అన్వేషించండి
Advertisement
Sunil Gavaskar: ఒక్క కాలితో ఆడినా పంత్‌ను తీసుకోవచ్చు- సునీల్ గవాస్కర్
Sunil Gavaskar : టీమిండియా ఫినిషర్ రిషబ్ పంత్ ఒక కాలితో ఆడేంత ఫిట్‌గా ఉన్నా అతడిని జట్టులోకి తీసుకోవచ్చని గావస్కర్ అన్నాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా పంత్ సొంతమని కితాబిచ్చాడు.
క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2024 (T 20 World Cup 2024)షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికాతో కెనడా తలపడబోతోంది. జూన్ 1న ప్రారంభంకానున్న టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూపుల్లో పోటీ పడతాయి. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ మెగా టోర్నీలో గ్రూప్ ఏ లో భారత్, పాకిస్థాన్ జట్లు ఉన్నాయి. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే దాయాదుల సమరం న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరగనుంది. టీమిండియా గ్రూప్ దశలో జూన్ అయిదున ఐర్లాండ్‌తో 12న అమెరికాతో 15న కెనడాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక్క కాలితో ఆడినా తీసుకోవచ్చు
టీమిండియా ఫినిషర్ రిషబ్ పంత్( Rishabh Pant) ఒక కాలితో ఆడేంత ఫిట్‌గా ఉన్నా అతడిని జట్టులోకి తీసుకోవచ్చని గావస్కర్(Sunil Gavaskar) అన్నాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా పంత్ సొంతమని కితాబిచ్చాడు. పంత్ ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలని అన్నాడు. ఫార్మాట్ ఏదైనా పంత్ గేమ్ ఛేంజర్ అని, అందుకే అతను ఒక్క కాలితో ఫిట్‌గా ఉన్నా జట్టులోకి రావాలని కోరుకుంటున్నానని తెలిపాడు. తాను సెలెక్టర్‌ను అయితే ఈ పనిని తప్పక చేస్తానని గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేఎల్ రాహుల్‌ను ఉద్దేశిస్తూ కూడా కామెంట్స్ చేశాడు. ఒకవేళ పంత్ అందుబాటులో లేకుంటే రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం మంచిదన్నాడు. రాహుల్ వల్ల జట్టులో సమతుల్యం కూడా వస్తుందని... రాహుల్‌ను ఓపెనర్‌గా లేదా మిడిలార్డర్‌లో 5, 6 స్థానాల్లో ఫినిషర్‌గా ఉపయోగించుకోవచ్చని గావస్కర్ తెలిపాడు.
వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా,.....
భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను విజయంవంతంగా నిర్వహించిన ఐసీసీ... 2024లో టీ 20 ప్రపంచకప్ నిర్వహణకు సిద్ధమైంది. వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జట్లు పోటీ పడగా ఈ సారి మాత్రం 20 జట్లు తలపడనున్నాయి. ఐసీసీ 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. 2022 టీ20 ప్రపంచకప్‌లో టాప్-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లలతో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ లతో కలిపి మొత్తం 10 జట్లు నేరుగా అర్హత పొందాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, పది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియన్ల వారీగా క్వాలిఫయింగ్ పోటీలను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు.
వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, యూఎస్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్, కెనడా, నేపాల్, ఒమన్, పపువా న్యూ గినియా, ఐర్లాండ్, స్కాంట్లాండ్, ఉగాండ, నబీబియా పాల్గొననున్నాయి. వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమిని.. టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని మరిపించాలని టీమిండియా కోరుకుంటోంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
విశాఖపట్నం
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement