News
News
X

Suresh Raina: రోహిత్, విరాట్ కాదు - ఈ ప్రపంచకప్‌లో భారత్ అత్యంత కీలక ఆటగాడు అతనే!

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు హార్దిక్ పాండ్యా అత్యంత కీలకం కానున్నాడని సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.

FOLLOW US: 

క్రికెట్ అభిమానులందరి కళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మీదనే ఉన్నాయి. ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతుండగా, ఆదివారం జరగనున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నుంచి అసలైన యాక్షన్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు టోర్నమెంట్‌లోని ఫేవరెట్‌ల్లో ఒకటి. అయినా ఈ ఈవెంట్‌కు ముందు గాయం సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇద్దరూ గాయపడ్డారు. దీంతో కీలకమైన వీరిద్దరూ లేకుండానే భారత్ టోర్నీ ఆడనుంది.

ఇతర ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉన్నప్పటికీ వీరు లేని లోటు స్పష్టంగా తెలియనుంది. ఈ నేపథ్యంలో 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు సురేష్ రైనా 'మెన్ ఇన్ బ్లూ' కోసం 'గేమ్‌ని కంట్రోల్ చేసే' ఆటగాడిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కానీ అది విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మనో కాదు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.

"సూర్యకుమార్ యాదవ్ గత రెండేళ్లలో చేసిన బ్యాటింగ్ అద్భుతం. అతను అదే ప్రదర్శన కనపరచాలని నేను కోరుకుంటున్నాను. టీమిండియాలో ఇంకో డార్క్ హార్స్ ఉంది. అతని యాంగిల్, స్వింగ్ అద్భుతమైనది. కానీ నాకు తెలిసి ఈ టోర్నీలో టీమిండియాకు అత్యంత కీలకమైన ఆటగాడు హార్దిక్ పాండ్యా. అతను ఆటను తన కంట్రోల్‌లోకి తీసుకోగలడు. కీలకమైన ఓవర్లు బౌల్ చేస్తాడు. మహేంద్ర సింగ్ ధోని తరహాలో మ్యాచ్‌లు ముగించగలడు. ఈ ఆటగాళ్లు ఎంతో కీలకమైన వారు. అయితే అదే సమయంలో అర్ష్‌దీప్‌ సింగ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలను కూడా మర్చిపోకూడదు.' అని రైనా అన్నాడు.

"భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ ఎంతో కీలకమైన మ్యాచ్. ముఖ్యంగా భారత్ మంచి ఆరంభం కావాలి. ఆ మ్యాచ్‌లో మనం బాగా విజయం సాధిస్తే, భారత్‌కు ఊపు రావడంతో పరిస్థితులు సజావుగా సాగుతాయి. టీ20ల్లో అది చాలా కీలకం". అని పేర్కొన్నాడు. అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది.

News Reels

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ

View this post on Instagram
 
A post shared by Team India (@indiancricketteam)

Published at : 17 Oct 2022 05:33 PM (IST) Tags: Virat Kohli Rohit Sharma Hardik Pandya Suresh Raina T20 Worldpcup 2022

సంబంధిత కథనాలు

Gujarat Election 2022: భార్య తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా భారత ఆల్ రౌండర్

Gujarat Election 2022: భార్య తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా భారత ఆల్ రౌండర్

భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే రేపే - కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ - ఎక్కడ చూడాలంటే?

భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే రేపే - కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ - ఎక్కడ చూడాలంటే?

Viral Video: హామిల్టన్ చేరుకున్న టీమిండియా - అర్ష్ దీప్ భాంగ్రా డ్యాన్స్ చూశారా!

Viral Video: హామిల్టన్ చేరుకున్న టీమిండియా - అర్ష్ దీప్ భాంగ్రా డ్యాన్స్ చూశారా!

PCB chief Ramiz Raja: భారత్ అలా చేస్తే, పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ ఆడదు: పీసీబీ చీఫ్ రమీజ్ రజా

PCB chief Ramiz Raja: భారత్ అలా చేస్తే, పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ ఆడదు: పీసీబీ చీఫ్ రమీజ్ రజా

IND vs NZ ODI: 'మానసికంగా బలంగా ఉండడం ముఖ్యం- రేపటి మ్యాచులో కచ్చితంగా గెలుస్తాం'

IND vs NZ ODI: 'మానసికంగా బలంగా ఉండడం ముఖ్యం- రేపటి మ్యాచులో కచ్చితంగా గెలుస్తాం'

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి