T20 WC, Aus vs AFG: సిక్సర్లతో ఆసీస్‌ను కంగారెత్తించిన రషీద్! 4 రన్స్‌తో ఓడిన అఫ్గాన్
T20 WC, Aus vs AFG: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12లో ఆస్ట్రేలియా చివరి మ్యాచ్ ఆడేసింది. అడిలైడ్‌లో అఫ్గానిస్థాన్‌పై 4 పరుగుల తేడాతో విజయం అందుకుంది.
T20 WC, Aus vs AFG: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో సూపర్ 12లో ఆస్ట్రేలియా చివరి మ్యాచ్ ఆడేసింది. అడిలైడ్‌లో అఫ్గానిస్థాన్‌పై 4 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 7 పాయింట్లతో గ్రూప్ 1లో రెండో స్థానానికి దూసుకొచ్చింది. 169 టార్గెట్ ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 4 రన్స్ తేడాతో ఓడించింది. అఫ్గాన్‌లో రషీద్ ఖాన్ (48*; 23 బంతుల్లో 3x4, 4x6) టాప్ స్కోరర్. గుల్బదిన్ నయీబ్ (39) అతడికి అండగా నిలిచాడు. అంతకు ముందు కంగారూ జట్టులో గ్లెన్ మాక్స్‌వెల్ (54*; 32 బంతుల్లో 6x4, 2x6), మిచెల్ మార్ష్ (45; 30 బంతుల్లో 3x4, 2x6) రాణించాడు.
View this post on Instagram
మ్యాడ్ మాక్సీ!
సెమీస్ సమీకరణాల్లో ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచులో ఆసీస్ టాస్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్ కామెరాన్ గ్రీన్ (3) త్వరగానే పెవిలియన్ చేరాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన మార్ష్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ (25) దూకుడుగా ఆడారు. వీరిద్దరితో పాటు స్టీవ్ స్మిత్ (4) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరగడంతో కంగారూలు కష్టాల్లో పడ్డారు. ఈ సిచ్యువేషన్‌లో స్టాయినిస్ (25) అండతో మాక్స్‌వెల్ చెలరేగాడు. 29 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 168/8తో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు.
భయపెట్టిన రషీద్
టార్గెట్ ఛేదనకు దిగిన అఫ్గానిస్థాన్ దాదాపుగా కంగారూలను ఓడించినంత పనిచేసింది. జట్టు స్కోరు 15 వద్దే ఉస్మాన్ ఘనీ (2) ఔటైనా మరో ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (30), ఇబ్రహీం జర్దాన్ (26) విలువైన ఇన్నింగులు ఆడారు. 13 ఓవర్లకు జట్టు స్కోరును 99కు తీసుళ్లారు. ఇదే స్కోరు వద్ద 14వ ఓవర్లో ఆడమ్ జంపా ప్రత్యర్థికి వరుస షాకులిచ్చాడు. ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్‌ను వికెట్లు పడగొట్టాడు. నయీబ్ రనౌట్ అయ్యాడు. పీకల్లోతు కష్టాల్లో పడ్డ అఫ్గాన్‌ను దార్విష్ రసూలి (15) అండతో మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆదుకున్నాడు. 3 బౌండరీలు, 4 సిక్సర్లు బాది ఆసీస్‌ను భయపెట్టాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 22 పరుగులు అవసరం కాగా 17 మాత్రమే చేయడంతో 4 తేడాతో అఫ్గాన్ ఓటమి చవిచూసింది.
View this post on Instagram