అన్వేషించండి

Shami Selection Debate: ష‌మీని సెలెక్టర్లు విస్మ‌రించింది నిజం కాదా...? అత‌ని రీఎంట్రీపై సౌరవ్ గంగూలీ క్లారిటీ..!

దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న మహమ్మద్ షమీని ఎవరూ విస్మరించలేదని, అతడు ఇప్పటికే ఇండియాకు ఎన్నో మ్యాచ్‌లు ఆడాడని సౌరవ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.

Sourav Ganguly Shares Views On Shami Selection Debate:  భారత సీనియర్ స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమీ సెలెక్షన్ వ్యవహారంపై టీమ్ ఇండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ భిన్నమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. రంజీ ట్రోఫీతో సహా డొమెస్టిక్ క్రికెట్‌లో వరుసగా వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నప్పటికీ, సెలెక్షన్ కమిటీ షమీని కావాలనే పక్కన పెడుతోందన్న విమర్శలను గంగూలీ తోసిపుచ్చాడు. గత ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన ఈ వెటరన్ పేసర్‌ను ఎవరూ నిర్లక్ష్యం చేయడం లేదని పేర్కొన్నాడు. విలేకరులతో మాట్లాడిన గంగూలీ, "షమీ దేశవాళీ టోర్నీల్లో నిరంతరం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గతంలొ పది వేల పరుగులు చేసిన తర్వాత కూడా నేను ఒక ఏడాది పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాను, ఆ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చి సత్తా చాటాను. అతడు బాగా బౌలింగ్ చేస్తున్నాడు కానీ అతడిని ఎందుకు ఎంపిక చేయడం లేదో నాకు తెలియదు. అయితే అతడిని నిర్లక్ష్యం చేస్తున్నారనడం సరైంది కాదు, అతడు ఇప్పటికే ఇండియా తరఫున ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు" అని తెలిపాడు.

Read Also: Siraj Pace Drop: శ్రీలంకలో వేగం తగ్గడానికి అసలు కారణం బయటపెట్టిన సిరాజ్.. ఆ మార్పులతో తిరిగి గాడిలోకి..!!

అగార్కర్‌తో వివాదం.. బుమ్రా లేకపోయినా దక్కని చోటు

గతేడాది వెస్టిండీస్ పర్యటనకు టెస్ట్ జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, షమీ మధ్య బహిరంగ వాగ్వాదం చోటుచేసుకుంది. షమీ ఫిట్‌నెస్‌పై అనుమానాలు ఉన్నాయని అగార్కర్ ప్రకటించగా, ఒకవేళ ఫిట్‌నెస్ సమస్యలే ఉంటే రంజీ ట్రోఫీ ఎలా ఆడతానంటూ షమీ ఎదురుదాడికి దిగాడు. ఇటీవల స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమైనప్పుడు కూడా సెలెక్టర్లు ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ వంటి యువ బౌలర్లకే ప్రాధాన్యత ఇచ్చి షమీని పక్కన పెట్టారు. 2027 లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లో జరిగే 50 ఓవర్ల ప్రపంచకప్ రేసులో షమీ ఉంటాడా అనే ప్రశ్నకు గంగూలీ స్పందిస్తూ, "వరల్డ్ కప్‌కు ఇంకా ఏడాది సమయం ఉంది కాబట్టి అతడు ఆ టోర్నీ ఆడతాడా లేదా అనే విషయంపై ఇప్పుడే వ్యాఖ్యానించడం చాలా కష్టం" అని బదులిచ్చాడు.

Read Also: India Opener Dilemma: మ్యూజికల్ చైర్స్‌లా మారిన ఓపెనర్ల ఎంపిక‌..  వైభవ్ కి బ‌దులుగా సంజూ శాంసన్‌కు వైపే మొగ్గిన మాజీ క్రికెట‌ర్

దులీప్ ఫైనల్లో షమీ కీలక స్పెల్.. ఈస్ట్ జోన్ చాంపియన్

ఇటీవల చెన్నై వేదికగా ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో షమీ తన మార్క్ బౌలింగ్‌తో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో షేక్ రషీద్, స్మరణ్ రవిచంద్రన్ వంటి కీలక వికెట్లను పడగొట్టాడు. ఇషాన్ కిషన్ నాయకత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఏకంగా 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీని కైవసం చేసుకోవడం గమనార్హం. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో షమీ మొత్తం ఏడు వికెట్లు నేలకూల్చాడు. సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులకే మూడు వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.

డొమెస్టిక్ వేదికపై నిరంతర శ్రమ.. జాతీయ పిలుపు కోసం నిరీక్షణ

దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ స్పెల్స్ వేస్తూ తన పదునైన లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్న షమీ, రాబోయే అంతర్జాతీయ సీజన్‌లో సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకోవాలని పట్టుదలతో శ్రమిస్తున్నాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Sixes Record: 400 సిక్సర్లతో టీమిండియా వరల్డ్ రికార్డు .. గ్లెన్ ఫిలిప్స్ ఖాతాలోనూ అరుదైన ఘ‌న‌త‌ 
400 సిక్సర్లతో టీమిండియా వరల్డ్ రికార్డు .. గ్లెన్ ఫిలిప్స్ ఖాతాలోనూ అరుదైన ఘ‌న‌త‌ 
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Auqib Nabi Selection: తొలి మూడు వన్డేల స్క్వాడ్‌లోకి జమ్మూ స్పీడ్‌స్టర్ ఎంట్రీ.. యువ ప్లేయ‌ర్లకు మొండిచేయిపై యువరాజ్ ఘాటు వ్యాఖ్యలు
తొలి 3 వన్డేల స్క్వాడ్‌లోకి జమ్మూ స్పీడ్‌స్టర్ ఎంట్రీ.. వారిపై మొండిచేయిపై యువీ ఘాటు వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget