అన్వేషించండి
Advertisement
T20 WC 2024, Aus vs Oman: ఒమన్ "కంగారు" పెట్టినా, ఆస్ట్రేలియాదే గెలుపు
T20 WC 2024 Australia vs Oman Highlights: 2024 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఒమన్‌తో బార్బడోస్ లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఆసీస్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Marcus Stoinis’ super all-round show powers AUS to 39-run win: భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్(Odi World Cup)ను కైవసం చేసుకుని మంచి ఊపులో ఉన్న ఆస్ట్రేలియా(Australia) T20 ప్రపంచకప్ (T20 World Cup)లోనూ టైటిల్ వేట ప్రారంభించింది. పసికూన ఒమన్(Oman)తో జరిగిన మ్యాచ్‌లో కంగారులు ఘన విజయం సాధించి... టీ 20 ప్రపంచకప్‌లో శుభారంభం చేశారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఒమన్‌ను 125 పరుగులకే కట్టడి చేసిన ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో టీ 20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
రాణించిన స్టోయినీస్
బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్....ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానిచింది. పసికూన అయిన ఒమన్ బౌలర్లు ఆరంభంలో ఆస్ట్రేలియన్లను కట్టడి చేశారు. 19 పరుగులకే విధ్వంసకర ఆటగాడు ట్రానిస్ హెడ్‌ను అవుట్ చేసిన బిలాల్ ఖాన్... ఆస్టేలియాకు తొలి షాక్ ఇచ్చాడు. ట్రానిస్ హెడ్ అవుటైన మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) మాత్రం రాణించాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సుతో వార్నర్ 56 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ మిచెల్ మార్ష్ 14, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సున్నా పరుగులకే వెనుదిరగడంతో కంగారులు కష్టాల్లో పడ్డారు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా తక్కువ పరుగులకే పరిమితమయ్యాలా కనిపించింది. కానీ వార్నర్‌తో జత కలిసిన మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) కంగారు జట్టును ఆదుకున్నారు. 36 బంతుల్లో 2 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 67 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. స్టోయినిస్ 15వ ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్స్‌లు బాది 26 పరుగులు రాబట్టాడు. డేవిడ్ వార్నర్, మార్కస్ స్టోయినిస్ అర్ధ శతకాలతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఒమన్ బౌలర్లలో బిలాల్‌ఖాన్ 1, మెహర్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నారు.
బౌలింగ్‌లోనూ మెరిసిన స్టోయినిస్
165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్‌ను ఆస్ట్రేలియ బౌలర్లు కట్టడి చేశారు. ఈ మ్యాచ్‌లో ఒమన్ పోరాటం కూడా ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన ఒమన్... బ్యాటింగ్‌లో కాస్త రాణిస్తే అద్భుతానికి అవకాశం దక్కేది. కానీ కంగారు బౌలర్లు ఒమన్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. మొదటి మూడు ఓవర్లలోనే నాథన్ ఎల్లిస్ (2/28), మిచెల్ స్టార్క్ (2/20) బంతితో చెలరేగడంతో ఒమన్ వెనక్కి తగ్గింది. తొలి ఓవర్ మూడో బంతికే కళ్లు చెదిరే ఇన్ స్వింగర్‌తో అథవాలేను స్టార్క్ అవుట్ చేశాడు. ఏడు పరుగులు చేసిన కశ్యప్ ప్రజాపతిని ఎల్లిస్ అవుట్ చేశాడు. అనంతరం ఒమన్ కెప్టెన్ అకిబ్ ఇలియాస్ (18)ని స్టోయినిస్ అవుట్ చేశాడు. దీంతో ఒమన్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత స్టోయినిస్ మరో రెండు వికెట్లు కూడా తీశాడు. అయాన్ ఖాన్ 36 పరుగులు, మెహర్‌ఖాన్ 27 పరుగులు మాత్రమే రాణించారు. ఒమన్ బ్యాటర్లలో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితయ్యారు. దీంతో ఒమన్ కేవలం 125 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion