Sikandar Raza: పాకిస్తాన్‌పై జింబాబ్వే రికీ పాంటింగ్ కీలక పాత్ర - ఎలాగో తెలుసా?
జింబాబ్వే జట్టును నిజానికి గత రెండేళ్లుగా ఒంటిచేత్తో చాలా మ్యాచెస్ గెలిపించిన ఘనత... ఆల్ రౌండర్ సికిందర్ రజాదే. మరి పాక్ తో మ్యాచ్ పూర్తయ్యాక సికిందర్ రజా రికీ పాంటింగ్ కు థ్యాంక్స్ ఎందుకు చెప్పాడు..?
అవును... నిజమే. ఒకరకంగా చూసుకుంటే పాకిస్థాన్ పై జింబాబ్వే సాధించిన సెన్సేషనల్ విజయానికి కారణం... ఆస్ట్రేలియన్ దిగ్గజం రికీ పాంటింగే. మ్యాటర్ ఏంటంటే ఈ మ్యాచ్ లో కీలక సమయాల్లో 3 ముఖ్యమైన వికెట్లు తీసిన జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది కదా. మ్యాచ్ తర్వాత రజా మాట్లాడుతూ రికీ పాంటింగ్ కు థ్యాంక్స్ చెప్పాడు.
ఇక్కడ అసలు విషయమేంటంటే... వరల్డ్ కప్ సందర్భంగా ఐసీసీ లెజెండ్స్ తో కొన్ని స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేస్తోంది. అందులో సికిందర్ రజా గురించి పాంటింగ్ చెప్పిన వీడియో మ్యాచ్ కు కొన్ని గంటల ముందే రిలీజ్ అయింది. దాని గురించి మ్యాచ్ తర్వాత రజా ప్రస్తావించాడు. మ్యాచ్ కు ముందు తాను చాలా ఎగ్జైటెడ్ గా, నెర్వస్ గా ఉన్నట్టు చెప్పాడు.
మ్యాచ్ గెలవాలన్న కసి ఎప్పుడూ ఉంటుంది కానీ ఈరోజు ఒక్క పుష్ కావాలన్న ఫీలింగ్ మ్యాచ్ కు ముందు వచ్చినట్టు రజా చెప్పాడు. సో ఆ టైంలో ఐసీసీ వీడియో చూశానని, అది తనకు చాలా హెల్ప్ చేసిందన్నాడు. తన గురించి అన్ని మంచి విషయాలు చెప్పిన రికీ పాంటింగ్ కు ప్రత్యేకంగా రజా ధన్యవాదాలు తెలిపాడు.
సికిందర్ రజా కెరీర్ గురించి చెప్పాలంటే.... తనొక లేట్ బ్లూమర్ అనుకోవచ్చు. ఇప్పుడు తన వయసు 36 ఏళ్లు. కానీ గత రెండేళ్లుగా జింబాబ్వే జట్టును ఒంటిచేత్తో గెలిపించిన సందర్భాలు చాలా ఎక్కువ. తన కన్సిస్టెన్సీ గురించి చెప్పాలంటే ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకుంది... రజానే. మొత్తం 7 గెలుచుకున్నాడు.
అంతెందుకు ఈ వరల్డ్ కప్ సూపర్-12 కి ముందు జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచెస్ లో రెండు సార్లూ అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. ఇలాంటి విషయాలనే రికీ పాంటింగ్ పొగిడాడు. రజాకు చాలా మెచ్యూరిటీ ఉందని, ఎప్పుడు ఏది ఎలా చేయాలో తనకు తెలుసని, తెలియడమే కాక అది కచ్చితంగా చేసే తీరతాడని పాంటింగ్ ప్రశంసించాడు. ఇప్పుడు జింబాబ్వే టోర్నమెంట్ లో ఎంత ముందుకు వెళ్తుందో తెలియదు కానీ కచ్చితంగా ఈ గెలుపు, గత రెండేళ్ల సికిందర్ రజా ప్రస్థానం ఓ మేజర్ టర్నింగ్ పాయింట్.
View this post on Instagram