అన్వేషించండి

Asia Cup 2025: ఆసియా కప్ నుంచి వైదొలిగిన భారత్! బీసీసీఐ నిర్ణయంతో పాకిస్తాన్‌కు షాక్

India vs Pakistan | 2025 ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతుండగా ACC ఈవెంట్ల నుంచి భారత్ తప్పుకుంది. బీసీసీఐ తమ నిర్ణయాన్ని లేఖ రాసినట్లు సమాచారం.

ముంబై: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ ఏడాది జరిగే ఆసియా కప్‌ (Asia Cup) మెగా టోర్నీ నుంచి టీమిండియాం వైదొలగాలని నిర్ణయం తీసుకుంది. పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ లతో భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాంతో ఏషియా క్రికెట్ కౌన్సిల్ (ACC) యొక్క అన్ని కార్యక్రమాల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించింది. 

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, వచ్చే నెలలో శ్రీలంకలో జరగాల్సిన మహిళల ఎమర్జింగ్ టీం ఏషియా కప్, సెప్టెంబర్‌లో జరగాల్సిన పురుషుల ఏషియా కప్ నుండి తప్పుకుంటున్నట్లు ACC కి బీసీసీఐ తెలియజేసింది. తమ నిర్ణయాన్ని ఏషియా క్రికటె్ కౌన్సిల్‌కు తెలియజేస్తూ లేఖ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. 

 ప్రస్తుతం ACCకి పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నక్వి నేతృత్వం వహిస్తున్నారు. అతడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అధ్యక్షుడు గానూ కొనసాగుతున్నారు. దాంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. దౌత్య పరంగా పాకిస్తాన్‌ను ఒంటి చేయాలని చూస్తున్న భారత్.. అటు క్రికెట్‌లోనూ దాయాదిని ఒంటరి చేసి, ఇరుకున పెట్టాలని చూస్తోందని బోర్డు వర్గాలు తెలిపాయి. 

BCCI ఒక అధికారిని ఉటంకిస్తూ "పాకిస్తాన్ మంత్రి నేతృత్వంలోని ACC నిర్వహించే టోర్నమెంట్‌లో భారత జట్టు పాల్గొనదు. ఇది దేశం కోసం తీసుకున్న నిర్ణయం.  మహిళల ఎమర్జింగ్ టీం ఏషియా కప్ నుండి తప్పుకుంటున్నట్లు వారు నోటిఫికేషన్ ఇచ్చారు. మేం భారత ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఆటగాళ్ల భద్రతతో పాటు జాతీయత, దేశ సమగ్రత ముఖ్యమని" పేర్కొంది.

పురుషుల ఏషియా కప్ వాయిదా పడవచ్చు

ఈ ఏడాది సెప్టెంబర్‌లో పురుషుల ఏషియా కప్ 2025 జరగాల్సి ఉంది. దీనికి భారత్ ఆతిథ్యం ఇవ్వాలి. భారత్‌తో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక పాల్గొనే ఈ టోర్నమెంట్ సైతం వాయిదా పడే అవకాశం ఉంది. పాకిస్తాన్ పాల్గొనే మెగా టోర్నీలపై బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిన తరువాతే నిర్ణయం తీసుకోనుంది. 

భారతదేశం లేకుండా ఏషియా కప్ నిర్వహించడం సాధ్యం కాదని BCCIకి తెలుసు, ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లలో భారత్ పాల్గొంటేనే కాసుల వర్షం కురుస్తుంది. అటువంటిది భారత్ లాంటి దేశం ఏషియా కప్ ఆడకపోతే పాక్ మీద ఒత్తిడి మరింత పెరుగుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లేకుంటే ఏషియా కప్‌పై ప్రసారహక్కులకు ఎవరూ ముందుకు రారు. 

ఏషియా కప్ హక్కులను 2024లో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా (SPNI) 170 మిలియన్ అమెరికన్ డాలర్లకు తదుపరి 8 సంవత్సరాలకు పొందింది. ఈ టోర్నమెంట్ ఈ ఎడిషన్ జరగకపోతే, ఒప్పందంలో కొన్ని మార్పులు జరగవచ్చు.

2023లో జరిగిన ఏషియా కప్ గత ఎడిషన్ సైతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితితో ప్రభావితమైంది. ఆ సమయంలో ఆతిథ్యం ఇచ్చింది పాకిస్తాన్ కనుక, భారత్ ఆ దేశానికి వెళ్ళడానికి నిరాకరించింది. దీంతో భారత్ ఆడే మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడాలని నిర్ణయించారు. ఎలాగూ ఆ టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుకోలేదు.  కోలంబోలో జరిగిన ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ టైటిల్ గెలిచింది. ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే ఫార్ములా అనుసరించారు. ఇండియా తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. ఈసారి ఆతిథ్యం వహించిన పాకిస్తాన్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిదారి పట్టింది. భారత్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Padikkal Permanent Slot: సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
సాయి సుదర్శన్ వచ్చినా పడిక్కల్ కే నంబర్ 3 ప్లేస్.. అతనిలో అద్భుత నైపుణ్యముంది.. మాజీ క్రికెట‌ర్ ప్రశంసలు!
Devdutt Padikkal Historic Ton: కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్
కోహ్లీ సరసన నిలిచి, ఎలైట్ లిస్ట్‌లోకి పడిక్కల్.. మెయిడిన్ టెస్టు సెంచరీతో సత్తా చాటిన దేవదత్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
Embed widget