Suryakumar Yadav: సూర్య ఆడితే అట్లుంటది మరి, కోహ్లీ రికార్డు సమం చేసిన మిస్టర్ 360
IND Vs AFG: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గాన్‌ను భారత్ చిత్తు చేసే క్రమంలో మిస్టర్ 360, సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు.

Suryakumar Yadav Equals Virat Kohli's Record: సూపర్ ఎయిట్(Super8)లో అఫ్గానిస్థాన్( AFG)తో జరిగిన మ్యాచ్‌లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అద్భుత అర్ధ శతకంతో భారత్‌కు భారీ స్కోరు అందించి... విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్ బ్యాటర్లందరూ పెవిలియన్‌కు చేరిన వేళ హార్దిక్(Hardic)తో కలిసి సూర్య జట్టుకు కీలక పరుగులను అందించాడు. కేవలం 28 బంతుల్లోనే 53 పరుగులు చేసి టీమిండియా(Team India) 180 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. టీ 20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో సూర్య స్థిరంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్న అభిమానులు... అఫ్గాన్‌పై అత్యంత ఒత్తిడిలో అర్ధ శతకం సాధించిన విషయాన్ని గుర్తు చేస్తూ సంబరపడిపోతున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కింగ్ కోహ్లీ(Virat Kohli) రికార్డును సూర్య భాయ్ సమం చేశాడు. కోహ్లీపై పేరు ఉన్న రికార్డును అతని కంటే సగం మ్యాచుల్లోనే సూర్య సమం చేశాడు. దీంతో మరోసారి సూర్యపై క్రికెట్ ప్రపంచం ప్రశంసల జల్లు కురిపిస్తోంది.
Before You Go
Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
ట్రెండింగ్ వార్తలు



















