అన్వేషించండి

Suryakumar Yadav Axed: వరల్డ్ కప్ గెలిపించినా కెప్టెన్సీ, జ‌ట్టు నుంచి తొలగింపు.. అప్పటివరకు ఉంటాననుకున్నా.. సూర్య

టీ20 వరల్డ్ కప్ 2026 గెలిపించినప్పటికీ తనను కెప్టెన్సీ నుంచి తప్పించి జట్టు నుంచి తొలగించడంపై సూర్యకుమార్ యాదవ్ తొలిసారి మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు.

Team India Former Captain Suryakumar Opens Up About Captaincy Removal: భారత టీ20 జట్టుకు 2026 వరల్డ్ కప్ ట్రోఫీని అందించిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అనూహ్యంగా జట్టుకే దూరం కావడంపై తొలిసారి మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టాడు. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు టీ20 కెప్టెన్‌గా నియమించడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల నుంచి సూర్యను పూర్తిగా తప్పించారు. ఈ నిర్ణయం తీసుకున్న కొన్ని నెలల తర్వాత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో సూర్యకుమార్ తన మనసులోని భావాలను పంచుకున్నాడు. జట్టు జాబితాలో తన పేరు లేకపోవడం చూసినప్పుడు తాను కేవలం నవ్వుకున్నానని చెప్పాడు. 

Read Also: Kaif Slams Tactics: దినుష వీక్‌నెస్ పసిగట్టడంలో టీమ్ ఇండియా ఘోరంగా విఫలం.. అంతమంది కోచ్ లు ఉండి ఏం లాభమని మాజీ క్రికెటర్ ఫైర్..!

ఒలింపిక్స్ వ‌ర‌కు..
రాబోయే ఒలింపిక్స్ తో పాటు తర్వాతి టీ20 వరల్డ్ కప్ వరకు తనే కెప్టెన్‌గా ఉంటానని అనుకున్నట్లు సూర్య వ్యాఖ్యానించాడు. "జట్టు ప్రకటనలో నా పేరు కనిపించనప్పుడు ఒక్కసారిగా నవ్వాను. కెరీర్‌లో ఒత్తిడి వచ్చినప్పుడల్లా నేను రిలాక్స్‌గా ఉంటూ నవ్వుతూనే ముందుకు సాగాను. 2026 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరో రెండేళ్ల పాటు జట్టును ముందుకు తీసుకెళ్లగలనని, ఒలింపిక్స్ లో సారథ్యం వహిస్తానని భావించాను. అయితే సెలెక్టర్ల ఆలోచనలు వేరేలా ఉన్నాయి. భవిష్యత్తు కోసం వేరొకరు కెప్టెన్‌గా ఉంటే మంచిదని వారు భావిస్తే ఆ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. మరొకరి నాయకత్వంలో జట్టు బాగా ఆడితే నాకు ఎలాంటి సమస్యా లేదు" అని సూర్యకుమార్ తెలిపాడు.

Read Also: Trans Cricketer Anaya Bangar Debate: విమెన్స్ బిగ్ బాష్ లీగ్ లోకి అనయ బంగర్ ఎంట్రీ.. మారిజానే కాప్ విమర్శలకు కౌంటర్ తో స‌మాధానం..

ఒక్క సిరీస్ ఓడిపోక పోయినా..
తన తర్వాత కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, అతడు గొప్ప లీడర్ అని సూర్య కొనియాడాడు. అయితే సెలెక్టర్ల నిర్ణయం తనను తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపాడు. "రెండేళ్ల కాలంలో మేం ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా ఓడిపోలేదు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టైటిళ్లు గెలిచాం. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఇలాంటి ఆకస్మిక మార్పు ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. గెలవగానే ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న నా మనసులో మెదిలింది. దాదాపు నెలన్నర పాటు ఇంట్లోనే కూర్చుండిపోయాను. బంధువులు, స్నేహితులు వచ్చి ఓదార్చినా వారు వెళ్లిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బాధ తెలిసేది" అని పేర్కొన్నాడు.

ఎప్పుడైనా సిద్ధం..
జట్టు ఎంపిక ప్రకటనకు రెండు మూడు రోజుల ముందే సెలెక్టర్లు తనకు ఫోన్ చేసి 'ఇక వేరే మార్గంలో ముందుకెళ్లే సమయం వచ్చింది' అని చెప్పినట్లు సూర్యకుమార్ తెలిపాడు. "వారు అలా చెప్పినప్పుడు నేను ఏమాత్రం కోపగించుకోలేదు. జట్టు మంచి కోసం వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని హుందాగా స్వీకరించాను. దేశం కోసం ఆడటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. మీరు ఎప్పుడు పిలిచినా బరిలోకి దిగేందుకు నా బ్యాట్ సిద్ధంగా ఉంటుంది" అని సూర్యకుమార్ తెలిపాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Asian Games IND VS AFG QF Washout.?: వర్షం రూపంలో పొంచి ఉన్న ముప్పు.. భారత్, అఫ్గాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సాగేనా..? రద్దయితే సెమీస్ చేరేది ఎవ‌రంటే..?
వర్షం రూపంలో పొంచి ఉన్న ముప్పు.. భారత్, అఫ్గాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సాగేనా..? రద్దయితే సెమీస్ చేరేది ఎవ‌రంటే..?
Virat Kohli , Shubman Gill Historic Century Chase: కొండంత లక్ష్యాన్ని ఊదిపారేసిన భారత్.. విండీస్‌పై విరాట్, గిల్ శతకాల విధ్వంసం, సచిన్ తర్వాత 15 వేల పరుగులతో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
కొండంత లక్ష్యాన్ని ఊదిపారేసిన భారత్.. విండీస్‌పై విరాట్, గిల్ శతకాల విధ్వంసం, సచిన్ తర్వాత 15 వేల పరుగులతో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
IND VS WI 1st Odi Updates: రోహిత్, కోహ్లీల భవితవ్యంపై బిగ్ టెస్ట్.. విండీస్ సిరీస్‌తో వరల్డ్ కప్ వేట మొదలు, యశస్వి జైస్వాల్ రీఎంట్రీతో ఓపెనింగ్ కాంబినేషన్ పై అంద‌రి ఫోక‌స్..
రోహిత్, కోహ్లీల భవితవ్యంపై బిగ్ టెస్ట్.. విండీస్ సిరీస్‌తో వరల్డ్ కప్ వేట మొదలు, యశస్వి జైస్వాల్ రీఎంట్రీతో ఓపెనింగ్ కాంబినేషన్ పై అంద‌రి ఫోక‌స్..
CSK Big Responsibility: ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్
ఫ్లెమింగ్ స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సవాల్.. సీఎస్కే బాధ్యతలపై తొలిసారి నోరు విప్పిన జహీర్ ఖాన్
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bank Employees Strike: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా, నేటి నుంచి సేవలు యథాతథం
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 28 September 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
World Tourism Day Arrangements: ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం.. ఇన్‌ఫ్లూయెన్సర్లతో మంత్రి దుర్గేష్ బంతి భోజనాలు
ఏపీ పర్యాటకానికి సోషల్ మీడియా బూస్ట్.. పర్యాటక ప్రాంతాలకు గ్లోబల్ ప్రచారం
Storing Beer in the Fridge : బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
బీరును ఫ్రిడ్జ్​లో పెడుతున్నారా? అయితే ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోండి
Embed widget