అన్వేషించండి

Syed Modi International 2023 badminton: టైటిల్‌ లేకుండానే ముగిసిన భారత్‌ పోరాటం , రన్నరప్‌ గా తనీష-అశ్విని జోడి

Syed Modi International 2023 badminton:

సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌లో భారత జోడీ తనీష క్రాస్టొ, అశ్విని పొన్నప్ప ద్వయం రన్నరప్‌తో సంతృప్తి చెందింది. ఫైనల్లో తనీష-అశ్విని జోడి 14-21, 21-17, 15-21తో జపాన్‌ జోడి రిన్‌ ఇవనగ-కీ నకనిషి చేతిలో ఓడిపోయింది. తొలి గేమ్‌ను కోల్పోయిన తనీష-అశ్విని రెండో గేమ్‌ను గెలుచుకుని పోటీలో నిలిచారు. అయితే జపాన్‌ జోడి నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఆరంభం నుంచి ఆధిక్యం ప్రదర్శించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను, టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.సెమీఫైనల్లో  నీష క్రాస్టొ, అశ్విని పొన్నప్ప ద్వయం తొలి గేమ్‌లో 10-11తో భారత జోడి వెనుకంజలో ఉన్న సమయం లో ప్రత్యర్థి జపాన్‌ జోడి యుకి ఫకుషిమ-సయాక హిరొట గాయంతో పోటీనుంచి విరమించుకున్నారు. దీనితో క్రాస్టొ-అశ్వినిలను విజయం వరించింది. 


  ఇటీవలే నాంటెస్‌ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత మహిళల జోడి అశ్విని పొన్నప్ప-తనీష కాస్ట్రొ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్లో 21-15, 21-14 స్కోరుతో చైనీస్‌ తైపీకి చెందిన హంగ్‌ ఎన్‌జు-లిన్‌ యు పీని ఓడించి చాంపియన్లుగా నిలిచారు. తొలి గేమ్‌లో 0-4తో వెనుకంజలో ఉన్న భారత జోడి తరువాత పుంజుకుని స్కోరును 10-10గా సమంచేసి, ఆపై జోరును పెంచి గేమ్‌ను గెలుచుకున్నారు. 


 మహిళల సింగిల్స్‌లో జపాన్‌కు చెదిన ఒకుహరా టైటిల్‌ దక్కించుకుంది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా 21–19, 21–16తో డెన్మార్క్‌కు చెందిన లినె హొమార్క్‌ (డెన్మార్క్‌)ను ఓడించి విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో తైపీకి చెందిన చి యు జెన్‌ విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో యు జెన్‌ చి  20–22, 21–12, 21–17తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోపై సంచలన విజయం సాధించి టైటిల్‌ దక్కించుకున్నాడు. ఇదే సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నీ మెన్స్‌‌ సింగిల్స్‌‌ సెమీస్‌‌లో భారత్‌కు చెందిన ప్రియాన్షు రజావత్‌‌ 21–18, 14–21, 17–21తో చైనీస్‌ తైపీకి చెందిన చి యు జెన్‌‌ చేతిలో పోరాడి ఓడాడు. ప్రియాన్షును ఓడించిన చి యున్‌ జెన్‌ విజేతగా నిలవడం గమానార్షం. 
గంటా 14 నిమిషాల మ్యాచ్‌‌లో ప్రియాన్షు తొలి గేమ్‌‌లో ఆకట్టుకున్నా.. చివరి రెండు గేమ్‌‌ల్లో వెనుకబడిపోయాడు. ప్రియాన్షు ఈ సీజన్‌లో ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300 గెలిచాడు.మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ప్రియాన్షు అద్భుత ఆటతీరుతో భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తున్నాడు. మరో ఒలింపిక్‌ పతకం సాధించే దిశగా పయనిస్తున్నాడు. 


 ఈ ఫలితాలతో సయ్యద్‌ మోడీ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఈసారి భారత జట్టు క్రీడాకారులకు ఒక్క టైటిల్‌ కూడా దక్కకుండా ముగిసింది. రన్నరప్‌గా నిలిచిన అశ్విని–తనీషాలకు రూ. 6 లక్షల 64 వేలు ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. పురుషుల విభాగంలోనూ భారత షట్లర్లకు నిరాశే ఎదురైంది. వెన్ను నొప్పి కారణంగా లక్ష్యసేన్ టోర్నీ నుంచి వైదొలిగాడు. త్వరలో ఆసియా క్రీడలు ఉన్నందుకు రిస్క్‌ చేయొద్దనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోచ్ అనుప్‌ శ్రీధర్‌ తెలిపాడు. పురుషుల డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్, విష్ణువర్ధన్ జోడీని కో సంగ్ హ్యున్-షిన్ బేక్ చియోల్ (కొరియా) ద్వయం 14-21 19-21 తేడాతో ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ 16-21, 21-16, 18-21 తేడాతో చెన్ టాంగ్ జీ-తో ఈ వీ (మలేషియా) చేతిలో ఓడిపోయింది. రోహన్‌కపూర్‌-సిక్కిరెడ్డి జోడీపై 19-21, 10-21 తేడాతో హీ యోంగ్ కై టెర్రీ, టాన్ వీ హాన్ జెస్సికా (సింగపూర్‌) విజయం సాధించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలుఅరటిపండు రాకెట్ కూలిపోయింది, ట్రంప్ ముందు పరువు పోయిందిగా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hydra Real Estate: చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
చట్టబద్దత వచ్చినా సైలెంట్‌ - పర్మిషన్లు ఉంటే భయమే లేదు - రియల్ మార్కెట్‌కు హైడ్రా భరోసా !
Gautam Adani Charged In New York: గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
గౌతమ్‌ అదానీకి అమెరికా షాక్ - 265 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని అభియోగం
Warangal Bank Robbery: గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
గూగుల్‌లో చూసి వరంగల్‌ బ్యాంకు దోపిడీ- ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?
PPP Model Chandrababu:  ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
ప్రాజెక్టులు,రోడ్లను వాడుకుంటే డబ్బులు కట్టాల్సిందే - ఏపీలో PPP మోడల్ - చంద్రబాబు రిస్క్ చేస్తున్నారా ?
Adilabad Tiger News Today: ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ యానిమల్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ
ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ యానిమల్ రొమాంటిక్ లవ్‌ స్టోరీ
Weather Update Today: ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
ఏపీకి వాన గండం- తెలంగాణపై చలి పిడుగు - జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు ఇవే
Daaku Maharaaj: బాలకృష్ణ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు... విలనా? ఇంపార్టెంట్ క్యారెక్టరా?
బాలకృష్ణ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు... విలనా? ఇంపార్టెంట్ క్యారెక్టరా?
Aditi Shankar: పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లంకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
పాలకొల్లులో 'గేమ్ ఛేంజర్' దర్శకుడి కూతురు... శ్రీనివాస్ బెల్లంకొండతో క్యూట్ లవ్ సాంగ్ కోసం!
Embed widget