అన్వేషించండి

Siraj Pace Drop: శ్రీలంకలో వేగం తగ్గడానికి అసలు కారణం బయటపెట్టిన సిరాజ్.. ఆ మార్పులతో తిరిగి గాడిలోకి..!!

రెండు నెలల విరామం వల్లే వేగం తగ్గిందని, దులీప్ ట్రోఫీలో సుదీర్ఘ స్పెల్స్ వేసి మళ్లీ పూర్తి రిథమ్ సాధించానని మహమ్మద్ సిరాజ్ తెలిపాడు.

Pacer Regains Rhythm Ahead Of New Season:  శ్రీలంక టూర్ సందర్భంగా తన బౌలింగ్ వేగం, రిథమ్ పడిపోవడంపై భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ పెదవి విప్పాడు. రెండు నెలల పాటు ఆటకు పూర్తిగా దూరంగా ఉండటం వల్లే క్రీజులో ఇబ్బంది పడ్డానని, అయితే దులీప్ ట్రోఫీ ఫైనల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయడం ద్వారా తిరిగి పాత లయను అందుకున్నానని తెలిపాడు. శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ సాధారణంగా వేసే 140 కిలోమీటర్ల వేగానికి బదులు కేవలం 120ల వేగంతోనే బంతులు విసిరాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 44 ఓవర్లు వేసినప్పటికీ బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయాడు. దీనిపై దులీప్ ట్రోఫీ ఫైనల్ అనంతరం సిరాజ్ మాట్లాడుతూ, "రెండు నెలల సుదీర్ఘ బ్రేక్ తర్వాత నేరుగా మ్యాచ్‌లోకి అడుగుపెట్టడంతో నా రిథమ్ దెబ్బతింది. నేను పూర్తిగా రిథమ్‌పై ఆధారపడే బౌలర్‌ని. శరీర కదలికలు సమన్వయంలో లేకపోతే క్రీజులో వేగం చూపించలేను. నా రన్‌అప్‌లో కొన్ని అడుగులు చిన్నవిగా, మరికొన్ని పెద్దవిగా పడటంతో ఫ్లో మిస్సయి పేస్ తగ్గింది" అని వివరించాడు.

Read Also: Gavaskar Slams BCCI: ప్రీమియర్ టోర్నీకి ఇచ్చే విలువిదేనా..? రంజీ ట్రోఫీ షెడ్యూల్ మార్పులపై  గవాస్కర్ ఫైర్

చెన్నై ఎండల్లో 41 ఓవర్లు.. తిరిగి ట్రాక్‌లోకి రన్‌అప్
జూన్ 8న అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ ముగిసిన తర్వాత రెండు నెలల విశ్రాంతి తీసుకుని ఆగస్టు 7న శ్రీలంక పర్యటనకు సిరాజ్ వెళ్లాడు. అయితే చేపాక్‌లో ఈస్ట్ జోన్‌తో జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ తరఫున 41 ఓవర్ల పాటు బౌలింగ్ చేయడం ద్వారా రాబోయే కఠినమైన సీజన్‌కు తన శరీరం పూర్తిగా సిద్ధమైందని సిరాజ్ భావిస్తున్నాడు. "ఇక్కడ అంతా దారికొచ్చింది, దాంతో సహజంగానే పేస్ పెరిగింది. కొలంబో టెస్ట్ తర్వాత కేవలం వారం రోజుల్లోనే చెన్నైకి వచ్చి భానుడి ప్రతాపంలో బౌలింగ్ చేయడం చాలా కష్టమనిపించింది. కానీ దేశానికి ఆడుతున్నప్పుడు ఎలాంటి సాకులు చెప్పకూడదు. మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్లు రాకపోయినా, పడిన కష్టం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో తప్పక ఫలితాన్ని ఇస్తుంది. నా పదేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ రెండు నెలల బ్రేక్ తీసుకోలేదు. నా శరీరం ఎక్కువ ఓవర్లు వేస్తేనే మెరుగ్గా స్పందిస్తుంది" అని అన్నాడు.

Read Also: Delhi T20 Match: ఆఫ్గాన్ తో తొలి టీ20కి వాయిదా ముప్పు..! పోలీస్ రిక్వెస్ట్ తర్వాత ఈ మ్యాచ్ పై కీలక ప్రకటన

తోడుగా నిలిచిన మహమ్మద్ షమీ.. అమూల్యమైన సూచనలు
ఈ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రత్యర్థి ఈస్ట్ జోన్ తరఫున ఆడిన తన పాత భాగస్వామి మహమ్మద్ షమీతో సిరాజ్ కాసేపు మాట్లాడాడు. ఈ సంభాషణ గురించి షమీ స్పందిస్తూ, "మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ తన సహజమైన రిథమ్ కోసం ఇబ్బంది పడ్డాడు. మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే నీ సహజమైన బలాలపై మాత్రమే దృష్టి పెట్టాలని అతడికి గుర్తుచేశాను. రన్‌అప్, రిథమ్ సరిగ్గా కుదిరితే లైన్ అండ్ లెంగ్త్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి" అని తెలిపాడు. సీనియర్ బౌలర్ ఇచ్చిన సలహాలు సిరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బౌలింగ్ చేయడానికి తోడ్పడ్డాయి.

న్యూజిలాండ్ సిరీస్‌పై గురి.. టీమ్ ఇండియాకు భారీ ఊరట
పూర్తి ఫిట్‌నెస్‌తో పాటు రన్‌అప్ గాడిన పడటంతో రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌లో సిరాజ్ మునుపటి వాడివేడి బంతులతో చెలరేగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ సిరాజ్.. ఎక్కువగా అంత‌ర్జాతీయ టెస్టులు మాత్ర‌మే ఆడుతున్నాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
Jasprit Bumrah Threat: వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
వెల్లింగ్టన్ పచ్చిక పిచ్‌పై బుమ్రా నిప్పులు చెరిగితే కివీస్ బ్యాటర్లకు చుక్కలే.. న్యూజిలాండ్ కు మాజీ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Embed widget