Suryakumar Yadav Net Worth: సూర్యకుమార్ యాదవ్ ఆస్తి విలువ ఎంత- టీ20 కెప్టెన్ లగ్జరీ ఇల్లు, కార్ల కలెక్టన్ ఇలా
Asia Cup 2025 | టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. సూర్య ఆస్తుల నికర విలువ, ఐపీఎల్, బీసీసీఐ ప్యాకేజీల వివరాలిలా ఉన్నాయి.

సూర్యకుమార్ యాదవ్ సర్జరీ నుంచి కోలుకుని ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయ్యాడని, ఆసియా కప్‌లో ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని వార్తలు వస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఇటీవల స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. కోలుకున్న సూర్య ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ బ్రాండ్ విలువ, ఆదాయం గత కొన్నేళ్లలో పెరుగుతోంది. సూర్యకుమార్ మొత్తం ఆస్తి, ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ గత ఏడాది సూర్యకుమార్ యాదవ్‌ను 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే ఈ ఏడాది అతని IPL ఆదాయంతో పాటు బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది. IPL 2025కి ముందు ముంబై సూర్యను 16.35 కోట్లకు రిటైన్ చేసుకుంది. సూర్య గత కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టాడు. టీ20 కెప్టెన్2కు చెంబూర్‌లోని అనుశక్తి నగర్‌లో ఒక లగ్జరీ ఇల్లు ఉంది.
సూర్యకుమార్ యాదవ్ మొత్తం ఆస్తి విలువ
మీడియా నివేదికల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ మొత్తం ఆస్తి దాదాపు రూ.55 కోట్లు. ఇందులో IPL, బీసీసీఐ నుంచి వచ్చే జీతం, ప్యాకేజీలు, మ్యాచ్ ఫీజులు కూడా ఉన్నాయి. BCCI తాజా సెంట్రల్ కాంట్రాక్ట్‌లో సూర్య B కేటగిరీలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
సూర్య BCCI, IPL జీతం
సూర్యకుమార్ యాదవ్ 2011 నుంచి IPLలో ఆడుతున్నాడు. అతను మొదటి 3 సంవత్సరాలు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిత్యం వహించాడు. 2014 నుండి 2017 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఐపీఎల్ ఆడాడు. కాగా 2018లో సూర్య ముంబైకి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం అదే జట్టులో ఉన్నాడు. ప్రతి ఏడాది IPL నుంచి సూర్యకు జీతం ఎంత ఉందో చూడండి.
- 2011-2013: సంవత్సరానికి 10 లక్షల రూపాయలు (ముంబై)
- 2014-2017: సంవత్సరానికి 70 లక్షల రూపాయలు (కోల్‌కతా)
- 2018-2021: సంవత్సరానికి 3.20 కోట్ల రూపాయలు (ముంబై)
- 2022-2024: సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు (ముంబై)
- సూర్యకుమార్ IPL ధర 2025: 16.35 కోట్ల రూపాయలు (MI)
సూర్యకుమార్ IPLలో తన అద్భుత ప్రదర్శనతో 2021లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. టీ20 ఫార్మాట్‌లో టీమండియా కెప్టెన్‌గా ఉన్నాడు. అతను BCCI సెంట్రల్ కాంట్రాక్ట్‌లో B కేటగిరీలో చోటు దక్కించుకున్నాడు. ఈ కేటగిరీలో ఆటగాడికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు లభిస్తాయి. మ్యాచ్ ఫీజులు అదనంగా ఇస్తారు. ఒక టెస్ట్ మ్యాచ్ ఆడటానికి ప్రతి ఆటగాడికి 15 లక్షలు లభిస్తాయి. వన్డే, టీ20లకు మ్యాచ్ ఫీజులు వరుసగా 6 లక్షలు, 3 లక్షల రూపాయలు.
చెంబూర్‌లో లగ్జరీ ఇల్లు, అనేక లగ్జరీ కార్లు
సూర్యకుమార్ యాదవ్‌కు చెంబూర్‌లో 2 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. మ్యాన్స్‌వరల్డ్ నివేదిక ప్రకారం, వీటి ధర 21 కోట్ల రూపాయల మాటే. మీడియా నివేదికల ప్రకారం, సూర్యకుమార్ యాదవ్ దేశంలోని పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌లో ఇస్వెస్ట్ చేశాడు. సూర్యకుమార్ బ్రాండ్ విలువ గత కొంతకాలంగా వేగంగా పెరిగింది. నివేదికల ప్రకారం, సూర్య డ్రీమ్11, రాయల్ స్టాగ్, రీబాక్, మాక్సిమా వాచ్, సరీన్ స్పోర్ట్స్, వంటి బ్రాండ్‌ల నుండి మంచి ఆదాయం పొందుతున్నాడు.
మ్యాన్స్‌వరల్డ్ నివేదిక ప్రకారం, సూర్య ఒక్కో బ్రాండ్ డీల్‌కు 60 లక్షల నుంచి రూ.70 లక్షలు తీసుకుంటాడు. సూర్యకుమార్ వద్ద మంచి కార్ కలెక్షన్ ఉంది. సూర్య వద్ద BMW, Mercedes, Audi A6, Toyota Fortuner వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి.





















