WTC Final 2023: టీమిండియా మరో సౌతాఫ్రికా - ‘నయా చోకర్స్’ బిరుదు రావాల్సిందేనా?
క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉన్నా ఇంతవరకూ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని జట్టు దక్షిణాఫ్రికా.
WTC Final 2023: ప్రపంచ క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా జట్టును అందరూ ‘చోకర్స్’అని అభివర్ణిస్తారు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ లీగ్ దశ మ్యాచ్‌లలో దుమ్మరేపే సఫారీలు.. తీరా కీలక మ్యాచ్‌లు వచ్చేసరికి చేతులెత్తేస్తారు. వర్షం అయితే వాళ్ల పాలిట శాపంగా వెంటాడుతోంది. 1992 వన్డే వరల్డ్ కప్ నుంచి గతేడాది టీ20 వరల్డ్ కప్ వరకూ వారికి వర్షంతో ప్రత్యేక అనుబంధముంది. జట్టులో ఆల్ రౌండర్లు, అగ్రశ్రేణి బ్యాటర్లు, బౌలర్లు ఉన్నా ఆ జట్టుకు ఐసీసీ ట్రోఫీ కలగానే మిగిలిపోయింది. అయితే వరల్డ్ క్రికెట్‌లో చోకర్స్ పేరు మారుతోందా..? ‘నయా చోకర్స్’గా టీమిండియా మారిందా..?
గత పదేండ్లలో భారత జట్టు ఆట తీరు చూస్తే ఇదే నిజమనిపించకమానదు. వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లలో రికార్డుల మీద రికార్డులు నెలగొల్పి సిరీస్‌లను నెగ్గుతున్న టీమిండియా.. అసలు సమరంలో మాత్రం తడబడుతున్నది. ఐసీసీ నాకౌట్ స్టేజ్‌లో ఒత్తిడికి తట్టుకోలేక విఫలమవుతున్నది. తాజాగా ఆసీస్ చేతిలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఓడిన నేపథ్యంలో నెటిజన్లు కూడా భారత జట్టును నయా చోకర్స్ అంటూ అభివర్ణిస్తున్నారు. గడిచిన పదేండ్లలో ఇండియా ఆట తీరే ఇందుకు నిదర్శనం. ఒకసారి రికార్డులను పరిశీలిస్తే..
2014 నుంచి ఐసీసీ ఈవెంట్స్‌లో టీమిండియా ప్రదర్శన..
- ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2014 : లంక చేతిలో ఓటమి
- ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2015 : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
- ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2016 : వెస్టిండీస్ చేతిలో పరాభవం
- ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్, 2017 : పాకిస్తాన్ చేతిలో ఓటమి
- ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2019 : న్యూజిలాండ్ చేతిలో పరాజయం
- ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2021 : న్యూజిలాండ్ చేతిలో ఓటమి
- ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2022 : ఇంగ్లాండ్ చేతిలో ఓటమి
- ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 : ఆసీస్ చేతిలో ఓటమి
Who is the Biggest Choker in Cricket?
— Kishan Kishor (@itskishankishor) June 11, 2023
Answer - INDIA 🇮🇳❤️
South Africa <<<<< India#WTCFinal2023 #WTCFinals #ViratKohli #RohitSharma #WTC2023Final #WTCFinal #INDvAUS #INDvsAUS pic.twitter.com/LYrlmpLhFl
ఐసీసీ ఈవెంట్లలో సౌతాఫ్రికా ప్రదర్శన..
- ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీస్, 1992 : ఇంగ్లాండ్ చేతిలో ఓటమి
- ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వార్టర్స్, 1996 : వెస్టిండీస్ చేతిలో ఓటమి
- ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీస్, 1999 : ఆసీస్ చేతిలో ఓటమి
- ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2003 : శ్రీలంక చేతిలో ఓటమి
- ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2007 : ఆస్ట్రేలియా చేతిలో ఓటమి
- ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2009 : పాకిస్తాన్ చేతిలో ఓటమి
- ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2011 : న్యూజిలాండ్ చేతిలో ఓటమి
- ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సెమీస్, 2015 : న్యూజిలాండ్ చేతిలో ఓటమి
Chokers 😒#WTCFinals #INDvsAUS pic.twitter.com/CC885DykjD
— Ankit (@revengeseeker77) June 11, 2023
Chokers 😮💨#WTCFinals pic.twitter.com/0bsQACVfZc
— Ujjwal (@Ujjwaljha21) June 11, 2023