(Source: ECI/ABP News/ABP Majha)
T20 Worldcup 2022: పాకిస్తాన్‌కు కష్టమే - ఆ ఒక్క మ్యాచే కీలకం!
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 గ్రూప్-2 ఇప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా మారింది. దానికి కారణం పాకిస్థాన్ జట్టు. ఎందుకో చూడండి.
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 గ్రూప్స్ ఫిక్స్ అయ్యాక అందర్లోనూ జరిగిన డిస్కషన్ ఒక్కటే. గ్రూప్-1 చాలా స్ట్రాంగ్ గా ఉంది. చాలా టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు ఎక్కువ అని. అనుకున్నట్టుగానే ఆ గ్రూప్ లో మ్యాచెస్ అలానే సాగిపోతున్నాయి. ఏ జట్టునూ తక్కువ తీసుకోవడానికి లేదు.
కానీ పాకిస్థాన్ పుణ్యమా అంటూ ఇప్పుడు గ్రూప్-2 కూడా మాంచి ఎగ్జైటింగ్ గా తయారైంది. పాకిస్థాన్ పుణ్యమా అని ఎందుకు అన్నానంటారా? నిజమే. జింబాబ్వే చాలా బాగా ఆడింది. విజయానికి వాళ్లు అర్హులే. కానీ గెలవాల్సిన మ్యాచ్ కూడా చేజేతులా కోల్పోవడం ఏళ్ల తరబడి పాకిస్థాన్ కు వెన్నతో పెట్టిన విద్యే కదా. అసలే ఊహకందని జట్టు. జింబాబ్వే చేతిలో ఓడిపోయి ఆ ట్యాగ్ కు నూటికి నూరు శాతం న్యాయం చేశారు.
ఇక గ్రూప్-2 మ్యాటర్ కు వద్దాం. టోర్నమెంట్ ముందు అందరి అంచనా ఒక్కటే. జింబాబ్వే, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ ను లైట్ తీసుకోవచ్చు ఏవో ఒకట్రెండు మ్యాచెస్ గెలుస్తాయంతే అనుకున్నారు. ఇండియా, సౌతాఫ్రికా, పాకిస్థాన్ లో రెండు టీమ్స్ సెమీస్ కు వెళ్తాయని ఫిక్సయిపోయారు. కానీ జింబాబ్వే విజయం తర్వాత ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి.
దీంతో పాకిస్థాన్ పరిస్థితి వెంటిలేటర్ మీద పెట్టినట్టైంది. ఓపెనింగ్ రెండు మ్యాచెస్ ఓడిపోయింది. మిగతా మూడు మ్యాచెస్ లో కచ్చితంగా గెలిస్తే తప్ప సెమీస్ మీద ఆశలు పెట్టుకోలేని స్థితి. అందులో అతి కీలకమైనది సౌతాఫ్రికాతో పోరు. ఇప్పటికే 2 విజయాలు ప్రస్తుత ఫాం ప్రకారం చూసుకుంటే టీమిండియా సెమీస్ కు వెళ్లడం దాదాపుగా ఖాయమనే అనుకోవచ్చు. సౌతాఫ్రికాకు 3 పాయింట్లు ఉన్నాయి. పాకిస్థాన్ కు సున్నా.
పాక్ ముందు ఇప్పుడున్న టార్గెట్ క్లియర్. మిగిలి ఉన్న 3 మ్యాచెసూ గెలవాల్సిందే. ఒక్కటి ఓడినా దుకాణం సర్దేయొచ్చు దాదాపుగా. 3 మ్యాచెస్ గెలిచాక పాక్ చేయాల్సింది ప్రార్థించడం. జింబాబ్వే, సౌతాఫ్రికా ఈ రెండు జట్లూ తమ మిగిలిన మూడేసి మ్యాచుల్లో కనీసం రెండేసి చొప్పున ఓడిపోయి తీరాలి.
అలా కాకుండా జింబాబ్వే అయినా సౌతాఫ్రికా అయినా సరే 2 మ్యాచెస్ గెలిస్తే చాలు. వాళ్ల సెమీస్ అవకాశాలు పక్కన పెడితే పాకిస్థాన్ ను ఇంటికి మాత్రం కచ్చితంగా పంపేస్తారు. ఎందుకంటే అలా 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ల పాయింట్స్ ఏడు అవుతాయి కాబట్టి.
సో ముందు చెప్పుకున్నట్టు నవంబర్ 3న సౌతాఫ్రికా-పాకిస్థాన్ మ్యాచ్ ఫలితం వచ్చిన తర్వాత సూపర్ -12 నుంచి సెమీస్ కు వెళ్లేదెవరో దాదాపుగా క్లారిటీ వచ్చేస్తుంది. అలా కాకుండా పాక్ అంతదాకా ఆగకుండా అక్టోబర్ 30న నెదర్లాండ్స్ తో మ్యాచ్ ను కూడా సమర్పించేసుకుంది అనుకోండి. ఆ రోజే ఇక దాదాపుగా సెమీస్ మీద ఆశలు వదిలేసుకోవచ్చు.
ఎందుకంటే ఎన్ని రకాల సమీకరణాలు చూసుకున్నా సౌతాఫ్రికా లేదా జింబాబ్వే ఏదైనా ఓ జట్టు కనీసం 5 పాయింట్లకైనా కచ్చితంగా చేరుకోవచ్చేమో. పాక్ ఇంకొక్క మ్యాచ్ ఓడినా గరిష్ఠంగా సాధించగలిగేది నాలుగు పాయింట్లే. సో అదన్నమాట పాక్ సిట్యుయేషన్. గ్రూప్-2 లో సెమీస్ అవకాశాల ఈక్వేషన్స్.
Look away if your team is Pakistan #T20worldcup #PAKvsZIM pic.twitter.com/C8Y2gzlC5N
— Saj Sadiq (@SajSadiqCricket) October 27, 2022