అన్వేషించండి
Shweta Sehrawat: శ్వేత! పరుగుల మోత,150 బంతుల్లో 242 రన్స్
Senior Womens One Day Trophy: బీసీసీఐ నిర్వహిస్తున్న సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో యంగ్ ప్లేయర్ శ్వేతా సెహ్రావత్ విధ్వంసం సృష్టించింది.
బీసీసీఐ నిర్వహిస్తున్న సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్ లో యంగ్ ప్లేయర్ శ్వేతా సెహ్రావత్ విధ్వంసం సృష్టించింది. అది అలా ఇలా కాదు. తన విశ్వరూపంతో స్కోరు బోర్డును బుల్లెట్ వేగంతో ముందుకు తీసుకెళ్లింది. దొరికిన బంతిని దొరికినట్లు.. దొరకని బంతిని కూడా దొరికించుకుని మరీ వీర బాదుడు బాదేసింది. శ్వేతా బాదుడుతో పలు రికార్డులు తుడిచి పెట్టుకుపోయాయి.
శ్వేతా సునామీ
బీసీసీఐ నిర్వహించిన సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో ఢిల్లీ యువ ప్లేయర్ శ్వేతా సెహ్రావత్ విశ్వరూపం చూపించింది. 31 ఫోర్లు, 7 సిక్సులతో ఊచకోత కోసిన శ్వేతా సెహ్రావత్ డబుల్ సెంచరీతో పెను విధ్వంసం సృష్టించింది. నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువ సంచలనం ఆకాశమే హద్దుగా చెలరేగింది. శ్వేతా ఆది నుంచి ధనాధన్ ఇన్నింగ్స్ విధ్వంసం సృష్టించింది. కేవలం 150 బంతుల్లోనే 242 పరుగులు చేసింది. తన సంచలన డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 31 ఫోర్లు, 7 సిక్సర్లు బాదింది.
నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 ఏళ్ల ఈ యువ సంచలనం ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఫోర్లు, సిక్సులతో గ్రౌండ్ నలువైపులా భారీ షాట్లు ఆడేసింది. శ్వేతా సెహ్రావత్ విధ్వంసానికి తోడు ప్రతీక సెంచరీతో చెలరేగింది. 89 బంతుల్లో 101 పరుగులు బాదింది.
150 బంతుల్లో 242 పరుగులు చేసిన తర్వాత శ్వేత 50వ ఓవర్‌లో ఔటైంది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఢిల్లీ జట్టు 4 వికెట్ల నష్టానికి 455 పరుగుల కొండంత స్కోర్ సాధించింది. శ్వేత గతేడాది భారత మహిళల అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించింది. అండర్-19 ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా కూడా నిలిచింది. ఇక తాజా ఇన్నింగ్స్లో ప్రతీకా రావల్‌తో కలిసి 233 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మహిళల అండర్ 19 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో శ్వేతా సెహ్రావత్ కీలక పాత్ర పోషించింది. రానున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఈ యువ సంచలనం యూపీ వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. కాగా వేలంలో శ్వేతా సెహ్రావత్‌ను యూపీ రూ.40 లక్షలకు కొనుగోలు చేసింది.
ఫలితం ఇలా
దేశీయ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో భాగంగా ఢిల్లీ-నాగాలాంగ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఢిల్లీ ప్లేయర్ శ్వేతా సెహ్రావత్ 242 పరుగుల ఇన్నింగ్స్ సంచలనం సృష్టించింది. 150 బంతుల్లో 31 ఫోర్లు, 7 సిక్సర్లు డబుల్ సెంచరీ కొట్టడంతో ఢిల్లీ 50 ఓవర్లలో 455 పరుగులు చేసింది. 456 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నాగాలాండ్ 25 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాగాలాండ్ మహిళల జట్టు 24.4 ఓవర్లలో 55 పరుగులకు ఆలౌటైంది. నాగాలాండ్ టీమ్ 8 మంది ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో పరుణికా సిసోడియా, హరేంద్ర మధు, ప్రియా మిశ్రా తలో 3 వికెట్లు తీశారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఎంటర్టైన్మెంట్
క్రికెట్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion