India vs England : గిల్ vs ఆర్చర్ పోరు.. లార్డ్స్ రికార్డు బద్దలు కొడతాడా? 35 ఏళ్ల చరిత్రకు తెర పడుతుందా?
India vs England : భారత్ ఇంగ్లాండ్ 3వ టెస్ట్: గిల్ గత రెండు టెస్టుల్లో అద్భుతంగా ఆడాడు. ఈ సిరీస్ లో 2 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ సాధించాడు.

India vs England : కాసేపట్లో భారత్ ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్ లార్డ్స్‌లో ప్రారంభంకానుంది. ఇప్పటికీ సిరీస్‌లో ఒక్కో విజయంతో సమానంగా ఉన్న జట్లు కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్‌గా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు, ఆ తర్వాత రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ (269) సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీ (161) సాధించి చరిత్ర సృష్టించాడు. కానీ ఇప్పుడు 1595 రోజుల తర్వాత జోఫ్రా ఆర్చర్ టెస్ట్ ఆడబోతున్నాడు. ఇది గిల్‌కు పెద్ద సమస్యగా మారవచ్చు. గిల్ ఇలాంటి పరిస్థితుల్లో 35 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ రికార్డును ఆపగలడా?
శుభ్‌మన్ గిల్ 2 టెస్టుల్లో ఇప్పటివరకు 585 పరుగులు చేశాడు. రెండో టెస్టులో 430 పరుగులు చేశాడు. భారతీయ ఆటగాడి టెస్టులో అత్యధిక స్కోరు ఇది. కానీ మూడో టెస్టులో జోఫ్రా ఆర్చర్ వచ్చాడు. అతను చరిత్ర చూస్తే చాలా ప్రమాదకరంగా ఉంది.
టెస్టులో శుభ్‌మన్ గిల్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్
ఫిబ్రవరి, 2021లో తన చివరి టెస్ట్ ఆడాడు ఆర్చర్. అతను 4 సంవత్సరాల తర్వాత టెస్ట్ ఆడబోతున్నాడు. ఆర్చర్ తిరిగి రావడంతో గిల్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆర్చర్ చివరి టెస్ట్ భారత్‌తో అహ్మదాబాద్‌లో ఆడాడు. గిల్‌ను అతనే అవుట్ చేశాడు.
గిల్, ఆర్చర్ టెస్టుల్లో ముఖాముఖిగా తలపడితే 2 సార్లు అతన్ని ఆర్చర్ అవుట్ చేయగలిగాడు. గిల్ అతని బౌలింగ్‌లో కేవలం 18 పరుగులే చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో లార్డ్స్‌లో 35 ఏళ్లుగా కొనసాగుతున్న రికార్డును గిల్ ఎలా బ్రేక్ చేస్తాడు? ఇది పెద్ద ప్రశ్న.
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో గత 35 ఏళ్లుగా ఇది జరగలేదు
లార్డ్స్ మైదానంలో గత 35 ఏళ్లుగా ఏ భారత కెప్టెన్ కూడా 50 కంటే ఎక్కువ పరుగులు చేయలేదు. శుభ్‌మన్ గిల్ గత 2 టెస్టుల్లో అనేక రికార్డులు సృష్టించాడు, కాబట్టి అతను లార్డ్స్‌లో చెరిగిపోని రికార్డును బ్రేక్ చేస్తాడని, పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని భావిస్తున్నారు క్రికెట్ అభిమానులు. కానీ 1595 రోజుల తర్వాత ఆర్చర్ రూపంలో అతని ముందు పెద్ద సవాల్ వచ్చి నిలబడింది, దీనికి సమాధానం ఇప్పటివరకు అతని దగ్గర లేదు.
ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో శుభ్‌మన్ గిల్ రికార్డు
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో శుభ్‌మన్ గిల్ తొలిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. అయితే ఇంగ్లాండ్‌తో ఇది అతని 13వ టెస్ట్, ఇంగ్లాండ్‌లో ఆరో టెస్ట్ అవుతుంది. ఇంతకుముందు ఇంగ్లాండ్‌లో గిల్ 5 టెస్టుల 10 ఇన్నింగ్స్‌లలో 673 పరుగులు చేశాడు.
ఇంగ్లాండ్‌తో గిల్ 12 టెస్టుల 22 ఇన్నింగ్స్‌లలో 58.85 సగటుతో 1177 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
భారత్ vs ఇంగ్లాండ్ మూడో టెస్టు వివరాలు
తేదీ- జులై 10 నుంచి 14 వరకు
టాస్ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
మ్యాచ్ సమయం: మధ్యాహ్నం 3:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం)
లైవ్ ప్రసారం: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్
లైవ్ స్ట్రీమింగ్: జియోహోట్‌స్టార్
మూడో టెస్టు ప్లేయింగ్ 11
ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11ని ప్రకటించింది, జోఫ్రా ఆర్చర్ రూపంలో ఒక మార్పు చేసింది. అయితే టాస్ సమయంలో టీమ్ ఇండియా జట్టును ప్రకటిస్తుంది. జస్ప్రీత్ బుమ్రా మూడో టెస్టు ఆడతాడు, కాబట్టి శుభ్‌మన్ గిల్ అండ్ టీమ్ అతని స్థానంలో ఎవరిని తొలగిస్తుందో చూడాలి.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా రచేర్, షోయబ్ బషీర్
భారతదేశం ప్లేయింగ్ 11: యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా.




















