![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
T20 World Cup 2022: కోహ్లీ ఆకలి మీద ఉన్నాడు - సెమీస్‌కు ముందు సపోర్ట్ ఇచ్చిన డివిలియర్స్!
ఇంగ్లండ్‌తో జరగనున్న రెండో సెమీస్‌లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఏబీ డివిలియర్స్ పూర్తి మద్దతు ఇచ్చాడు.
![T20 World Cup 2022: కోహ్లీ ఆకలి మీద ఉన్నాడు - సెమీస్‌కు ముందు సపోర్ట్ ఇచ్చిన డివిలియర్స్! T20 World Cup 2022: AB de Villiers backs Virat Kohli to put on a show against England T20 World Cup 2022: కోహ్లీ ఆకలి మీద ఉన్నాడు - సెమీస్‌కు ముందు సపోర్ట్ ఇచ్చిన డివిలియర్స్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/09/0e2d8e2686601ce3b3e6d0d96093290b1668016206840252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గురువారం అడిలైడ్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీకి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ మద్దతు ఇచ్చాడు. తన లీన్ ప్యాచ్‌ను అధిగమించినప్పటి నుంచి ఈ ఢిల్లీ బ్యాటర్ గొప్ప మానసిక స్థితిలో ఉన్నాడని ఏబీడీ చెప్పారు. భారత్‌కు మ్యాచ్‌లు గెలవాలని కోహ్లి ఆకలితో ఉన్నాడని, పెద్ద గేమ్స్ అతనిలోని అత్యుత్తమ ప్రదర్శనను తీసుకువస్తాయని ఏబీడీ పేర్కొన్నాడు.
అడిలైడ్‌లో ఆడడమంటే కోహ్లీకి చాలా ఇష్టం. అతను 2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 90 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ వేదికపై టీ20ల్లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు పూర్తి చేయాలని చూస్తున్నాడు.
అదే విధంగా కోహ్లీ అడిలైడ్ ఓవల్‌లో నాలుగు టెస్టుల్లో 509 పరుగులు, నాలుగు వన్డేల్లో 244 పరుగులు చేశాడు. గురువారం జరిగే టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లో అభిమానులు మరోసారి తన నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించవచ్చు.
డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. "నేను అతనితో ఇటీవల మాట్లాడాను. అతని ముఖంలో చిరునవ్వు ఉంది. తను సంతోషంగా ఉన్నానని, జీవితం బాగుందని, భారతదేశం కోసం మరిన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నానని చెప్పాడు." అని డివిలియర్స్ పేర్కొన్నాడు.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)