృష్టించింది. ఇదివరకు 331 అత్యధిక స్కోరు.




















