అన్వేషించండి

T20 WC, Pak vs Zim: పాక్‌కు షాక్ - ఒక్క పరుగుతో జింబాబ్వే విజయం - సెమీస్‌కు కష్టమే!

టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే సంచలనం సృష్టించింది. పాకిస్తాన్‌పై ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

2022 టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. థ్రిల్లర్‌లా సాగిన సూపర్ 12 గ్రూప్-2 మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను జింబాబ్వే ఒక్క పరుగు తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితం అయింది. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. ఇక నుంచి ప్రతి మ్యాచ్ గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాలపై కూడా ఆధార పడాల్సి ఉంటుంది.

టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు మదెవెరె (17: 13 బంతుల్లో, మూడు ఫోర్లు), క్రెయిగ్ ఎర్విన్ (19: 19 బంతుల్లో, రెండు ఫోర్లు) మంచి ఆరంభాన్నే అందించినా పాకిస్తాన్ బౌలర్లు తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. మిగతా బ్యాటర్లలో షాన్ విలియమ్సన్ (31: 28 బంతుల్లో, మూడు ఫోర్లు) మినహా ఎవరూ వేగంగా ఆడలేకపోయారు. దీంతో జింబాబ్వే 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 130 పరుగులకే పరిమితం అయింది. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ వసీం జూనియర్ నాలుగు వికెట్లు తీయగా, షాదబ్ ఖాన్ మూడు వికెట్లు తీసుకున్నాడు. హరీస్ రౌఫ్‌కు ఒక వికెట్ దక్కింది.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ మొదటి నుంచే తడబడింది. జింబాబ్వే బౌలర్లు కచ్చితత్వంతో బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. మొత్తం జట్టులో ముగ్గురు మినహా మిగతా వారి స్ట్రైక్ రేట్ 100 కూడా దాటలేదంటే జింబాబ్వే బౌలింగ్ ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వన్ డౌన్ బ్యాటర్ షాన్ మసూద్ (44: 38 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాకిస్తాన్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, కేవలం తొమ్మిది పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఒక్క పరుగుతో ఓటమి పాలైంది. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రాజ్ అత్యధికంగా మూడు వికెట్లు తీసుకున్నాడు.

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
PM Modi Vizag Tour: దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
దేశానికే గేమ్‌ ఛేంజర్‌ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు- నేడు వైజాగ్‌లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
AR Rahman - Anirudh Ravichander: ఆ ఒక్క పని చేయండి... అనిరుధ్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సలహా
ఆ ఒక్క పని చేయండి... అనిరుధ్‌కు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సలహా
Justin Trudeau: అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో
అమెరికాలో కెనడా విలీనమా? అంత సీన్ లేదు, డొనాల్డ్ ట్రంప్‌నకు ఇచ్చి పడేసిన ట్రూడో
KTR Formula E Car Race: హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసింది, తీర్పులో న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
Daaku Maharaaj: బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
బాలయ్యకు 'జై లవ కుశ' ఇష్టం... ఎన్టీఆర్‌ ఇష్యూకు బాబీ - 'దబిడి దిబిడి' ట్రోల్స్‌కు నాగవంశీ ఫుల్ స్టాప్
Embed widget